Tuesday, October 9, 2018

రఘువంశమ్- 5.06


శ్లోకః
ఆధారబన్ధప్రముఖైః ప్రయత్నైః సంవర్ధితానాం సుతనిర్విశేషం ।
కచ్చిన్న వాయ్వాదిరుపప్లవో వః శ్రమచ్ఛిదామాశ్రమపాదపానాం ॥ 5.06 ॥

పదవిభాగః
ఆధార-బన్ధ-ప్రముఖైః ప్రయత్నైః సంవర్ధితానాం సుత-నిర్విశేషం । కచ్చిత్ న వాయు-ఆదిః ఉపప్లవః వః శ్రమ-ఛిదామ్ ఆశ్రమ-పాదపానాం ॥

అన్వయః
ఆధారబన్ధప్రముఖైః ప్రయత్నైః సుతనిర్విశేషం (యథా తథా) సంవర్ధితానాం శ్రమచ్ఛిదాం వః ఆశ్రమపాదపానాం వాయ్వాదిః ఉపప్లవః న (భవతి) కచ్చిత్? ॥ 5.06 ॥

వాచ్యపరివర్తనమ్
ఆధారబన్ధప్రముఖైః ప్రయత్నైః సుతనిర్విశేషం సంవర్ధితానాం శ్రమచ్ఛిదాం వః ఆశ్రమపాదపానాం వాయ్వాదినా ఉపప్లవేన న (భూయతే) ।।

సరలార్థః
భవద్భిః ఆలవాలబన్ధనజలసేచనాదిభిః ఉపాయైః సుతసదృశప్రేమ్ణా సంవర్ధితాః యే అశ్రమవృక్షాః ఫలచ్ఛాయాదానేన శ్రాన్తానాం సకలసన్తాపమ్ అపహరన్తి, తాన్ దావానలవాత్యాదిః ఉపద్రవః న బాధతే కచ్చిత్ ॥

తాత్పర్యమ్
(రఘువు కౌత్సుడితో) “పాదులు చేయడం నుంచి మొదలుకొని అనేకవిధాలుగా పాటుపడుతూ తమ సంతానంతో సమానంగా మీరు పెంచుతూ ఉన్నవీ, (ఫలఛాయాదులను ఇచ్చి) శ్రమను పరిహరించేవీ అయిన మీ ఆశ్రమవృక్షాలకు గాలుల వలన ఏ ముప్పూ వాటిల్లడం లేదు కదా?”

No comments:

Post a Comment