Sunday, September 30, 2018

రఘువంశమ్- 5.05


శ్లోకః
కాయేన వాచా మనసాపి శశ్వద్యత్సంభృతం వాసవధైర్యలోపి
ఆపాద్యతే న వ్యయమన్తరాయైః కచ్చిన్మహర్షేస్త్రివిధం తపస్తత్ 5.05

పదవిభాగః
కాయేన వాచా మనసా అపి శశ్వత్ యత్ సమ్భృతం వాసవ-ధైర్య-లోపి । ఆపాద్యతే న వ్యయమ్ అన్తరాయైః కచ్చిత్ మహర్షేః త్రి-విధం తపః తత్

అన్వయః
కాయేన వాచా మనసా అపి వాసవధైర్యలోపి యత్ మహర్షేః త్రివిధం తపః శశ్వత్ సమ్భృతమ్ తత తపః అన్తరాయైః వ్యయం న ఆపాద్యతే కచ్చిత్ 5.05

వాచ్యపరివర్తనమ్
మహర్షిః యత్ తపః సమ్భృతవాన్ అన్తరాయాః తత్ తపః వ్యయం న ఆపాదయన్తి

సరలార్థః
భవద్గురుః స వరతన్తుః నిరన్తరం కాయమనోవచనైః యద్ దుశ్చరం తపః కృతవాన్, యస్మాత్ పురందరోపి న ధైర్యమవలమ్బతే తత్తపః అన్తరాయాభావాత్ నిష్కణ్టకమ్?

తాత్పర్యమ్
(రఘువు కౌత్సునితో) “(వరతంతు)మహర్షి తన శరీరముతో, వాక్కుతో, మనస్సుతో చేసే తపస్సు - ఇంద్రుడి ధైర్యమును హరించగలిగినది, నిరంతరము కూడబెట్టుకుంటున్నదిఅంతరాయాల కారణంగా ఖర్చు కావడం లేదు కదా!”
(
ఇంద్రుడు తపోభంగం చేసేందుకు ప్రయత్నించడం, అప్సరసో తపోభంగాన్ని కలిగిస్తే శాపాలు పెట్టడంవాటివల్ల తపశ్శక్తిని కోల్పోవడం జరగడం లేదు కదా!)

రఘువంశమ్- 5.04


శ్లోకః
అప్యగ్రణీర్మన్త్రకృతామృషీణాం కుశాగ్రబుద్ధే కుశలీ గురుస్తే
యతస్త్వయా జ్ఞానమశేషమాప్తం లోకేన చైతన్యమివోష్ణరశ్మేః 5.04

పదవిభాగః
అపి అగ్రణీః మన్త్రకృతామ్ ఋషీణాం కుశ-అగ్ర-బుద్ధే కుశలీ గురుః తే యతః త్వయా జ్ఞానమ్ అశేషమ్ ఆప్తం లోకేన చైతన్యమ్ ఇవ ఉష్ణరశ్మేః

అన్వయః
హే కుశాగ్రబుద్ధే, మన్త్రకృతామ్ ఋషీణామ్ అగ్రణీః తే గురుః కుశలీ అపి? లోకేన ఉష్ణరష్మేః చైతన్యమ్ ఇవ త్వయా యతః అశేషం జ్ఞానమ్ ఆప్తమ్ 5.04

వాచ్యపరివర్తనమ్
అగ్రణ్యా గురుణా కుశలినా లోకః చైతన్యమ్ ఇవ త్వమ్ ఆప్తవాన్

సరలార్థః
హే సూక్ష్మబుద్ధే, బ్రహ్మన్, రవిర్యథా అన్ధకారాన్ధం లోక ప్రకాశేన ఉద్బోధయతి, తథా అజ్ఞానతిమిరాన్ధం త్వాం యః జ్ఞానప్రకాశేన ఉద్బోధితవాన్ స వేదనిధిః తే గురుః కుశలీ అస్తి కిమ్

తాత్పర్యమ్
(రఘువు కౌత్సునితో) “ కుశాగ్రబుద్ధీ, సూర్యుని నుంచి ప్రజలు చైతన్యాన్ని పొందినట్లు గురువు నుంచి నీవు సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందావో, వేదనిధులలో తొలి వరుస వాడైన నీ గురువు క్షేమమే కదా!”

రఘువంశమ్- 5.03


శ్లోకః
తం అర్చయిత్వా విధివద్విధిజ్ఞస్తపోధనం మానధనాగ్రయాయీ ।
విశామ్పతిర్విష్టరభాజం ఆరాత్కృతాఞ్జలిః కృత్యవిదిత్యువాచ 5.03

పదవిభాగః
తం అర్చయిత్వా విధివత్ విధిజ్ఞః తపః-ధనం మానధన-అగ్రయాయీ । విశామ్పతిః విష్టరభాజం ఆరాత్ కృత-అఞ్జలిః కృత్య-విత్ ఇతి ఉవాచ

అన్వయః
విధిజ్ఞః మానధనాగ్రయాయీ కృత్యవిత్ విశామ్పతిః తపోధనమ్ ఆరాత్ విష్టరభాజం తం (కౌత్సం) విధివత్ అర్చయిత్వా కృతాఞ్జలిః సన్ ఇతి ఉవాచ 5.03

వాచ్యపరివర్తనమ్
విధిజ్ఞేన మానధనాగ్రయాయినా కృత్యవిదా విశామ్పత్యా కృతాఞ్జలినా (సతా) తపోధనః ఆరాత్ విష్టరభాక్ సః విధివత్ అర్చయిత్వా ఇతి ఊచే ।।

సరలార్థః
యశోధనానాం ధురీణః శ్రుతశీలసమ్పన్నః నరపతిః వేదశాస్త్రసమ్పన్నం తం కౌత్సం శ్రౌతేన విధినా సత్కృతవాన్, పశ్చాత్ సమీపే సుఖాసీనే తస్మిన్ బద్ధాఞ్జలిః (సన్) ఆగమనప్రయోజనం పప్రచ్ఛ

తాత్పర్యమ్
శాస్త్రమును తెలిసినవాడు, అభిమానధనులలో మొదటి వరుసలోని వాడు, చేయవలసిన పని తెలిసినవాడు (కార్యజ్ఞుడు) అయిన రాజు సముచితాసనమున కూర్చోబెట్టి శాస్త్రప్రకారముగా పూజించి, చేతులు జోడించి ఇలా అన్నాడు.
[సముచితాసనము = దర్భాసనము, ఇక్కడ]

Sunday, September 23, 2018

రఘువంశమ్- 5.02


శ్లోకః
స మృన్మయే వీతహిరణ్మయత్వాత్పాత్రే నిధాయార్ఘ్యమనర్ఘశీలః
శ్రుతప్రకాశం యశసా ప్రకాశః ప్రత్యుజ్జగామాతిథిమాతిథేయః 5.02

పదవిభాగః
స మృన్మయే వీత-హిరణ్మయత్వాత్ పాత్రే నిధాయ అర్ఘ్యమ్ అనర్ఘ-శీలః శ్రుత-ప్రకాశం యశసా ప్రకాశః ప్రత్యుజ్జగామ అతిథిమ్ ఆతిథేయః

అన్వయః
అనర్ఘశీలః యశసా ప్రకాశః ఆతిథేయః సః (రఘుః) వీతహిరణ్మయత్వాత్ మృన్మయే పాత్రే అర్ఘ్యమ్ నిధాయ శ్రుతప్రకాశమ్ అతిథిమ్ ప్రత్యుజ్జగామ 5.02

వాచ్యపరివర్తనమ్
అనర్ఘశీలేన యశసా ప్రకాశేన ఆతిథేయేన తేన (రఘుణా) వీతహిరణ్మయత్వాత్ మృన్మయే పాత్రే అర్ఘ్యం నిధాయ శ్రుతప్రకాశః అతిథిః ప్రత్యుజ్జగ్మే

సరలార్థః
దివ్యప్రభావః శరణాగతరక్షకః (రఘుః) యజ్ఞే సర్వస్వదానాత్ ధాతుపాత్రాభావాత్ మృన్మయే పాత్రే పూజార్థమ్ ఉపకరణం సమాదాయ విద్యాసమ్పన్నమ్ అభ్యాగతం తం కౌత్సం ప్రత్యుజ్జగామ

తాత్పర్యమ్
వెలకట్టరానంత గొప్ప నడవడిని కలిగినవాడు, కీర్తి చేత ప్రకాశించేవాడు అయిన రఘువు బంగారు గిన్నెలు లేని కారణాన మట్టి పాత్రలలో అర్ఘ్యమునకు కావలసిన వస్తువులను ఉంచుకొని జ్ఞానముతో ప్రకాశించే అతిథిని ఎదుర్కొన్నాడు.

రఘువంశమ్- 5.01


శ్లోకః
తమధ్వరే విశ్వజితి క్షితీశం నిఃశేషవిశ్రాణితకోశజాతమ్
ఉపాత్తవిద్యో గురుదక్షిణార్థీ కౌత్సః ప్రపేదే వరతన్తుశిష్యః 5.01

పదవిభాగః
తమ్ అధ్వరే విశ్వజితి క్షితీశం నిఃశేష-విశ్రాణిత-కోశజాతమ్ఉపాత్త-విద్యః గురు-దక్షిణా-అర్థీ కౌత్సః ప్రపేదే వరతన్తు-శిష్యః

అన్వయః
ఉపాత్తవిద్యః వరతన్తుశిష్యః కౌత్సః గురుదక్షిణార్థీ సన్ విశ్వజితి అధ్వరే నిఃశేషవిశ్రాణితకోశజాతం తం క్షితీశం (రఘుమ్) ప్రపేదే 5.01

వాచ్యపరివర్తనమ్
ఉపాత్తవిద్యేన వరతన్తుశిష్యేణ కౌత్సేన గురుదక్షిణార్థినా (సతా) విశ్వజితి అధ్వరే నిఃశేషవిశ్రాణితకోశజాతః స క్షితీశః (రఘుః) ప్రపేదే

సరలార్థః
అథ రఘుణా విశ్వజితి యజ్ఞే నిఃశేషితే సర్వస్వే, వరతన్తునామ్నః కస్యచిన్మహర్షేః కౌత్సనామా శిష్యః గురుసకాశాత్ వేదాన్ యథావదధీత్య గురుదక్షిణాం ప్రార్థయితుం రఘుసమీపమ్ ఆజగామ

తాత్పర్యమ్
విశ్వజిద్యాగములో తన కోశాగారములోని సంపదనంతటినీ దానము చేసిన ఆ రాజు వద్దకు, విద్యాభ్యాసమును పూర్తిచేసికొని గురుదక్షిణ కోసం (సహాయము చేయమని అడిగేందుకు) కౌత్సుడు అనే వరతన్తుమహర్షి శిష్యుడు వచ్చాడు.

Sunday, September 16, 2018

రఘువంశమ్- 4.88


శ్లోకః
తే రేఖాధ్వజకులిశాతపత్రచిహ్నం సమ్రాజశ్చరణయుగం ప్రసాదలభ్యమ్
ప్రస్థానప్రణతిభిరఙ్గులీషు చక్రుర్మౌలిస్రక్చ్యుతమకరన్దరేణుగౌరమ్4.88

పదవిభాగః
తే రేఖా-ధ్వజ-కులిశ-ఆతపత్ర-చిహ్నం సమ్రాజః-చరణ-యుగం ప్రసాద-లభ్యమ్ ప్రస్థాన-ప్రణతిభిః-అఙ్గులీషు చక్రుః మౌలిస్రక్-చ్యుత-మకరన్ద-రేణు-గౌరమ్

అన్వయః
తే (రాజన్యాః) రేఖాధ్వజకులిశాతపత్రచిహ్నం ప్రసాదలభ్యం సమ్రాజః (రఘోః) చరణయుగమ్ అఙ్గులీషు ప్రస్థానప్రణతిభిః మౌలిస్రక్చ్యుతమకరన్దరేణుగౌరం చక్రుః4.88

వాచ్యపరివర్తనమ్
తైః రేఖాధ్వజకులిశాతపత్రచిహ్నం ప్రసాదలభ్యం సమ్రాజః (రఘోః) చరణయుగమ్ అఙ్గులీషు ప్రస్థానప్రణతిభిః మౌలిస్రక్చ్యుతమకరన్దరేణుగౌరం చక్రే

సరలార్థః
ప్రయాణకాలే తే సర్వే భూపాః చక్రవర్తిలక్షణోపేతే రఘోః చరణద్వన్ద్వే నిపత్య ప్రణేముః, తదా తేషాం శిరోమాల్యవిగలితాః పుష్పరసాః పరాగాశ్చ రఘోః చరణద్వయమ్ అలంచక్రుః

తాత్పర్యమ్
ధ్వజరేఖ, కులిశరేఖ, చత్రరేఖ అనే మూడు సార్వభౌమలక్షణాలను కలిగినవీ, అతని అనుగ్రహము ఉంటేనే తప్ప సేవించలేనటువంటివీ అయిన రఘువు పాదాలను ఆ రాజులు ప్రయాణసమయంలో నమస్కరించారు. వారి తలలపై పూలదండలనుంచి స్రవించిన తేనెలతో పుప్పొడులతో రఘువు పాదాలు ఎర్రబడ్డాయి.
[కలశాతపత్రం అని పాఠాంతరము]

రఘువంశమ్- 4.87


శ్లోకః
సత్రాన్తే సచివసఖః పురస్క్రియాభిర్గుర్వీభిః శమితపరాజయవ్యలీకాన్
కాకుత్స్థశ్చిరవిరహోత్సుకావరోధాన్రాజన్యాన్ స్వపురనివృత్తయే అనుమేనే4.87

పదవిభాగః
సచివ-సఖః కాకుత్స్థః సత్ర-అన్తే పురస్క్రియాభిః గుర్వీభిః శమిత-పరాజయ-వ్యలీకాన్ చిర-విరహ-ఉత్సుక-అవరోధాన్ రాజన్యాన్ స్వపుర-నివృత్తయే అనుమేనే

అన్వయః
సచివసఖః కాకుత్స్థః సత్రాన్తే గుర్వీభిః పురస్క్రియాభిః శమితపరాజయవ్యలీకాన్ చిరవిరహోత్సుకావరోధాన్ రాజన్యాన్ స్వపురనివృత్తయే అనుమేనే4.87

వాచ్యపరివర్తనమ్
సచివసఖేన కాకుత్స్థేన సత్రాన్తే గుర్వీభిః పురస్క్రియాభిః శమితపరాజయవ్యలీకాః చిరవిరహోత్సుకావరోధాః రాజన్యా స్వపురనివృత్తయే అనుమేనిరే

సరలార్థః
సమాప్తే చ యజ్ఞే మన్త్రిసహితో రఘుః బహుతరైః దానమానైః సత్కారం కృత్వా, పరాభవప్రాప్తానాం నృపతీనాం పరాభవక్షోభం నివారయామాస, ప్రియాభ్యః చిరవిరహితాంశ్చ తాన్ నృపతీన్ స్వరాష్ట్రగమనాయ అనుజ్ఞాతవాన్

తాత్పర్యమ్
యజ్ఞము పూర్తయ్యాక మంత్రిసమేతుడైన రఘువు అనేక బహుమానాలను ఇచ్చి, పరాజయదుఃఖపీడితులై ఉన్న రాజులను ఊరడించాడు. విరహార్తలైన తమ అంతఃపురస్త్రీల చేత ఎదురుచూడబడుతున్న ఆ రాజులను తమ తమ నగరాలకు వెళ్ళేందుకు అనుమతినిచ్చాడు.

Saturday, September 15, 2018

రఘువంశమ్- 4.86


శ్లోకః
స విశ్వజితమాజహ్రే యజ్ఞం సర్వస్వదక్షిణమ్
ఆదానం హి విసర్గాయ సతాం వారిముచామివ4.86

పదవిభాగః
స విశ్వజితమ్ జహ్రే యజ్ఞం సర్వస్వ-దక్షిణమ్ ఆదానం హి విసర్గాయ సతాం వారిముచామ్ ఇవ

అన్వయః
సః (రఘుః) సర్వస్వదక్షిణం విశ్వజితం యజ్ఞమ్ ఆజహ్రే, హి (యతః) వారిముచామ్ ఇవ సతామ్ ఆదానం విసర్గాయ (భవతి) 4.86

వాచ్యపరివర్తనమ్
తేన సర్వస్వదక్షిణః విశ్వజిత్ యజ్ఞః ఆజహ్రే, హి (యతః) వారిముచామ్ ఇవ సతామ్ ఆదానేన విసర్గాయ భూయతే

సరలార్థః
స రఘుః పశ్చాత్ విశ్వజిన్నామకం మహాయజ్ఞం కృతవాన్ యస్మింశ్చ స్వభుజోపార్జితం సమ్పూర్ణమైశ్వర్యం దక్షిణారూపేణ దత్తవాన్, మేఘా యథా జలదానాయ సలిలాని ఆదదతే, ఏవం మహాత్మానోపి దానాయ ధనాని ఆదదతే, న స్వప్రయోజనాయ

తాత్పర్యమ్
తన సర్వస్వాన్ని దక్షిణగా సమర్పిస్తూ అతడు విశ్వజిత్ అనే యాగాన్ని చేసాడు. మేఘముల వలె మహాత్ములు కూడా ఇవ్వడం కోసమే సంపాదిస్తారు కదా!

రఘువంశమ్- 4.85


శ్లోకః
ఇతి జిత్వా దిశో జిష్ణుర్న్యవర్తత రథోద్ధతమ్
రజో విశ్రామయన్రాజ్ఞాం ఛత్రశూన్యేషు మౌలిషు4.85

పదవిభాగః
ఇతి జిత్వా దిశః జిష్ణుః న్యవర్తత రథ-ఉద్ధతమ్ రజః విశ్రామయన్ రాజ్ఞాం ఛత్ర-శూన్యేషు మౌలిషు

అన్వయః
జిష్ణుః (సః రఘుః) ఇతి దిశః జిత్వా ఛత్రశూన్యేషు రాజ్ఞాం మౌలిషు రథోద్ధతం రజః విశ్రామయన్ (సన్) న్యవర్తత4.85

వాచ్యపరివర్తనమ్
జిష్ణునా (తేన రఘుణా) ఇతి దిశః జిత్వా ఛత్రశూన్యేషు రాజ్ఞాం మౌలిషు రథోద్ధతం రజః విశ్రామయతా (సతా) న్యవర్తత

సరలార్థః
ఇత్థం విజయీ రఘుః సమ్పూర్ణాం పృథివీం నిర్జిత్య జగతః ఏకాధిపత్యం లబ్ధ్వా నిజరాజధానీమ్ అజగామ । తస్య రథోత్కీర్ణాని రజాంసి పరాభూతస్య భూపతిమణ్డలస్య ఛత్రరహితేషు ముకుటేషు ససఞ్జుః 

తాత్పర్యమ్
ఈ విధంగా దిగ్విజయాన్ని పూర్తి చేసిన ఆ విజేత (రఘువు) తన రథధూళి ఛత్రరహితులైన రాజుల తలలపై పడుతూ ఉండగా, (తన రాజధానికి) తిరిగివెళ్ళాడు.
[రఘువు ఏకఛత్రాధిపత్యాన్ని వహించినందున మిగతా రాజులు ఛత్రహీనులయ్యారని భావము.]

రఘువంశమ్- 4.84


శ్లోకః
కామరూపేశ్వరస్తస్య హేమపీఠాధిదేవతామ్
రత్నపుష్పోపహారేణచ్ఛాయామానర్చ పాదయోః4.84

పదవిభాగః
కామరూప-ఈశ్వరః తస్య హేమ-పీఠ-అధిదేవతామ్ రత్న-పుష్ప-ఉపహారేణ ఛాయామ్ ఆనర్చ పాదయోః

అన్వయః
కామరూపేశ్వరః హేమపీఠాధిదేవతాం తస్య (రఘోః) పాదయోః ఛాయాం రత్నపుష్పోపహారేణ ఆనర్చ 4.84

వాచ్యపరివర్తనమ్
కామరూపేశ్వరేణ రత్నపుష్పోపహారేణ హేమపీఠాధిదేవతా తస్య పాదయోః ఛాయా ఆనర్చే

సరలార్థః
యథా హి కశ్చిత్ పరమదేవతాం ప్రసాదయితుం కుసుమాఞ్జలినా తాం యత్నతః పూజయతి, తయా కామరూపేశ్వరోఽపి నిర్మలే సువర్ణమయే పాదపీఠే తస్య అధిష్ఠాత్రీ దేవతామివ రఘోః చరణచ్ఛాయాం కుసుమాఞ్జలినా పూజయామాస

తాత్పర్యమ్
కామరూపరాజ్యపు ప్రభువు సువర్ణపీఠముపై నిలిపిన దేవత వలె ఉన్న రఘువు యొక్క పాదాలకు రత్నపుష్పములను సమర్పించి పూజించాడు.

రఘువంశమ్- 4.83


శ్లోకః
తమీశః కామరూపాణామత్యాఖణ్డలవిక్రమమ్
భేజే భిన్నకటైర్నాగైరన్యానుపరురోధ యైః4.83

పదవిభాగః
తమీశః కామరూపాణామ్ అతి-ఆఖణ్డల-విక్రమమ్ భేజే భిన్న-కటైః నాగైః అన్యాన్ ఉపరురోధ యైః

అన్వయః
కామరూపాణామ్ ఈశః యైః (గజైః) అన్యాన్ (రాజ్ఞః) ఉపరురోధ, భిన్నకటైః తైః నాగైః అత్యాఖండలవిక్రమం తం (రఘుమ్) భేజే4.83

వాచ్యపరివర్తనమ్
కామరూపాణామ్ ఈశేన యైః అన్యే ఉపరురుధిరే,భిన్నకటైః తై నాగైః అత్యాఖండలవిక్రమః సః ( రఘుః) భేజే

సరలార్థః
కామరూపేశ్వరః యుద్ధే మహాబలైః మత్తగజైః బహుశః శత్రుపక్షాన్ నిరాచకార, తానేవ మత్తగజాన్ ఉపహృత్య తం రఘుం శరణం ప్రాప్తవాన్

తాత్పర్యమ్
పరాక్రమములో ఇంద్రుడిని మించిన రఘువుకు కామరూపదేశపు రాజు - ఇతరరాజులను జయించిన - మదపుటేనుగులను కానుకగా ఇచ్చి సేవించాడు.

రఘువంశమ్- 4.82


శ్లోకః
న ప్రసేహే స రుద్ధార్కమధారావర్షదుర్దినమ్
రథవర్త్మరజోఽప్యస్య కుత ఏవ పతాకినీమ్ 4.82

పదవిభాగః
న ప్రసేహే స రుద్ధ-అర్కమ్ అధారా-వర్ష-దుర్దినమ్ రథ-వర్త్మ-రజః అపి అస్య కుత ఏవ పతాకినీమ్

అన్వయః
సః (ప్రాగ్జ్యోతిషేశ్వరః) అస్య (రఘోః) అధారావర్షదుర్దినం రుద్ధార్కం రథవర్త్మరజః అపి న ప్రసేహే, పతాకినీం (తు) కుత ఏవ (ప్రసేహే) 4.82

వాచ్యపరివర్తనమ్
తేన అస్య (రఘోః) అధారావర్షదుర్దినం రుద్ధార్కం రథవర్త్మరజః అపి న ప్రసేహే పతాకినీ తు కుత ఏవ (ప్రసేహే)

సరలార్థః
ఘనం మేఘసమూహమివ రవిమణ్డలాచ్ఛాదకం రఘుసైన్యరథోత్థితం ధూలిసమూహం దృష్ట్వైవ ప్రాగ్జ్యోతిషేశ్వరః వ్యాకులోభూత్, రఘుసైన్యేన సహ తస్య సమరః కుతః

తాత్పర్యమ్
రఘువుయొక్క రథములు నడచిన దారిలో రేగిన దుమ్ము మేఘంలాగా సూర్యుడిని కప్పివేసి దుర్దినాన్ని సృష్టించింది. ఆ దుమ్మునే తట్టుకోలేని ప్రాగ్జ్యోతిషపతి  అతడి సైన్యాన్ని ఏవిధంగా తట్టుకోగలడు?
(మేఘచ్ఛన్నేఽహ్ని దుర్దినమ్అమరకోశంపగలు మేఘావృతమైనప్పుడు దుర్దినము అంటారు)

రఘువంశమ్- 4.81


శ్లోకః
చకమ్పే తీర్ణలౌహిత్యే తస్మిన్ప్రాగ్జ్యోతిషేశ్వరః
తద్గజాలానతాం ప్రాప్తైః సహ కాలాగురుద్రుమైః4.81

పదవిభాగః
చకమ్పే తీర్ణ-లౌహిత్యే తస్మిన్ ప్రాగ్జ్యోతిష-ఈశ్వరః తత్ గజ-అలానతాం ప్రాప్తైః సహ కాల-అగురు-ద్రుమైః

అన్వయః
తస్మిన్ (రఘౌ) తీర్ణలౌహిత్యే (సతి) ప్రాగ్జ్యోతిషేశ్వరః తద్గజాలానతాం ప్రాప్తైః కాలాగురుద్రుమైః సహ చకమ్పే4.81

వాచ్యపరివర్తనమ్
తస్మిన్ (రఘౌ) తీర్ణలౌహిత్యే (సతి) ప్రాగ్జ్యోతిషేశ్వరేణ తద్గజాలానతాం ప్రాప్తైః కాలాగురుద్రుమైః సహ చకమ్పే

సరలార్థః
బ్రహ్మపుత్రనదమ్ ఉత్తీర్య ప్రాగ్జ్యోతిషం దేశం సమ్ప్రాప్తే రఘౌ కాలాగురుతరుషు బద్ధానాం రఘునాగానాం గ్రీవాశృఙ్ఖలాకర్షణాత్ తే వృక్షాః యథా కమ్పన్తే స్మ, తద్దేశనాయకోపి తథా చకమ్పే

తాత్పర్యమ్
రఘువు లౌహిత్య అనే నదిని దాటి రాగా, అతడి (రఘువు యొక్క) ఏనుగులను కట్టివేసిన నల్ల అగరు చెట్లతో సహా ప్రాగ్జ్యోతిషదేశపు రాజు కూడా వణికిపోయాడు.

రఘువంశమ్- 4.80


శ్లోకః
తత్రాక్షోభ్యం యశోరాశిం నివేశ్యావరురోహ సః
పౌలస్త్యతులితస్యాద్రేరాదధాన ఇవ హ్రియమ్ 4.80

పదవిభాగః
తత్ర-అక్షోభ్యం యశో-రాశిం నివేశ్య అవరురోహ సః పౌలస్త్య-తులితస్య అద్రేః అదధాన ఇవ హ్రియమ్

అన్వయః
సః ( రఘుః) తత్ర (హిమాద్రౌ) అక్షోభ్యం యశోరాశిం నివేశ్య, పౌలస్త్యతులితస్య అద్రేః (కైలాసస్య) హ్రియమ్ ఆదధాన ఇవ అవరురోహ4.80

వాచ్యపరివర్తనమ్
తేన తత్ర అక్షోభ్యం యశోరాశిం నివేశ్య, పౌలస్త్యతులితస్య అద్రేః హ్రియమ్ ఆదధానేన ఇవ, అవరురుహే

సరలార్థః
స రఘుః ఇత్థం హిమాచలే అక్షయాం కీర్తిం నిధాయ రావణతులితస్య కైలాసస్య లజ్జామ్ ఆదధాన ఇవ తస్మాత్ పర్వతాత్ అవతతార

తాత్పర్యమ్
రఘువు - కదిలించడానికి వీలుపడనంత కీర్తిని అక్కడ ఉంచి రావణుడిచేత తూచబడ్డ కైలాసశిఖరమునకు లజ్జను కలిగించి (హిమాలయపర్వతాల నుంచి) క్రిందికి దిగాడు.
[రఘువు కీర్తి కైలాసశిఖరము కన్నా ఎత్తుగా తెల్లగా ఉన్నదని భావము; ఒక రాజు జయించిన ప్రాంతాన్ని మరో రాజు మళ్ళీ జయించకూడదు కాబట్టి కైలాసశిఖరాన్ని రఘువు అధిరోహించకుండానే వెనుతిరిగాడట.]