Friday, September 7, 2018

రఘువంశమ్- 4.05

శ్లోకః
ఛాయామణ్డలలక్ష్యేణ తమదృశ్యా కిల స్వయమ్
పద్మా పద్మాతపత్రేణ భేజే సామ్రాజ్యదీక్షితమ్4.05

పదవిభాగః
ఛాయా-మణ్డల-లక్ష్యేణ తమ్ అదృశ్యా కిల స్వయమ్పద్మా పద్మ-ఆతపత్రేణ భేజే సామ్రాజ్య-దీక్షితమ్

అన్వయః
కిల పద్మా స్వయం అదృశ్యా (సతీ) సామ్రాజ్యదీక్షితం తం ఛాయామణ్డలలక్ష్యేణ పద్మాతపత్రేణ భేజే 4.05

వాచ్యపరివర్తనం
కిల పద్మయా స్వయమ్ అదృశ్యయా (సత్యా) సామ్రాజ్యదీక్షితః సః ఛాయామణ్డలలక్ష్యేణ పద్మాతపత్రేణ భేజే

సరలార్థః
విష్ణుప్రియా లక్ష్మీః అదృశ్యభావేన దివ్యప్రభాపుఞ్జదర్శనేన సింహాసనాధిష్ఠితస్య తస్య శిరసి దివ్యకమలమయం ఛత్రం ధృతవతీ.

తాత్పర్యము
ఆయన చుట్టూ ఉన్న కాంతివలయమును బట్టి - సామ్రాజ్యపాలనాదీక్షను బూనిన రఘువును స్వయంగా (రాజ్య) లక్ష్మీదేవియే అదృశ్యంగా తామరపూవు గొడుగుతో సేవిస్తున్నదా అని అనిపిస్తుంది.

No comments:

Post a Comment