Thursday, August 30, 2018

రఘువంశమ్-3.70

శ్లోకః
అథ విషయవ్యావృత్తాత్మా యథావిధి సూనవే
నృపతికకుదం దత్త్వా యూనే సితాతపవారణమ్
మునివనతరుచ్ఛాయాం దేవ్యా తయా సహ శిశ్రియే
గలితవయసామిక్ష్వాకూణామిదం హి కులవ్రతమ్ 3.70

పదవిభాగః
అథ విషయ-వ్యావృత్త-ఆత్మా యథావిధి సూనవే నృపతి-కకుదం దత్త్వా యూనే సిత-ఆతపవారణమ్
ముని-వన-తరుః-ఛాయాం దేవ్యా తయా సహ శిశ్రియే గలిత-వయసామ్ ఇక్ష్వాకూణామ్ ఇదం హి కుల-వ్రతమ్

అన్వయః
విషయవ్యావృత్తాత్మా సః దిలీపః యూనే సూనవే యథావిధి నృపతికకుదం సితాతపవారణం దత్త్వా తయా దేవ్యా (సుదక్షిణయా) సహ మునివనతరుచ్ఛాయాం శిశ్రియే, హి (యతః) గలితవయసామ్ ఇక్ష్వాకూణాం ఇదం హి కులవ్రతం (అస్తి) 3.70

వాచ్యపరివర్తనం
అథ విషయవ్యావృత్తాత్మనా తేన యూనే సూనవే యథావిధి నృపతికకుదం సితాతపవారణం దత్త్వా, తయా దేవ్యా సహ మునివనతరుచ్ఛాయా శిశ్రియే, హి గలితవయసామ్ ఇక్ష్వాకూణామ్ అనేన కులవ్రతేన (భూయతే)

సరలార్థః
అథ వృద్ధో రాజా సుయోగ్యం పుత్రం రఘుం సామ్రాజ్యే అభిషిచ్య సర్వాంశ్చ విషయాన్ సన్త్యజ్య పరమపురుషార్థలాభాయ సస్త్రీకః తపోవనే వాసమకరోత్ యతః వార్ధక్యే వయసి ఇక్ష్వాకుకులోత్పన్నానాం ఏవ కులాచారః

తాత్పర్యమ్
ఇంద్రియసుఖాలపై నుంచి మనస్సు మళ్ళిన ఆ దిలీపుడు యువకుడైన రఘువుకు శాస్త్రానుసారంగా రాజచిహ్నమైన తెల్లని గొడుగును ఇచ్చి (రాజ్యభారాన్ని అప్పగించి) తన భార్యయైన సుదక్షిణతో కలిసి తపోవనములోని ఒక చెట్టు నీడను ఆశ్రయించాడు (వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాడు). ఇది వయస్సు పైబడిన ఇక్ష్వాకువంశీయులు తరతరాలుగా పాటిస్తూ వస్తున్న ఆచారము కదా.

రఘువంశమ్-3.69


శ్లోకః
ఇతి క్షితీశో నవతిం నవాధికాం మహాక్రతూనాం మహనీయశాసనః
సమారురుక్షుర్దివమాయుషః క్షయే తతాన సోపానపరమ్పరామివ3.69

పదవిభాగః
ఇతి క్షితి-ఈశః నవతిం నవ-అధికాం మహా-క్రతూనాం మహనీయ-శాసనః సమారురుక్షుః దివమ్ ఆయుషః క్షయే తతాన సోపాన-పరమ్పరామ్ ఇవ

అన్వయః
మహనీయశాసనః క్షితీశః ఆయుషః క్షయే దివం సమారురుక్షుః ఇతి మహాక్రతూనాం నవాధికాం నవతిం సోపానపరమ్పరామ్ ఇవ తతాన 3.69

వాచ్యపరివర్తనం
మహనీయశాసనేన క్షితీశేన ఆయుషః క్షయే దివం సమారుహక్షుణా ఇతి సోపానపరమ్పరా ఇవా మహాక్రతూనాం నవాధికా నవతిః తేనే

సరలార్థః
పూజనీయాజ్ఞః రాజా ఏవం నవనవతిసంఖ్యకాన్ అశ్వమేధయజ్ఞాన్ యథావిధి కృత్వా దేహాన్తే తేషాం స్వర్గారోహణస్య సోపానపణ్గ్క్తీః అకరోత్

తాత్పర్యమ్
పూజింపదగ్గ పాలకుడైన దిలీపుడు ఈ విధంగా తొంభైతొమ్మిది క్రతువులను చేసితన దేహాంతసమయాన ఆ యజ్ఞాలనే స్వర్గారోహణకు మెట్ల వరుసగా అమర్చుకున్నాడు.

రఘువంశమ్-3.68

శ్లోకః
తమభ్యనన్దత్ ప్రథమం ప్రబోధితః ప్రజేశ్వరః శాసనహారిణా హరేః
పరామృశన్ హర్షజడేన పాణినా తదీయమఙ్గం కులిశవ్రణాఙ్కితమ్3.68

పదవిభాగః
తమ్ అభ్యనన్దత్ ప్రథమం ప్రబోధితః ప్రజా-ఈశ్వరః శాసన-హారిణా హరేః పరామృశన్ హర్ష-జడేన పాణినా తదీయమ్ అఙ్గం కులిశ-వ్రణ-అఙ్కితమ్

అన్వయః
హరేః శాసనహారిణా ప్రథమం ప్రబోధితః ప్రజేశ్వరః హర్షజడేన పాణినా, కులిశవ్రణాఙ్కితం తదీయమ్ అఙ్గమ్ పరామృశన్ తం (రఘుం) అభ్యనన్దత్

వాచ్యపరివర్తనం
హరేః శాసనహారిణా ప్రథమం ప్రబోధితేన, హర్షజడేనపాణినా, కులిశవ్రణాఙ్కితం తదీయమ్ అఙ్గమ్, పరామృశతా (సతా) ప్రజేశ్వరేణ సః అభ్యనన్దత

సరలార్థః
రఘోరాగమనాత్ పూర్వమేవ దిలీపః పురన్దరదూతముఖాత్ సర్వం వృత్తాన్తం జ్ఞాతవాన్. అధునా సమీపమాగతం తం సుతమాలిఙ్గనాదిభిః అభినన్దితవాన్ వజ్రప్రహారవ్రణయుక్తం సుతస్య శరీరం కరతలేన సదయం స్పృశన్ ఆనన్దయుక్తో బభూవ

తాత్పర్యమ్
ఇంద్రుడి ఆజ్ఞను (సందేశాన్ని) తీసుకొని వచ్చిన దూత చేత ముందే అన్ని విషయాలను తెలుసుకొన్న దిలీపుడు సంతోషముతో చల్లబడిన చేతులు గలవాడై వజ్రాయుధపు గాయము గల రఘువు శరీరాన్ని నిమిరి అతడిని అభినందించాడు.

రఘువంశమ్-3.67


శ్లోకః
తథేతి కామం ప్రతిశుశ్రువాన్ రఘోర్యథాగతం మాతలిసారథిర్యయౌ
నృపస్య నాతిప్రమనాః సదోగృహం సుదక్షిణాసూనురపి న్యవర్తత3.67

పదవిభాగః
తథా ఇతి కామం ప్రతిశుశ్రువాన్ రఘోః యథా-ఆగతం మాతలిసారథిః యయౌ నృపస్య -అతి-ప్రమనాః సదః-గృహం సుదక్షిణా-సూనుః అపి న్యవర్తత

అన్వయః
మాతలిసారథిః (ఇంద్రః)  రఘోః కామంతథాఇతి ప్రతిశుశ్రువాన్, యథాఆగతం యయౌ, సుదక్షిణాసూనుః అపి -అతిప్రమనాః నృపస్య సదోగృహం న్యవర్తత 3.67

వాచ్యపరివర్తనం మాతలిసారథినా ప్రతిశుశ్రువే, సుదక్షిణాసూనా నాతిప్రమనసా (సతా) న్యవృత్యత.

సరలార్థః
''ఏవం భవతుఇతి వచనేన రఘోః విజ్ఞప్తిమఙ్గీకృతా యథాస్థానం గతే ఇంద్రే రఘురపి నాతిప్రసన్నహృదయః నృపస్య సదోగృహమభ్యగచ్ఛత్

తాత్పర్యమ్
మాతలిని సారథిగా గల ఇంద్రుడుతథాస్తుఅని రఘువు కోరికకు అంగీకారం తెలిపి వచ్చినదోవన వెళ్ళిపోయాడు. మరీ అంతగా సంతోషం లేకుండా రఘువు కూడా (యాగ/రాజ) సభాగృహానికి తిరిగివెళ్ళాడు.

రఘువంశమ్-3.66


శ్లోకః
యథా వృత్తాన్తమిమం సదోగతస్త్రిలోచనైకాంశతయా దురాసదః
తవైవ సన్దేశహరాద్విశాంపతిః శృణోతి లోకేశ తథా విధీయతామ్3.66

పదవిభాగః
యథా వృత్తాన్తమ్ ఇమం సదః-గతః త్రిలోచన-ఏక-అంశతయా దురాసదః తవ ఏవ సన్దేశహరాత్ విశాంపతిః శృణోతి లోకేశ తథా విధీయతామ్

అన్వయః
సదోతః త్రిలోచనైకాంశతయా దురాసదః విశాంపతిః (దిలీపః) యథా తవ ఏవ సన్దేశహరాత్ ఇమం వృత్తాన్తం శృణోతి, లోకేశ(త్వయా) తథా విధీయతామ్ 3.66

వాచ్యపరివర్తనం
సదోగతేన త్రిలోచనైకాంశతయా దురాసదేన విశాంపత్యా యథా తవ ఏవ సన్దేశహరాత్ అయం వృత్తాన్తః శ్రూయతే, హే లోకేశ, త్వం తథా విధేహి

సరలార్థః
పితా మే దిలీపః యజ్ఞదీక్షితతయా అష్టమూర్తేః శివస్య యజమానమూర్తిరూపేణ స్థితిం కరోతి, అధునా తత్సమీపే అన్యః కోఽపి గన్తుం శక్నోతి, అతః తవైవ చరో గత్వా మమ పిత్రే సర్వమిమం చరిత్రం కథయతు ఇతి మే త్వయి విజ్ఞప్తిః

తాత్పర్యమ్
(రఘువు ఇంద్రుడితో) “దిలీపుడు యాగసభలో (లేక రాజసభలో) ఉన్నవాడు, మూడు కన్నుల దేవుడైన శివుడి అంశ అయినందున సమీపించుటకు వీలు కాని వాడు. అందుచేత నీయొక్క దూతతో ఈ సమాచారాన్ని ఆయన చెవిన వేయవలసినది.”
[కేశవపంతుల వారి వ్యాఖ్య నుంచి: “భూతార్కచన్ద్రయజ్వానో మూర్తయోష్టౌ ప్రకీర్తితాః” – పృథివి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, యజ్వ (యాగదీక్షితుడు); ఇవి శివుని అష్టమూర్తులు, ఇందులో దిలీపుడు యజ్వ కనుక త్రిలోచనుని యొక అంశగా చెప్పబడెనని గ్రహింపవలయును.”]

రఘువంశమ్-3.65


శ్లోకః
అమోచ్యమశ్వం యది మన్యసే ప్రభో తతః సమాప్తే విధినైవ కర్మణి
అజస్రదీక్షాప్రయతః మద్గురుః క్రతోరశేషేణ ఫలేన యుజ్యతామ్3.65

పదవిభాగః
అమోచ్యమ్ అశ్వం యది మన్యసే ప్రభో తతః సమాప్తే విధినా ఏవ కర్మణి అజస్ర-దీక్షా-ప్రయతః సః మత్-గురుః క్రతో అశేషేణ ఫలేన యుజ్యతామ్

అన్వయః
ప్రభో! యది (త్వమ్) అశ్వం అమోచ్యం మన్యసే తతః (తర్హి) (త్వయా) అజస్రదీక్షాప్రయతః సః మద్గురుః విధినా ఏవ కర్మణి సమాప్తే (సతి) క్రతోః అశేషేణ ఫలేన యుజ్యతామ్ 3.65

వాచ్యపరివర్తనం
హేప్రభో! యది త్వయా అశ్వః అమోచ్యః మన్యతే, తతః అజస్రదీక్షాప్రవతేన మద్గురుణాయుజ్యతామ్

సరలార్థః
హే ఇంద్ర, యది అశ్వప్రత్యర్పణం నైవ బుధ్యసే తర్హి యథా మే పితా ఇమమశ్వం వినా అపి అస్య అశ్వమేధయజ్ఞస్య సంపూర్ణం ఫలం లభేత తథా విధీయతామ్, ఇతి కృతే ద్వయోఽరేవ కార్యసిద్ధిః భవేత్

తాత్పర్యమ్
(ఇంద్రుడితో రఘువు), “ఓ దేవా, ఈ గుఱ్ఱము విడువతగదని నీవు భావించినట్లైతే, ఎల్లప్పుడూ (యజ్ఞ)దీక్షాతత్పరుడై ఉండే నా తండ్రికి శాస్త్రోక్తంగా యజ్ఞపరిసమాప్తి వలన కలిగే సంపూర్ణమైన ఫలితాన్ని కలిగించుము.”

రఘువంశమ్-3.64


శ్లోకః
తతో నిషఙ్గాదసమగ్రముద్ధృతం సువర్ణపుఙ్ఖద్యుతిరఞ్జితాఙ్గులిమ్
నరేన్ద్రసూనుః ప్రతిసంహరన్నిషుం ప్రియంవదః ప్రత్యవదత్సురేశ్వరమ్3.64

పదవిభాగః
తతః నిషఙ్గాత్ అసమగ్రమ్ ఉద్ధృతం సువర్ణ-పుఙ్ఖ-ద్యుతి-రఞ్జిత-అఙ్గులిమ్ నరేన్ద్ర-సూనుః ప్రతిసంహరన్ ఇషుం ప్రియంవదః ప్రత్యవదత్ సురేశ్వరమ్

అన్వయః
తతః నిషఙ్గాత్ అసమగ్రం ఉద్ధృతం సువర్ణపుఙ్ఖద్యుతిరఞ్జితాఙ్గులిమ్ ఇషుం ప్రతిసంహరన్ ప్రియంవదః నరేన్ద్రసూనుః (రఘుః) సురేశ్వరం ప్రతి అవదత్ 3.64

వాచ్యపరివర్తనం
ప్రియంవదేన నరేన్ద్రసూనునాప్రతిసంహర్తా సురేశ్వరః ప్రత్యౌద్యత

సరలార్థః
త్యక్తయుద్ధస్య ఇన్ద్రస్య తథా సాన్త్వవచనం శ్రుత్వా రఘుః నిషఙ్గాత్ అర్ధనిస్సారితం సువర్ణ-పుఙ్ఖ-ప్రభా-భాస్వరం బాణం పునరేవ తూణీరే స్థాపయన్ వినీతం పురన్దరం ప్రియవచనైః ప్రత్యువాచ

తాత్పర్యము అమ్ములపొది నుండి పూర్తిగా తీయబడని బాణపు బంగారు పిడి యొక్క కాంతి చేత రఘువు యొక్క చేతి వేళ్ళు రంజితమైనాయి. ఆ బాణాన్ని మరల అమ్ములపొదిలో ఉంచివేసి, ప్రియముగా మాట్లాడేవాడైన  ఆ యువరాజు ఇంద్రుడికి ఈవిధంగా సమాధానం చెప్పాడు.

రఘువంశమ్-3.63


శ్లోకః
అసఙ్గమద్రిష్వపి సారవత్తయా మే త్వదన్యేన విసోఢమాయుధమ్
అవేహి మాం ప్రీతమృతే తురఙ్గమాత్కిమిచ్ఛసీతి స్ఫుటమాహ వాసవః 3.63

పదవిభాగః
అసఙ్గమ్ అద్రిషు అపి సారవత్తయా మే త్వత్ అన్యేన విసోఢమ్ ఆయుధమ్ అవేహి మాం ప్రీతమ్ ఋతే తురఙ్గమాత్ కిమ్ ఇచ్ఛసి ఇతి స్ఫుటమాహ వాసవః

అన్వయః
సారవత్తయా అద్రిషు అపి అసఙ్గమ్ మే ఆయుధం త్వదన్యేన విసోఢమ్, మాం ప్రీతమ్ అవేహి తురఙ్గమాత్ ఋతే కిమ్ ఇచ్ఛసి ఇతి వాసవః స్ఫుటం ఆహ 3.63

వాచ్యపరివర్తనం
సారవత్తయా అద్రిషు అపి అసఙ్గమ్ మే ఆయుధం త్వదన్యః విసోఢవాన్ అహం ప్రీతః (త్వయా) అవేయై (త్వయా) తురఙ్గమాత్ ఋతే కిమ్ ఇష్యతే ఇతి వాసవేన ఉచ్యతే

సరలార్థః
హే రాజన్యకుమార! యతః పర్వతపక్షానపి బిభేద యచ్చ త్రిలోకీమధ్యే కోఽపి సోఢుం శశాక తత్ అమోఘమపి మే వజ్రం త్వయి వ్యర్థతాం యాతమ్. అతః తే పరాక్రమాతిశయేన ప్రసన్నోస్మి ఇమఞ్చ తురఙ్గమం వర్జయిత్వా త్వం కిమిచ్ఛసిఇతి దేవరాజో రఘుం స్పష్టమాహ

తాత్పర్యమ్
ఎంతో గట్టిదైన నా యీ వజ్రాయుధము పర్వతములపై ప్రయోగించబడినప్పుడు కూడా మొక్క పోలేదు. నీవు తప్ప మరెవ్వరూ దీనిని ఓర్చుకోలేకపోయారు.(అట్టి నీ పరాక్రమమును చూసి) నేను ప్రీతి చెందాను. ఈ గుఱ్ఱమును కాకుండా మరి దేనినైనా కోరుకొనుము.” అని ఇంద్రుడు స్పష్టంగా పలికాడు.