Thursday, August 30, 2018

రఘువంశమ్-3.70

శ్లోకః
అథ విషయవ్యావృత్తాత్మా యథావిధి సూనవే
నృపతికకుదం దత్త్వా యూనే సితాతపవారణమ్
మునివనతరుచ్ఛాయాం దేవ్యా తయా సహ శిశ్రియే
గలితవయసామిక్ష్వాకూణామిదం హి కులవ్రతమ్ 3.70

పదవిభాగః
అథ విషయ-వ్యావృత్త-ఆత్మా యథావిధి సూనవే నృపతి-కకుదం దత్త్వా యూనే సిత-ఆతపవారణమ్
ముని-వన-తరుః-ఛాయాం దేవ్యా తయా సహ శిశ్రియే గలిత-వయసామ్ ఇక్ష్వాకూణామ్ ఇదం హి కుల-వ్రతమ్

అన్వయః
విషయవ్యావృత్తాత్మా సః దిలీపః యూనే సూనవే యథావిధి నృపతికకుదం సితాతపవారణం దత్త్వా తయా దేవ్యా (సుదక్షిణయా) సహ మునివనతరుచ్ఛాయాం శిశ్రియే, హి (యతః) గలితవయసామ్ ఇక్ష్వాకూణాం ఇదం హి కులవ్రతం (అస్తి) 3.70

వాచ్యపరివర్తనం
అథ విషయవ్యావృత్తాత్మనా తేన యూనే సూనవే యథావిధి నృపతికకుదం సితాతపవారణం దత్త్వా, తయా దేవ్యా సహ మునివనతరుచ్ఛాయా శిశ్రియే, హి గలితవయసామ్ ఇక్ష్వాకూణామ్ అనేన కులవ్రతేన (భూయతే)

సరలార్థః
అథ వృద్ధో రాజా సుయోగ్యం పుత్రం రఘుం సామ్రాజ్యే అభిషిచ్య సర్వాంశ్చ విషయాన్ సన్త్యజ్య పరమపురుషార్థలాభాయ సస్త్రీకః తపోవనే వాసమకరోత్ యతః వార్ధక్యే వయసి ఇక్ష్వాకుకులోత్పన్నానాం ఏవ కులాచారః

తాత్పర్యమ్
ఇంద్రియసుఖాలపై నుంచి మనస్సు మళ్ళిన ఆ దిలీపుడు యువకుడైన రఘువుకు శాస్త్రానుసారంగా రాజచిహ్నమైన తెల్లని గొడుగును ఇచ్చి (రాజ్యభారాన్ని అప్పగించి) తన భార్యయైన సుదక్షిణతో కలిసి తపోవనములోని ఒక చెట్టు నీడను ఆశ్రయించాడు (వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాడు). ఇది వయస్సు పైబడిన ఇక్ష్వాకువంశీయులు తరతరాలుగా పాటిస్తూ వస్తున్న ఆచారము కదా.

No comments:

Post a Comment