Friday, August 24, 2018

రఘువంశమ్-3.11


శ్లోకః
సురేన్ద్రమాత్రా శ్రితగర్భగౌరవాత్ ప్రయత్నముక్తాసనయా గృహాగతః
తయోపచారాఞ్జలిలిఖిన్నహస్తయా ననన్ద పారిప్లవనేత్రయా నృపః ॥3.11

పదవిభాగః
సుర-ఇన్ద్ర-మాత్రా శ్రిత-గర్భ-గౌరవాత్ ప్రయత్న-ముక్త-ఆసనయా గృహ-ఆగతః తయా ఉపచార-అఞ్జలి-ఖిన్న-హస్తయా ననన్ద పారిప్లవ-నేత్రయా నృపః ॥

అన్వయః
గృహాగతః నృపః సురేన్ద్రమాత్రాశ్రితగర్భగౌరవాత్ ప్రయత్నముక్తాసనయా ఉపచారాఞ్జలిఖిన్నహస్తయా పారిప్లవనేత్రయా తయా (సుదక్షిణయా) ననన్ద 3.11

వాచ్యపరివర్తనమ్
గృహాగతేన నృపేణ సురేన్ద్రమాత్రాశ్రితగర్భగౌరవాత్ ప్రయత్నముక్తాసనయా ఉపచారాఞ్జలిఖిన్నహస్తయా పారిప్లవనేత్రయా తయా ననన్దే

సరలార్థః
లోకపాలానుభావైః యుక్తః స గర్భః క్రమేణ తథా గురుభారో జాతః యథా గృహప్రాప్తస్య దిలీపస్య ఆదరార్థం పర్యఙ్కాత్ ఉత్థానే అపి రాజ్ఞీ ప్రయాసం లబ్ధవతీ, నృపస్య అభివాదనార్థం అఞ్జలిబన్ధనే అపి కరౌ శిథిలౌ బభూవతుః చక్షుషీ నిమీలనాత్ అస్థైర్యం ప్రాపతుః. తద్దర్శనేన నృపః ననన్ద

తాత్పర్యమ్
రాజు ఇంటికి వచ్చినప్పుడు - దిక్పాలకుల అంశలతో కూడియున్న గర్భముయొక్క గురుత్వము (భారము) వలన సుదక్షిణ ప్రయత్నపూర్వకముగా తప్ప ఆసనములోనుంచి లేవగలిగేది కాదు. నమస్కరించేందుకు చేతులను జోడించడం కూడా కష్టంగానే ఉండేది. కనురెప్పలను వాల్చబోతే అవి స్థిరంగా ఉండక అల్లలాడేవి. ఆ గర్భధారణగురుత్వసూచనలను చూసిన రాజు (తనకు గౌరవమివ్వలేదని కోపించలేదు, సరి కదా) చాలా సంతోషించాడు.

[కేశవపంతులవారి వ్యాఖ్యనుండి: అష్టాభిశ్చ సురేంద్రాణాం మాత్రాభిర్నిర్మితో నృపఃఅని మనుస్మృతి. ఎనమండుగురు దిక్పాలకుల అంశతో రాజు నిర్మితమౌతాడు/జన్మిస్తాడు.]

No comments:

Post a Comment