Friday, August 24, 2018

రఘువంశమ్-3.1


శ్లోకః
అథేప్సితం భర్తురుపస్థితోదయం సఖీజనోద్వీక్షణకౌముదీముఖమ్ ।
నిదానమిక్ష్వాకుకులస్య సన్తతేః సుదక్షిణా దౌర్హృదలక్షణం దధౌ ॥3.1

పదవిభాగః
అథ ఈప్సితం భర్తుః ఉపస్థిత-ఉదయం సఖీ-జన-ఉద్వీక్షణ-కౌముదీ-ముఖమ్ । నిదానమ్ ఇక్ష్వాకు-కులస్య సన్తతేః సుదక్షిణా దౌర్హృద-లక్షణం దధౌ

అన్వయః
అథ సుదక్షిణా భర్తుః ఈప్సితం ఉపస్థితోదయం సఖీజనోద్వీక్షణకౌముదీముఖం ఇక్ష్వాకు కులస్య సన్తతేః నిదానం దౌర్హృద-లక్షణం దధౌ 3.1

వాచ్యపరివర్తనమ్
అథ సుదక్షిణయా దధే

సరలార్థః
అథ రాజ్ఞీ నృపస్య మనోభిలషితం ప్రాప్తోదయం సఖీజనదృష్టీనాం చంద్రికా-ప్రాదుర్భావమ్ ఇక్ష్వాకుకులస్య సంతతః మూలకారణం దౌర్హృదలక్షణం ధృతవతీ

తాత్పర్యమ్
అటు పిమ్మట భర్తయొక్క కోరిక తీరే కాలము సమీపిస్తున్నదని సూచించే విధంగా, చెలికత్తెలు ఎదురు చూస్తున్న వెన్నెల రానున్నదని సూచించే విధంగా, ఇక్ష్వాకువంశము అవిచ్ఛిన్నంగా కొనసాగనున్నదని సూచించే విధంగా గర్భచిహ్నాలను ధరించింది (కనబరిచింది).
(మాతృహృదయము, శిశుహృదయము కలిసిఉన్న స్థితి దౌర్హృదము)

No comments:

Post a Comment