శ్లోకః
సేయం స్వదేహార్పణనిష్క్రయేణ న్యాయ్యా మయా మోచయితుం
భవత్తః ।
న పారణా స్యాద్విహతాతవైవం భవేదలుప్తశ్చ మునేః
క్రియార్థః ॥2.55॥
పదవిభాగః
సా ఇయం స్వ-దేహ-అర్పణ-నిష్క్రయేణ న్యాయ్యా మయా మోచయితుం భవత్తః । న
పారణా స్యాత్ విహతా తవ ఏవం భవేత్ అలుప్తః చ మునేః క్రియా-అర్థః
॥
అన్వయః
మయా స్వదేహార్పణనిష్క్రయేణ సా ఇయం (గౌ) భవత్తః
మోచయితుం న్యాయ్యా అస్తి । ఏవమ్ (అమునా ప్రకారేణ) ఇవ తవ
పారణా విహతా న స్యాత్, మునేః క్రియార్థః చ అలుప్తః భవేత్
॥2.55॥
వాచ్యపరివర్తనమ్
మయా స్వదేహార్పణనిష్క్రయేణ తయా అనయా (గవా) భవత్తః
మోచయితుం న్యాయ్యా (భూయతే). ఏవం తవ పారణాయా విహతయా న భూయేత, మునేః క్రియార్థేన చ అలుప్తేన భూయేత ॥
సరలార్థః
సేయం ధేనుః మయా స్వదేహదానవినిమయేన త్వత్తః మోచయితుం
న్యాయ్యా. ఏవం కృతే సతి తవ పారణా విహతా న స్యాద్ వసిష్ఠస్య హోమాదిప్రయోజనం చ
అలుప్తం భవేత్॥
తాత్పర్యమ్
(దిలీపుడు సింహముతో) “అట్టి ఈ
గోవును నా శరీరమును నీకు అర్పించి నీ నుంచి విడిపించడం సరైనదే. ఆవిధంగా నీ
భోజనమునకు భంగము వాటిల్లదు, (అంతే కాక) వసిష్ఠమహర్షి
యొక్క హోమాదిక్రియలకు లోపము వాటిల్లదు.”
No comments:
Post a Comment