శ్లోకః
అతిప్రబన్ధప్రహితాస్త్రవృష్టిభిస్తమాశ్రయం
దుష్ప్రసహస్య తేజసః ।
శశాక నిర్వాపయితుం న వాసవః స్వతశ్చ్యుతం
వహ్నిమివాద్భిరమ్బుదః ॥3.58॥
పదవిభాగః
అతి-ప్రబన్ధ-ప్రహిత-అస్త్ర-వృష్టిభిః తమ్ ఆశ్రయం
దుష్ప్రసహస్య తేజసః । శశాక నిర్వాపయితుం న వాసవః స్వతః చ యుతం వహ్నిమ్ ఇవ అద్భిః అమ్బుదః
॥
అన్వయః
అంబుదః అద్భిః (స్వతశ్చ్యుతం)
వహ్నిం ఇమ్వ వాసవః అతిప్రబన్ధప్రహితాస్త్రవృష్టిభిః స్వతశ్చ్యుతం దుష్ప్రసహస్య
తేజసః ఆశ్రయం తం రఘుం నిర్వాపయితుం న శశాక ॥3.58॥
వాచ్యపరివర్తనమ్
అమ్బుదేన ఇవ వాసవేన… న శేకే ॥
సరలార్థః
తోయదః యథా స్వతః చ్యుతమ్ తేజఃప్రదీప్తం వజ్రం నిరన్తరజలధారాసమ్పాతైః
శమయితుం నైవ సమర్థో భవతి తథా పురన్దరః అపి ఆత్మనః అంశసమ్భూతమపి తం రఘుం శస్త్రసమ్పాతైః
శమయితుం న శశాక ॥
తాత్పర్యమ్
మేఘము తననుంచే పుట్టిన అగ్నిని (పిడుగును) తన నీటి ధారలతో
ఆర్పలేకపోయినట్లు, ఇంద్రుడు ఎడతెగక అస్త్రములను
కురిపించి కూడా - తన (ఇతర దిక్పాలకులకు
కూడా) అంశ అయినటువంటివాడూ, తట్టుకోజాలని తేజస్సుకు నెలవైన వాడూ అయిన - రఘువు యొక్క ప్రతాపాన్ని నిలువరించలేకపోయాడు.
No comments:
Post a Comment