శ్లోకః
అథ నయనసముత్థం జ్యోతిరత్రేరివ ద్యౌః
సురసరిదివ తేజో వహ్నినిష్ఠ్యూతమైశమ్ ।
నరపతికులభూత్యై గర్భమాధత్త రాజ్ఞీ
గురుభిరభినివిష్టం లోకపాలానుభావైః ॥2.75॥
పదవిభాగః
అథ నయన-సముత్థం
జ్యోతిః అత్రేః ఇవ ద్యౌః సుర-సరిత్ ఇవ తేజో వహ్ని-నిష్ఠ్యూతమ్-ఐశమ్ । నరపతి-కుల-భూత్యై గర్భమ్ ఆధత్త రాజ్ఞీ గురుభిః అభినివిష్టం లోకపాల-అనుభావైః ॥
అన్వయః
అథ అత్రేః నయనసముత్థం జ్యోతిః ద్యౌః ఇవ, వహ్నినిష్ట్యూతం ఐశం తేజః సురసరిద్ ఇవ, నరపతికులభూత్యై రాజ్ఞీ గురుభిః లోకపాలానుభావైః అభినివిష్టం
గర్భమ్ ఆధత్త ॥2.75॥
వాచ్యపరివర్తనమ్
దివా ఇవ సురసరితా ఇవ సత్యా అభినివిష్టః గర్భః ఆధీయత ॥
సరలార్థః
యథా ద్యౌః అత్రేః మునేః నేత్రోత్పన్నం సోమం ధృతవతీ, యథా గఙ్గా హుతాశనప్రక్షిప్తం స్కన్దస్య ఉత్పాదకం శైవం తేజః
దధార,
తథైవ సుదక్షిణా దిలీపకులప్రతిష్ఠాయై మహద్భిః అష్టలోకపాలానాం
తేజోభిః అనుప్రవిష్టం గర్భం భృతవతీ ॥
తాత్పర్యమ్
అత్రి నేత్రములనుంచి వెలువడిన వెలుగును
(చంద్రుడిని) ఆకాశము గర్భమున ధరించినట్లు, అగ్నిచేత
ఉంచబడిన శివతేజమును (స్కందుడిని) గంగ గర్భమందున ధరించినట్లు దిలీపుడి వంశాభివృద్ధి
కొరకు సుదక్షిణ అష్టదిక్పాలకుల తేజస్సులతో ప్రవేశించబడిన గర్భాన్ని ధరించింది.
[ఆం.ప్ర.సాహిత్య అకాడమీ ముద్రణ నుంచి ఈ క్రింది వివరాలు:
1. అత్రి మహర్షి
నేత్రముల నుంచి చంద్రుడు జన్మించాడని హరివంశకావ్యంలో ఉన్నది.
2. శివుడి
వీర్యమును అగ్ని గంగానదిలో నిక్షేపం చేసాడని రామాయణాది గ్రంథాలలో.
3. “అష్టానాం
లోకపాలానాం వపుర్ధారయతే నృపః” (ఎనమండుగురు
దిక్పాలకుల శరీరమును రాజు ధరిస్తాడు) అని మనుస్మృతి
4. “యథేయం పృథివీ మహ్యుత్తానా
గర్భమాదధే, ఏవం త్వం గర్భమాధేహి దశమే
మాసి సూతవే” (భర్త, భార్యను, “నీవు గర్భమును ధరించి పదవ నెలలో ప్రసవించుము” అని కోరవలసినట్లు ఋగ్వేద ఆశ్వలాయన మంత్రము
చెబుతున్నది.]
No comments:
Post a Comment