Tuesday, August 21, 2018

రఘువంశమ్-2.35


శ్లోకః
కైలాసగౌరం వృషమారురుక్షోః పాదార్పణానుగ్రహపూతపృష్ఠమ్
అవేహి మాం కిఙ్కరమష్టమూర్తేః కుమ్భోదరం నామ నికుమ్భమిత్రమ్ ॥2.35

పదవిభాగః
కైలాసగౌరం వృషమ్ ఆరురుక్షోః పాద-అర్పణ-అనుగ్రహ-పూత-పృష్ఠమ్ । అవేహి మాం కిఙ్కరమ్ అష్ట-మూర్తేః కుమ్భోదరం నామ నికుమ్భ-మిత్రమ్ ॥

అన్వయః
కైలాసగౌరం వృషమ్ ఆరురుక్షోః అష్టమూర్తేః పదార్పణానుగ్రహపూతపృష్ఠం కుమ్భోదరం నామ నికుమ్భమిత్రం మాం కిఙ్కరం (త్వమ్) అవేహి 2.35

వాచ్యపరివర్తనమ్
పాదార్పణానుగ్రహపూతపృష్ఠః కిఙ్కరః అహం కుమ్భోదరో నామ నికుమ్భమిత్రం (త్వయా)అవేయై

సరలార్థః
రాజన్, త్వం మాం నికుమ్భమిత్రం కుమ్భోదరం నామ ధూర్జటేః కింకరమ్ అవేహి, యదా శివః కైలాసమివ శుభ్రవర్ణం వృషమ్ ఆరోఢుమ్ ఇచ్ఛతి తదా మత్ పృష్టోపరి చరణం నిధాయ వృషమారోహతి

తాత్పర్యమ్
(సింహం దిలీపుడితో అంటున్న మాటలు) ఓ రాజా, కైలాసపర్వతము వంటి తెలుపును కలిగిన ఎద్దును (నందిని) అధిరోహించేటప్పుడు, అష్టమూర్తి (శివుడు) తన పాదమును మోపుట చేత పవిత్రమైన వీపును గలవాడనని, నికుంభుడి మిత్రుడనైన కుంభోదరుడను నేనని తెలిసికొనుము.
[ఆం.ప్ర.సాహిత్య అకాడమీ ముద్రణ నుంచి -
1. నికుంభుడు సుప్రసిద్ధ శివకింకరుడు, కుమారస్వామి భటుడు
2. శివుని అష్టమూర్తులు (శరీరములు): పృథ్వి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, యజ్ఞము చేసిన సోమయాజి.]

No comments:

Post a Comment