Tuesday, October 9, 2018

రఘువంశమ్- 5.07


శ్లోకః
క్రియానిమిత్తేష్వపి వత్సలత్వాదభగ్నకామా మునిభిః కుశేషు ।
తదఙ్కశయ్యాచ్యుతనాభినాలా కచ్చిన్మృగీణామనఘా ప్రసూతిః 5.07

పదవిభాగః
క్రియా-నిమిత్తేషు అపి వత్సలత్వాత్ అభగ్న-కామా మునిభిః కుశేషు । తత్ అఙ్క-శయ్యా-చ్యుత-నాభినాలా కచ్చిత్ మృగీణామ్ అనఘా ప్రసూతిః

అన్వయః
మునిభిః వత్సలత్వాత్ క్రియానిమిత్తేషు అపి కుశేషు అభగ్నకామా తదఙ్కశయ్యాచ్యుతనాభినాలా మృగీణాం ప్రసూతిః అనఘా కచ్చిత్ 5.07

వాచ్యపరివర్తనమ్
మునిభిః వత్సలత్వాత్ క్రియానిమిత్తేషు అపి కుశేషు అభగ్నకామయా తదఙ్కశయ్యాచ్యుతనాభినాలయా మృగీణాం ప్రసూత్యా అనఘయా కచ్చిత్ (భూయతే) ।।

సరలార్థః
తత్కాలప్రసూతాన్ యాన్ మృగాన్ ఋషయః అఙ్కే పరిగృహ్య రక్షన్తి, యేషాం నాభినాలాని మునీనామ్ అఙ్కేషు స్ఖలన్తి, హోమనిమిత్తేషు అపి కుశేషు యేషాం భక్షణేచ్ఛా ఋషిభిః నైవ వ్యాహన్యతే, కుశలినస్తే మృగశాబకాః తపోవనే కచ్చిత్?

తాత్పర్యమ్
(రఘువు కౌత్సుడితో) “మునుల ఒడులలో తమ బొడ్డుతాళ్ళు జారిపోయినవీ యజ్ఞవిధులకే పోగు చేసిన దర్భలను తినబోయినా అదిలించబడనివీ అయిన (ఆశ్రమపు) లేడిపిల్లలకు ఏ హానీ కలగడం లేదు కదా!”
[అప్పుడే పుట్టిన లేడిపిల్లలను క్రూరమృగాల నుంచి కాపాడేందుకు మునులు వాటిని తమ ఒడులలో పదిరోజులపాటు ఉంచుకుంటారట]

రఘువంశమ్- 5.06


శ్లోకః
ఆధారబన్ధప్రముఖైః ప్రయత్నైః సంవర్ధితానాం సుతనిర్విశేషం ।
కచ్చిన్న వాయ్వాదిరుపప్లవో వః శ్రమచ్ఛిదామాశ్రమపాదపానాం 5.06

పదవిభాగః
ఆధార-బన్ధ-ప్రముఖైః ప్రయత్నైః సంవర్ధితానాం సుత-నిర్విశేషం । కచ్చిత్ న వాయు-ఆదిః ఉపప్లవః వః శ్రమ-ఛిదామ్ ఆశ్రమ-పాదపానాం

అన్వయః
ఆధారబన్ధప్రముఖైః ప్రయత్నైః సుతనిర్విశేషం (యథా తథా) సంవర్ధితానాం శ్రమచ్ఛిదాం వః ఆశ్రమపాదపానాం వాయ్వాదిః ఉపప్లవః న (భవతి) కచ్చిత్? 5.06

వాచ్యపరివర్తనమ్
ఆధారబన్ధప్రముఖైః ప్రయత్నైః సుతనిర్విశేషం సంవర్ధితానాం శ్రమచ్ఛిదాం వః ఆశ్రమపాదపానాం వాయ్వాదినా ఉపప్లవేన న (భూయతే) ।।

సరలార్థః
భవద్భిః ఆలవాలబన్ధనజలసేచనాదిభిః ఉపాయైః సుతసదృశప్రేమ్ణా సంవర్ధితాః యే అశ్రమవృక్షాః ఫలచ్ఛాయాదానేన శ్రాన్తానాం సకలసన్తాపమ్ అపహరన్తి, తాన్ దావానలవాత్యాదిః ఉపద్రవః న బాధతే కచ్చిత్

తాత్పర్యమ్
(రఘువు కౌత్సుడితో) “పాదులు చేయడం నుంచి మొదలుకొని అనేకవిధాలుగా పాటుపడుతూ తమ సంతానంతో సమానంగా మీరు పెంచుతూ ఉన్నవీ, (ఫలఛాయాదులను ఇచ్చి) శ్రమను పరిహరించేవీ అయిన మీ ఆశ్రమవృక్షాలకు గాలుల వలన ముప్పూ వాటిల్లడం లేదు కదా?”

Sunday, September 30, 2018

రఘువంశమ్- 5.05


శ్లోకః
కాయేన వాచా మనసాపి శశ్వద్యత్సంభృతం వాసవధైర్యలోపి
ఆపాద్యతే న వ్యయమన్తరాయైః కచ్చిన్మహర్షేస్త్రివిధం తపస్తత్ 5.05

పదవిభాగః
కాయేన వాచా మనసా అపి శశ్వత్ యత్ సమ్భృతం వాసవ-ధైర్య-లోపి । ఆపాద్యతే న వ్యయమ్ అన్తరాయైః కచ్చిత్ మహర్షేః త్రి-విధం తపః తత్

అన్వయః
కాయేన వాచా మనసా అపి వాసవధైర్యలోపి యత్ మహర్షేః త్రివిధం తపః శశ్వత్ సమ్భృతమ్ తత తపః అన్తరాయైః వ్యయం న ఆపాద్యతే కచ్చిత్ 5.05

వాచ్యపరివర్తనమ్
మహర్షిః యత్ తపః సమ్భృతవాన్ అన్తరాయాః తత్ తపః వ్యయం న ఆపాదయన్తి

సరలార్థః
భవద్గురుః స వరతన్తుః నిరన్తరం కాయమనోవచనైః యద్ దుశ్చరం తపః కృతవాన్, యస్మాత్ పురందరోపి న ధైర్యమవలమ్బతే తత్తపః అన్తరాయాభావాత్ నిష్కణ్టకమ్?

తాత్పర్యమ్
(రఘువు కౌత్సునితో) “(వరతంతు)మహర్షి తన శరీరముతో, వాక్కుతో, మనస్సుతో చేసే తపస్సు - ఇంద్రుడి ధైర్యమును హరించగలిగినది, నిరంతరము కూడబెట్టుకుంటున్నదిఅంతరాయాల కారణంగా ఖర్చు కావడం లేదు కదా!”
(
ఇంద్రుడు తపోభంగం చేసేందుకు ప్రయత్నించడం, అప్సరసో తపోభంగాన్ని కలిగిస్తే శాపాలు పెట్టడంవాటివల్ల తపశ్శక్తిని కోల్పోవడం జరగడం లేదు కదా!)

రఘువంశమ్- 5.04


శ్లోకః
అప్యగ్రణీర్మన్త్రకృతామృషీణాం కుశాగ్రబుద్ధే కుశలీ గురుస్తే
యతస్త్వయా జ్ఞానమశేషమాప్తం లోకేన చైతన్యమివోష్ణరశ్మేః 5.04

పదవిభాగః
అపి అగ్రణీః మన్త్రకృతామ్ ఋషీణాం కుశ-అగ్ర-బుద్ధే కుశలీ గురుః తే యతః త్వయా జ్ఞానమ్ అశేషమ్ ఆప్తం లోకేన చైతన్యమ్ ఇవ ఉష్ణరశ్మేః

అన్వయః
హే కుశాగ్రబుద్ధే, మన్త్రకృతామ్ ఋషీణామ్ అగ్రణీః తే గురుః కుశలీ అపి? లోకేన ఉష్ణరష్మేః చైతన్యమ్ ఇవ త్వయా యతః అశేషం జ్ఞానమ్ ఆప్తమ్ 5.04

వాచ్యపరివర్తనమ్
అగ్రణ్యా గురుణా కుశలినా లోకః చైతన్యమ్ ఇవ త్వమ్ ఆప్తవాన్

సరలార్థః
హే సూక్ష్మబుద్ధే, బ్రహ్మన్, రవిర్యథా అన్ధకారాన్ధం లోక ప్రకాశేన ఉద్బోధయతి, తథా అజ్ఞానతిమిరాన్ధం త్వాం యః జ్ఞానప్రకాశేన ఉద్బోధితవాన్ స వేదనిధిః తే గురుః కుశలీ అస్తి కిమ్

తాత్పర్యమ్
(రఘువు కౌత్సునితో) “ కుశాగ్రబుద్ధీ, సూర్యుని నుంచి ప్రజలు చైతన్యాన్ని పొందినట్లు గురువు నుంచి నీవు సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందావో, వేదనిధులలో తొలి వరుస వాడైన నీ గురువు క్షేమమే కదా!”

రఘువంశమ్- 5.03


శ్లోకః
తం అర్చయిత్వా విధివద్విధిజ్ఞస్తపోధనం మానధనాగ్రయాయీ ।
విశామ్పతిర్విష్టరభాజం ఆరాత్కృతాఞ్జలిః కృత్యవిదిత్యువాచ 5.03

పదవిభాగః
తం అర్చయిత్వా విధివత్ విధిజ్ఞః తపః-ధనం మానధన-అగ్రయాయీ । విశామ్పతిః విష్టరభాజం ఆరాత్ కృత-అఞ్జలిః కృత్య-విత్ ఇతి ఉవాచ

అన్వయః
విధిజ్ఞః మానధనాగ్రయాయీ కృత్యవిత్ విశామ్పతిః తపోధనమ్ ఆరాత్ విష్టరభాజం తం (కౌత్సం) విధివత్ అర్చయిత్వా కృతాఞ్జలిః సన్ ఇతి ఉవాచ 5.03

వాచ్యపరివర్తనమ్
విధిజ్ఞేన మానధనాగ్రయాయినా కృత్యవిదా విశామ్పత్యా కృతాఞ్జలినా (సతా) తపోధనః ఆరాత్ విష్టరభాక్ సః విధివత్ అర్చయిత్వా ఇతి ఊచే ।।

సరలార్థః
యశోధనానాం ధురీణః శ్రుతశీలసమ్పన్నః నరపతిః వేదశాస్త్రసమ్పన్నం తం కౌత్సం శ్రౌతేన విధినా సత్కృతవాన్, పశ్చాత్ సమీపే సుఖాసీనే తస్మిన్ బద్ధాఞ్జలిః (సన్) ఆగమనప్రయోజనం పప్రచ్ఛ

తాత్పర్యమ్
శాస్త్రమును తెలిసినవాడు, అభిమానధనులలో మొదటి వరుసలోని వాడు, చేయవలసిన పని తెలిసినవాడు (కార్యజ్ఞుడు) అయిన రాజు సముచితాసనమున కూర్చోబెట్టి శాస్త్రప్రకారముగా పూజించి, చేతులు జోడించి ఇలా అన్నాడు.
[సముచితాసనము = దర్భాసనము, ఇక్కడ]

Sunday, September 23, 2018

రఘువంశమ్- 5.02


శ్లోకః
స మృన్మయే వీతహిరణ్మయత్వాత్పాత్రే నిధాయార్ఘ్యమనర్ఘశీలః
శ్రుతప్రకాశం యశసా ప్రకాశః ప్రత్యుజ్జగామాతిథిమాతిథేయః 5.02

పదవిభాగః
స మృన్మయే వీత-హిరణ్మయత్వాత్ పాత్రే నిధాయ అర్ఘ్యమ్ అనర్ఘ-శీలః శ్రుత-ప్రకాశం యశసా ప్రకాశః ప్రత్యుజ్జగామ అతిథిమ్ ఆతిథేయః

అన్వయః
అనర్ఘశీలః యశసా ప్రకాశః ఆతిథేయః సః (రఘుః) వీతహిరణ్మయత్వాత్ మృన్మయే పాత్రే అర్ఘ్యమ్ నిధాయ శ్రుతప్రకాశమ్ అతిథిమ్ ప్రత్యుజ్జగామ 5.02

వాచ్యపరివర్తనమ్
అనర్ఘశీలేన యశసా ప్రకాశేన ఆతిథేయేన తేన (రఘుణా) వీతహిరణ్మయత్వాత్ మృన్మయే పాత్రే అర్ఘ్యం నిధాయ శ్రుతప్రకాశః అతిథిః ప్రత్యుజ్జగ్మే

సరలార్థః
దివ్యప్రభావః శరణాగతరక్షకః (రఘుః) యజ్ఞే సర్వస్వదానాత్ ధాతుపాత్రాభావాత్ మృన్మయే పాత్రే పూజార్థమ్ ఉపకరణం సమాదాయ విద్యాసమ్పన్నమ్ అభ్యాగతం తం కౌత్సం ప్రత్యుజ్జగామ

తాత్పర్యమ్
వెలకట్టరానంత గొప్ప నడవడిని కలిగినవాడు, కీర్తి చేత ప్రకాశించేవాడు అయిన రఘువు బంగారు గిన్నెలు లేని కారణాన మట్టి పాత్రలలో అర్ఘ్యమునకు కావలసిన వస్తువులను ఉంచుకొని జ్ఞానముతో ప్రకాశించే అతిథిని ఎదుర్కొన్నాడు.

రఘువంశమ్- 5.01


శ్లోకః
తమధ్వరే విశ్వజితి క్షితీశం నిఃశేషవిశ్రాణితకోశజాతమ్
ఉపాత్తవిద్యో గురుదక్షిణార్థీ కౌత్సః ప్రపేదే వరతన్తుశిష్యః 5.01

పదవిభాగః
తమ్ అధ్వరే విశ్వజితి క్షితీశం నిఃశేష-విశ్రాణిత-కోశజాతమ్ఉపాత్త-విద్యః గురు-దక్షిణా-అర్థీ కౌత్సః ప్రపేదే వరతన్తు-శిష్యః

అన్వయః
ఉపాత్తవిద్యః వరతన్తుశిష్యః కౌత్సః గురుదక్షిణార్థీ సన్ విశ్వజితి అధ్వరే నిఃశేషవిశ్రాణితకోశజాతం తం క్షితీశం (రఘుమ్) ప్రపేదే 5.01

వాచ్యపరివర్తనమ్
ఉపాత్తవిద్యేన వరతన్తుశిష్యేణ కౌత్సేన గురుదక్షిణార్థినా (సతా) విశ్వజితి అధ్వరే నిఃశేషవిశ్రాణితకోశజాతః స క్షితీశః (రఘుః) ప్రపేదే

సరలార్థః
అథ రఘుణా విశ్వజితి యజ్ఞే నిఃశేషితే సర్వస్వే, వరతన్తునామ్నః కస్యచిన్మహర్షేః కౌత్సనామా శిష్యః గురుసకాశాత్ వేదాన్ యథావదధీత్య గురుదక్షిణాం ప్రార్థయితుం రఘుసమీపమ్ ఆజగామ

తాత్పర్యమ్
విశ్వజిద్యాగములో తన కోశాగారములోని సంపదనంతటినీ దానము చేసిన ఆ రాజు వద్దకు, విద్యాభ్యాసమును పూర్తిచేసికొని గురుదక్షిణ కోసం (సహాయము చేయమని అడిగేందుకు) కౌత్సుడు అనే వరతన్తుమహర్షి శిష్యుడు వచ్చాడు.