Wednesday, March 21, 2018

రఘువంశమ్-1.27

శ్లోకః
న కిలానుయయుస్తస్య రాజానో రక్షితుర్యశః ।
వ్యావృత్తా యత్పరస్వేభ్యః శ్రుతౌ తస్కరతా స్థితా ॥1.27

పదవిభాగః
న కిల అనుయయుః తస్య రాజానః రక్షితుః యశః । వ్యావృత్తా యత్ పరస్వేభ్యః శ్రుతౌ తస్కరతా స్థితా

అన్వయః
(అన్యే) రాజానః రక్షితుః తత్ యశః న అనుయయుః కిల యత్ (యస్మాత్) తస్కరతా పరస్వేభ్యః వ్యావృత్తా (సతీ) శ్రుతౌ స్థితా1.27

వాచ్యపరివర్తనమ్
(అన్యైః) రాజభిః రక్షితుః తస్య యశః న అనుయయే కిల తస్కరతయా పరస్వేభ్యః వ్యావృత్తా (సత్యా) శ్రుతౌ స్థితమ్ ॥

సరలార్థః
దిలీపసదృశః కోపి అన్యః రాజా ప్రజాః పాలయితుం న సమర్థో బభూవ యతః తస్య ప్రభావాత్ రాజ్యే తస్కరా నైవ ఆసన్. అస్మాత్ చౌర్యం స్వరూపతః కేనాపి కదాపి న దృష్టమ్ ఖపుష్పవత్ నామమాత్రేణైవ స్థితమితి సరలార్థః ॥

తాత్పర్యమ్
(ప్రజా)రక్షకుడైన అతడి కీర్తిని ఇతర రాజులు అనుకరించలేకపోయారు (పొందలేకపోయారు). ఎందుకంటే, (దిలీపుడి పాలనలో) దొంగతనాలు జరిగేవి కాదు. పరుల ధనాన్ని అపహరించడంఅనే క్రియార్థాన్ని కోల్పోయి, దొంగతనం అనే ఆ మాట - గగనకుసుమంలాగా కేవలం శబ్దంగా మిగిలిపోయింది.

Monday, March 19, 2018

రఘువంశమ్-1.26

శ్లోకః
దుదోహ గాం స యజ్ఞాయ సస్యాయ మఘవా దివమ్ ।
సంపద్వినిమయేనోభౌ దధతుర్భువనద్వయమ్ ॥1.26

పదవిభాగః
దుదోహ గాం స యజ్ఞాయ సస్యాయ మఘవా దివమ్ । సంపద్-వినిమయేన ఉభౌ దధతుః భువన-ద్వయమ్

అన్వయః
సః యజ్ఞాయ గాం దుదోహ. మఘవా సస్యాయ దివం (దుదోహ). (ఏవమ్) ఉభౌ (ఇంద్రదిలీపౌ) సంపద్వినిమయేన భువనద్వయం దధతుః1.26

వాచ్యపరివర్తనమ్
తేన యజ్ఞాయ గౌః దుదుహే, మఘౌనా సస్యాయ ద్యౌః (దుదుహే) ఉభాభ్యాం సంపద్వినిమయేన భువనద్వయం దధే ॥

సరలార్థః
లోకేశ్వరః దిలీపః వసుధాయాః సముపార్జితైః కరైః ఇంద్రలోకప్రీతిసాధనం యజ్ఞం కృత్వా శచీపతిం సంతోషయామాస. స్వర్గపతిః సహస్రలోచనోపి ప్రీతః సన్ స్వర్గాత్ పాతితైః మేఘసలిలైః వసుధాయాః ధాన్యసమ్పదం సంవర్ధ్య పృథ్వీపతిం సంతోషయామాస ఏవమింద్రదిలీపౌ ఉపకారవినిమయేన మర్త్యం స్వర్గం పాలయామాసతుః ॥

తాత్పర్యమ్
దిలీపుడు యజ్ఞములను చేసేందుకు అతడు భూమిని పితికాడు (ప్రజలనుంచి పన్నులను గ్రహించాడు). (బదులుగా, భూమిపై) పైరుపంటలను వృద్ధి చెందేందుకు ఇంద్రుడు స్వర్గాన్ని పితికాడు (వర్షాన్ని కురిపించాడు). ఈవిధంగా, ఆ ఇరువురు తమ సంపదలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ రెండు లోకాలనూ పరిపాలించారు.
(దిలీపుడి యజ్ఞాల కారణంగా దేవతలు ప్రీతి చెందారు. ప్రత్యుపకారంగా ఇంద్రుడు వానలను కురిపించి సుభిక్షాన్నిచ్చాడు).

రఘువంశమ్-1.25

శ్లోకః
స్థిత్యైః దణ్డయతో దణ్డ్యాన్పరిణేతుః ప్రసూతయే ।
అప్యర్థకామౌ తస్యాస్తాం ధర్మాయైవ మనీషిణః ॥1.25

పదవిభాగః
స్థిత్యైః దణ్డయతః దణ్డ్యాన్ పరిణేతుః ప్రసూతయే । అపి అర్థ-కామౌ తస్య ఆస్తాం ధర్మాయ ఏవ మనీషిణః

అన్వయః
స్థిత్యై దణ్డ్యాన్ దణ్డయతః ప్రసూతయే పరిణేతుః మనీషిణః తస్య అర్థ-కామౌ అపి ధర్మాయ ఏవ ఆస్తామ్1.25

వాచ్యపరివర్తనమ్
స్థిత్యై దణ్డ్యాన్ దణ్డయతః ప్రసూతయే పరిణేతుః మనీషిణః తస్య అర్థకామాభ్యామ్ ధర్మాయ ఏవ అభూయత ॥

సరలార్థః
అపరాధసదృశం దణ్డదానం వినా జగత్స్థితిరూపో ధర్మో న స్యాత్ అతః స దణ్డార్హేషు తాడనాది దణ్డం ప్రయుక్తవాన్. సంతానోత్పాదనం వినా కులస్థితిరూపో ధర్మో న స్యాత్ అస్మాత్ సః వివాహం కృతవాన్. అత ఏవ తస్య దిలీపస్య ధర్మార్థకామరూపస్య త్రివర్గస్య అర్థకామావపి ధర్మమూలకౌ ఏవ అభూతామ్ ॥

తాత్పర్యమ్
లోకస్థితి కోసమే(ధర్మమును నిలిపి ఉంచేందుకే) దండనార్హులైనవారిని దండించేవాడు, సంతానార్థమే వివాహమాడిన వాడు, విద్వాంసుడు అయిన ఆ దిలీప మహారాజుకు అర్థకామాలు అనే రెండు పురుషార్థాలు కూడా ధర్మమార్గమును అనుష్ఠించుటకొరకే (సాధనములుగా) ఉండేవి.