శ్లోకః
అనాకృష్టస్య విషయైర్విద్యానాం పారదృశ్వనః ।
తస్య ధర్మరతేరాసీద్వృద్ధత్వం జరసా వినా ॥1.23॥
పదవిభాగః
అనాకృష్టస్య విషయైః విద్యానాం పార-దృశ్వనః । తస్య
ధర్మ-రతేః ఆసీద్ వృద్ధత్వం జరసా వినా ॥
అన్వయః
విషయైః అనాకృష్టస్య విద్యానాం పారదృశ్వనః ధర్మరతేః
తస్య (దిలీపస్య) జరసా వినా వృద్ధత్వమ్ ఆసీత్ ॥1.23॥
వాచ్యపరివర్తనమ్
విషయైః అనాకృష్టస్య విద్యానాం పారదృశ్వనః ధర్మరతేః
తస్య (రాజ్ఞః) జరసా వినా వృద్ధత్వేన అభూయత ॥
సరలార్థః
యూనోఽపి తస్య దిలీపస్య విషయవైరాగ్యే, వేదవేదాంగజ్ఞానే, ధర్మానుష్ఠానే
చ బుద్ధేః అధికా పరిణతిః జాతా. యువావస్థాయామపి స చతుష్పదార్థేషు అధికతరాం చతురతాం
లేభే ఇతి భావః ॥
తాత్పర్యమ్
ఇంద్రియ సుఖములచేత ఆకర్షితుడు కానటువంటి వాడూ, విద్యలయొక్క పారమును/ఎల్లలను చూసినటువంటి (సంపూర్ణ విద్యావంతుడైనటువంటి)వాడూ, ధర్మముయందు అనురక్తి కలిగి ఉన్నటువంటి వాడూ ఆయనకు ముసలితనం
సోకకుండానే వృద్ధత్వం (పరిణతి) లభించింది.
దిలీపుడు వయస్సు రీత్యా యువకుడే కానీ వృద్ధులకు
ఉండే మానసికపరిణతి అతడికి ఉండేది అని పిండితార్థము.
No comments:
Post a Comment