శ్లోకః
సోఽహమాజన్మశుద్ధానామాఫలోదయకర్మణామ్ ।
ఆసముద్రక్షితీశానామానాకరథవర్త్మనామ్ ॥1.5॥
పదవిభాగః
సః అహమ్ ఆజన్మ-శుద్ధానామ్ అఫల-ఉదయకర్మణామ్ । ఆసముద్ర-క్షితి-ఈశానామ్
ఆనాక-రథ-వర్త్మనామ్ ॥1.5॥
అన్వయః
సః అహమ్ (తనువాగ్విభవః అపి తద్గుణైః కర్ణం ఆగత్య
చాపలాయ ప్రణోదితః సన్) ఆజన్మశుద్ధానాం ఆఫలోదయ-కర్మణామ్ ఆసముద్ర-క్షితీశానామ్ ఆనాక-రథవర్త్మనామ్… ॥1.5॥
వాచ్యపరివర్తనమ్
తేన మయా తనువాగ్విభవేన ప్రచోదితేన సతా… అన్వయః వక్ష్యతే ॥
సరలార్థః
యద్యపి మే రచనాశక్తిః అల్పవిషయగ్రాహిణీ తథాప్యహం
రఘుకులోద్భవానాం రాజ్ఞామలౌకికీం గుణమాలామవగమ్య దుష్కరోపి విషయే ప్రవృత్తోస్మి.
కీదృశానాం రఘువంశోద్భవ-నృపాణాం గుణకథనే బద్ధపరికరోఽస్మి? జన్మనః ఆరభ్య శుద్ధచరిత్రాణామ్, యావత్ ప్రారబ్ధకర్మణః ఫలసిద్ధిం న దృష్టవంతః తావత్ తస్మాత్
విరతా నైవ బభూవుః తాదృశానాం రఘూణామ్, యే భుజబలేన
సముద్రవలయ-వేష్టితస్య ధరామండలస్యేశ్వరా ఆసన్. యేషాం రథస్య గతిః సురలోకేఽపి
అవ్యాహతా ఆసీత్ తాదృశానామ్. ఉదాహరణాని క్రమేణ- తృతీయసర్గే దశమః, అష్టమే ద్వావింశః,
ప్రథమసర్గే త్రింశతిశః, పంచమసర్గే సప్తవింశతిశః చ శ్లోకాః ॥
తాత్పర్యమ్
ఆ నేను (అటువంటి నేను)- జన్మతః విశుద్ధశీలురూ, తలపెట్టిన పనులు సఫలమయ్యేదాకా విరమించని వారూ, సముద్రం దాకా వ్యాపించిన భూమికి అధిపతులయినవారూ, (ఇంద్రుడికి సహాయం చేసేందుకు) స్వర్గలోకమార్గాలలో సైతం తమ
రథాలను నడిపినవారూ (అయిన రఘువంశీయులయొక్క…)
కొసరు వివరాలు
ఈ సర్గలోని అయిదవ శ్లోకం నుంచి ఎనిమిదవ శ్లోకం దాకా
రఘువంశస్థుల గుణగణాల వర్ణన ఉంటుంది. “అటువంటి నేను…” అని మొదలు పెట్టిన వాక్యం తొమ్మిదవ శ్లోకంలో పూర్తవుతుంది.
సోఽహమ్… కః? (“అట్టి నేను” అంటే ఎవరు?)
“తనువాగ్విభవోపి సన్… తద్గుణైః
కర్ణమాగత్య చాపలాయ ప్రణోదితః” (ఇది తొమ్మిదవ శ్లోకపు
రెండవపాదము; స్థూలానువాదం: అల్పమైన వాగ్వైభవాన్ని
కలిగిన వాడను, అయినా, రఘువంశపు రాజులయొక్క గుణప్రశస్తిని వినటంవల్ల ఆ కథను చెప్పాలన్న చాపల్యం
కలిగియున్నవాడిని)
మరో విషయం – ఈ శ్లోకాల్లో
రఘుకుల ప్రభువుల ఉనుద్దేశించి వాడిన విశేషణాలకు రుజువులు ముందున్న కథలో వస్తాయి.
వాటి ప్రస్తావన “సరలార్థః”లో చూడవచ్చును.
No comments:
Post a Comment