Showing posts with label ప్రథమసర్గ. Show all posts
Showing posts with label ప్రథమసర్గ. Show all posts

Wednesday, March 7, 2018

రఘువంశమ్-1.9


శ్లోకః
రఘూణామన్వయం వక్ష్యే తనువాగ్విభవోఽపి సన్ ।
తద్గుణైః కర్ణమాగత్య చాపలాయ ప్రణోదితః 1.9

పదవిభాగః
రఘూణామ్ అన్వయం వక్ష్యే తను-వాక్-విభవః అపి సన్ । తద్-గుణైః కర్ణమ్ ఆగత్య చాపలాయ ప్రణోదితః

అన్వయః
తనువాగ్విభవః సన్ అపి తద్గుణైః కర్ణమ్ ఆగత్య చాపలాయ ప్రణోదితః (అహమ్) సన్ రఘూణాం అన్వయం వక్ష్యే ॥1.9

వాచ్యపరివర్తనమ్
తద్-గుణైః కర్ణమ్ ఆగత్య తనువాగ్విభవేన సతా అపి సతా చాపలాయ ప్రణోదితేన (మయా) రఘూణాం అన్వయః వక్ష్యతే ॥

సరలార్థః
అహమల్పవాణీ-సంపత్తిః సన్ తేషాం రఘూణాం గుణైః కర్ణే ప్రాప్య ధార్ష్ట్యాయ ప్రేరితః రఘువంశచరిత్రం వక్ష్యే ॥

తాత్పర్యమ్
నా వాక్సంపద చాలా అల్పమైనది. అయినా రఘువంశంలో జన్మించిన రాజుల గుణముల వినికిడి నాలో చాపల్యాన్ని రేకెత్తించిన కారణాన రఘువంశచరిత్రను చెప్పబోతున్నాను.

(ఈ శ్లోకం చివరన ప్రణోదితఃఅని ఉన్నది. ప్రచోదితఃఅని పాఠాంతరము.)
అయిదవ శ్లోకం నుంచి తొమ్మిదవ శ్లోకం దాకా కలిపి చెప్పుకుంటే
రఘువంశానికి చెందిన రాజులు ఎలాంటి వాళ్ళు? జన్మతః విశుద్ధవర్తనం కలిగినవారు. ధ్యేయనిష్ఠ గలవారు. సాగరపర్యంత భూపాలకులు. ఇంద్రుడికి సహాయం చేసేనందుకు స్వర్గందాకా తమ రథాలను పరువులెత్తించిన వారు.
నియతపద్ధతిలో హోమాలు చేసిన వారు. మహాదాతలు. న్యాయానుగుణంగా దోషులను దండించినవారు. ప్రతిరోజూ, కాలాన్ని అతిక్రమించకుండా తమ కర్తవ్యాలను జాగరూకతతో నిర్వహించిన వారు.
దానాలు ఇవ్వటం కోసం ధనాన్ని ఆర్జించినవారు. సత్యం మాట్లాడేందుకే మితంగా సంభాషించినవారు. కీర్తి కోసమే యుద్ధాలలో గెలుపును కోరుకున్నవారు. సంతానం కోసమే గృహస్థాశ్రమాన్ని స్వీకరించినవారు.
విద్యాభ్యాసంలో బాల్యాన్ని, కోరికలను తీర్చుకోవటంలో యౌవనాన్ని, వానప్రస్థంలో వృద్ధాప్యాన్ని గడిపి యోగమార్గంలో తనువును త్యజించినవారు.
నా వాక్ఛక్తి పరిమితమైనదైనప్పటికీ, వారి సద్గుణాల గురించి (నిత్యం) వింటూ ఉండటం వల్ల నాలో ఏర్పడిన వాక్చాపల్యం కారణంగా నేను ఈ రఘువంశ కావ్యరచనకు పూనుకున్నాను.

Tuesday, March 6, 2018

రఘువంశమ్-1.8

శ్లోకః
శైశవేఽభ్యస్తవిద్యానాం యౌవనే విషయైషిణామ్ ।
వార్ధకే మునివృత్తీనాం యోగేనాన్తే తనుత్యజామ్ ॥1.8

పదవిభాగః
శైశవే అభ్యస్త-విద్యానాం యౌవనే విషయ-ఏషిణామ్ । వార్ధకే ముని-వృత్తీనాం యోగేన అన్తే తను-త్యజామ్

అన్వయః
శైశవే అభ్యస్తవిద్యానామ్ యౌవనే విషయైషిణామ్ వార్ధకే మునివృత్తీనాం అన్తే యోగేన తనుత్యజామ్1.8

సరలార్థః
యే బాల్యావస్థాయాం సర్వా విద్యాః అధీతవన్తః తాదృశానామ్, విద్యాశ్చ చతుర్దశ యథాహ మనుః అఙ్గాని వేదాశ్చత్వారో మీమాంసా న్యాయవిస్తరః పురాణం ధర్మశాస్త్రఞ్చ విద్యా హ్యేతాశ్చతుర్దశ'. యే యువావస్థాయాం ధర్మానుసారేణ భోగ్యసుఖం సేవితవన్తః తాదృశానామ్, వృద్ధవయసి సర్వభోగనివృత్తాః ఋషివ్రతమాశ్రితవన్తః తాదృశానామ్, అన్తకాలే యోగమార్గేణ దేహం త్యక్త్వా ముక్తిం లబ్ధవన్తః తాదృశానామ్
క్రమేణోదాహరణాని: తృతీయసర్గే 28-29 శ్లోకౌ, ప్రథమసర్గే 21 శ్లోకః, తృతీయసర్గే 70 శ్లోకః, అష్టమసర్గే 24 శ్లోకః

తాత్పర్యమ్
బాల్యంలో విద్యలనభ్యసించి, యౌవనంలో (ధర్మబద్ధంగా) తమ కోరికలను తీర్చుకొని, వృద్ధాప్యంలో మునివృత్తిని అవలంబించి, అవసానదశలో యోగమార్గంలో దేహాన్ని విడిచిపెట్టినవారూ (అయిన రఘువంశీయులయొక్క…)

(“ఆరు వేదాంగాలు, నాల్గు వేదాలు, మీమాంస, న్యాయశాస్త్రము, పురాణము, ధర్మశాస్త్రముఅని పదునాల్గు రకాల విద్యలను మనువు పేర్కొన్నాడని సరళార్థంలో చెప్పారు.)

రఘువంశమ్-1.7


శ్లోకః
త్యాగాయ సమ్భృతార్థానాం సత్యాయ మితభాషిణామ్ ।
యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినామ్ ॥1.7

పదవిభాగః
త్యాగాయ సమ్భృత-అర్థానాం సత్యాయ మిత-భాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహ-మేధినామ్

అన్వయః
త్యాగాయ సమ్భృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినామ్1.7

సరలార్థః
యే సత్పాత్రేభ్యో దాతుమేవార్థ-సఞ్చయం కృతవన్తః తాదృశానామ్. బహుభాషణే అనృతమపి స్యాదితి హేతోర్మితమేవ భాషన్తే స్మ తాదృశానామ్. యే ధర్మవిజయేన పుణ్యయశోలాభాయ దిగ్విజయం కృతవన్తః తాదృశానామ్. యే సుతార్థమేవ స్త్రీపరిణయం కృతవన్తః తాదృశానామ్... క్రమేణోదాహరణానిచతుర్థసర్గే షడశీతితమ శ్లోకః (86వది), ద్వాదశసర్గే సత్యాయ ప్రాణాంస్త్యజతా నృపదశరథేన సత్యస్య పరాకాష్ఠా దర్శితా. చతుర్థసర్గే త్రిచత్వారింశత్తమ శ్లోకః (43వది). ప్రథమసర్గే త్రిచత్వారింశత్తమ శ్లోకః (43వది) ॥

తాత్పర్యమ్
(లోభబుద్ధితో కాక) త్యాగము (దానం) చేసేందుకే ధనాన్ని కూడబెట్టినవారూ, (ఎక్కువగా మాట్లాడితే ఆ మాటల్లో అబద్ధాలు దొరలవచ్చునన్న జాగరూకతతో) సత్యం కోసమే మితంగా మాట్లాడేవారూ, (రాజ్యకాంక్షతో కాక) కీర్తి కోసమే (సమరాలలో) విజయాన్ని కోరుకున్నవారూ, (కామం కోసం కాక, పితౄణం తీర్చుకొనేందుకు) సంతానం కోసం గృహస్థులైనవారూ (అయిన రఘువంశీయులయొక్క…)