Saturday, June 30, 2018

రఘువంశమ్-1.73

శ్లోకః
ఇతి విజ్ఞాపితో రాజ్ఞా ధ్యానస్తిమితలోచనః ।
క్షణమాత్రమృషిస్తస్థౌ సుప్తమీన ఇవ హ్రదః ॥1.73

పదవిభాగః
ఇతి విజ్ఞాపితః రాజ్ఞా ధ్యాన-స్తిమిత-లోచనః । క్షణ-మాత్రమ్ ఋషిః తస్థౌ సుప్త-మీనః ఇవ హ్రదః ॥

అన్వయః
ఇతి రాజ్ఞా విజ్ఞాపితః ఋషిః (వశిష్ఠః) ధ్యాన-స్తిమిత-లోచనః (సన్) సుప్త-మీనః హ్రదః ఇవ క్షణ-మాత్రం తస్థౌ 1.73

వాచ్యపరివర్తనమ్
ఇతి రాజ్ఞా విజ్ఞాపితేన ఋషిణా వశిష్ఠేన ధ్యానస్తిమితలోచనేన (సతా) సుప్తమీనేన హ్రదేన ఇవ క్షణమాత్రం తస్థే

సరలార్థః
ఇత్థం సన్తానాభావదుఃఖం కథితవతి రాజని స మహర్షిః వశిష్ఠః సమాధినా నిమీలితనయనః సన్ ప్రశాన్తమీనసంచారో మహాసరోవర ఇవ అచలగమ్భీరభావేన క్షణకాలం తస్థౌ

తాత్పర్యమ్
ఈవిధంగా రాజుచేత విజ్ఞప్తి చేయబడిన వశిష్ఠమహర్షి క్షణకాలం ధ్యానంలో తన కనులను నిశ్చలంగా నిలిపినవాడై - చేపలు నిద్రిస్తూ ఉన్నప్పటి (నిశ్చల)సరోవరమువలె ఉండిపోయాడు.

రఘువంశమ్-1.72

శ్లోకః
తస్మాన్ముచ్యే యథా తాత సంవిధాతుం తథార్హసి ।
ఇక్ష్వాకూణాం దురాపేఽర్థే త్వదధీనా హి సిద్ధయః ॥1.72

పదవిభాగః
తస్మాత్ ముచ్యే యథా తాత సంవిధాతుం తథా అర్హసి । ఇక్ష్వాకూణాం దురాపే అర్థే త్వద్-అధీనాః హి సిద్ధయః

అన్వయః
(హే) తాత, యథా తస్మాత్ (ఋణాత్) (అహం) ముచ్యే తథా సంవిధాతుం (త్వం) అర్హసి హి ఇక్ష్వాకూణాం దురాపే అర్థే సిద్ధయః త్వదధీనాః (భవతి) 1.72

వాచ్యపరివర్తనమ్
తాత! యథా తస్మాత్ (మయా) ముచ్యతే తయా సంవిధాతుం (త్వయా) అర్హతే హి ఇక్ష్వాకూణాం దురాపే అర్థే సిద్ధిభిః త్వదధీనాభిః (భూయతే)

సరలార్థః
హే తాత! యేన విధానేన అహం పితృణామ్ ఋణనిర్మోక్ష-సాధనం సుతం లభేయ తాదృశం విధానం కృపయా విధేహి, యస్మాత్ ఇక్ష్వాకువంశ్యానాం దుర్లభేషు అపి అర్థేషు సిద్ధయః త్వదాయత్తాః సన్తి, తవైవ ప్రతాపాత్ తే సిద్ధిం లభన్తే

తాత్పర్యమ్
(దిలీపుడి విజ్ఞప్తి) తండ్రీ, ఏ విధముగా నేను ఆ పితౄణమునుంచి విముక్తిపొందగలనో ఆ విధానాన్ని నాకు నిర్దేశించగలవు. ఇక్ష్వాకువంశీయులయొక్క దుస్సాధ్యమైన కోరికలను (అన్నింటినీ) సిద్ధింపజేయటం నీ వశములో ఉన్న విషయమే.

రఘువంశమ్-1.71

శ్లోకః
అసహ్యపీడం భగవన్నృణమన్త్యమవేహి మే
అరున్తుదమివాలానామనిర్వాణస్య దన్తినః 1.71

పదవిభాగః
అసహ్య-పీడం భగవన్ ఋణమ్ అన్త్యమ్ అవేహి మే అరున్తుదమ్ ఇవ ఆలానామ్ అనిర్వాణస్య దన్తినః

అన్వయః
భగవన్, అనిర్వాణస్య దన్తినః అరున్తుదం ఆలానామ్ ఇవ మే (మమ) అసహ్యపీడమ్ అన్త్యమ్ ఋణమ్ అవేహి 1.71

వాచ్యపరివర్తనమ్
హే భగవన్, అనిర్వాణస్య దన్తినః అరున్తుదమ్ ఇవ మే అసహ్యపీడం అన్త్యమ్ ఋణం (త్వయా) అవేయతాం

సరలార్థః
యథా తోయస్నానాభావాత్ అత్యన్తః దుఃఖితః హస్తీ నిజాలానాం దుస్సహమర్మపీడాకరం జానాతి, తథా, హే బ్రహ్మన్, అహమపి అపుత్రతా కష్టే అసహ్యమర్మదుఃఖకరం మన్యే

తాత్పర్యమ్
(దిలీపుడి వగపు) ఓ దేవా, స్నానము చేయకుండా ఉన్న ఏనుగును (దానిని కట్టి ఉంచిన) కట్టుగొయ్య కలిగించే రాపిడి బాధించినట్లు, (నిస్సంతువునైన) నన్ను దేవ, ఋషి,పితృ ఋణాలలో చివరిదైన పితౄణము భరించలేనంతగా బాధిస్తున్నది అని తెలిసికొనుము.