శ్లోకః
తయా హీనం విధాతర్మాం కథం పశ్యన్న దూయసే ।
సిక్తం స్వయమివ స్నేహాద్వన్ధ్యమాశ్రమవృక్షకమ్ ॥1.70॥
పదవిభాగః
తయా హీనం విధాతః మాం కథం పశ్యన్ న దూయసే । సిక్తం
స్వయమ్ ఇవ స్నేహాద్ వన్ధ్యమ్ ఆశ్రమ-వృక్షకమ్ ॥
అన్వయః
విధాతః, స్నేహాత్ స్వయం
సిక్తం వన్ధ్యమ్ ఆశ్రమ-వృక్షకమ్ ఇవ తయా (సన్తత్యా) హీనం మాం పశ్యన్(సన్) కథం న
దూయసే ॥1.70॥
వాచ్యపరివర్తనమ్
హే విధాతః, స్నేహాత్
స్వయం సిక్తం వంధ్యమ్ ఆశ్రమవృక్షకమ్ ఇవ తయా (సన్తత్యా) హీనం మాం పశ్యతా (సతా, త్వయా) కథం న దూయతే ॥
సరలార్థః
స్వకరలాలితం తే సుతప్రేమాస్పదం తపోవనవృక్షం ఫలరహితం
విలోక్య త్వం యథా వ్యథసే తథైవ సమ్యక్ పాలితం సుతప్రేమాస్పదం మామపి సుతహీనం
దృష్ట్వా కిం తథా న వ్యథసే? ॥
తాత్పర్యమ్
(దిలీపుడు తన బాధను చెప్పుకుంటున్నాడు) “ఓ బ్రహ్మా, స్నేహంతో నీవు స్వయాన
నీళ్ళు పోసి పెంచిన ఆశ్రమవృక్షకం (చిన్న చెట్టు) (ఫలాలనివ్వక) గొడ్డుపోతే నీకు
బాధగా ఉంటుంది కదా. అలాంటి వంధ్యమైన ఆశ్రమవృక్షకం వలె సంతానహీనుడనైన నన్ను చూస్తూ
నీవు బాధపడకుండా ఎలా ఉంటావు?”
No comments:
Post a Comment