Saturday, June 16, 2018

రఘువంశమ్-1.49

శ్లోకః
వనాన్తరాదుపావృత్తైః సమిత్కుశఫలాహరైః ।
పూర్యమాణమదృశ్యాగ్నిప్రత్యుద్యాతైస్తపస్విభిః ॥1.49

పదవిభాగః
వన-అన్తరాత్ ఉపావృత్తైః సమిత్-కుశ-ఫలాహరైః । పూర్యమాణమ్ అదృశ్య-అగ్ని-ప్రత్యుద్యాతైః తపస్విభిః ॥

అన్వయః
(కథం భూతమ్ ఆశ్రమమ్?) వనాన్తరాద్ ఉపావృత్తైః సమిత్కుశఫలాహరైః అదృశ్యాగ్నిప్రత్యుద్యాతైః తపస్విభిః పూర్యమాణమ్ (ప్రాపత్) 1.49

వాచ్యపరివర్తనమ్
వనాన్తరాత్ ఉపావృత్తైః సమిత్కుశఫలాహరైః అదృశ్యాగ్నిప్రత్యుద్యాతైః తపస్విభిః పూర్యమాణః (ఆశ్రమః ప్రాపి)

సరలార్థః
సాయంకాలే సర్వే వనవాసినః అన్యస్మాత్ వనాత్ సమిధః కుశాన్ ఫలాని చ గృహీత్వా తస్మిన్నాశ్రమే ప్రవిశన్తి. యథా బాలాః ప్రవాసాత్ సమాగతాన్ పితౄన్ మిష్టాన్నాదిలోభాత్ ప్రత్యుద్గచ్ఛన్తి తథా తేషాం తపస్వినాం పుత్రభూతాః యజ్ఞవహ్నయోఽపి అన్యైః అలక్ష్యాః సన్తః యజ్ఞకాష్ఠాదిభోజ్యపదార్థలోభాత్ తాన్ వనవాసినః ప్రత్యుద్గచ్ఛన్తి

తాత్పర్యమ్‍
సాయంకాలం అవుతున్నది. మరొక అడవినుంచి సమిధలను, దర్భలను, ఫలాలను తీసుకొని వస్తున్నారు తపస్వులు. అదృశ్యంగా ఉన్న హోమాగ్నులు వారిని ఎదుర్కొంటున్నాయి. అలాంటి ఆశ్రమాన్ని (చేరుకున్నారు ఆ దంపతులు).
(ఆం.ప్ర.సా.అ. వ్యాఖ్య నుంచి-
యజ్ఞములు చేయునట్టి ఆహితాగ్నులు మరియొకచోటికి వెళ్ళి తిరిగివచ్చునప్పుడు హోమాగ్నులు, లోకమున గ్రామాంతరమునుండి తిరిగి వచ్చిన తండ్రిని పుత్రులు ఎదుర్కొనునట్లు, ఎదుర్కొనునని వేదము చెప్పుచున్నది…”)

No comments:

Post a Comment