శ్లోకః
పరస్పరాక్షిసాదృశ్యమదూరోజ్ఝితవర్త్మసు ।
మృగద్వన్ద్వేషు పశ్యన్తౌ స్యన్దనాబద్ధదృష్టిషు ॥1.40॥
పదవిభాగః
పరస్పర-అక్షి-సాదృశ్యమ్ అదూర-ఉజ్ఝిత-వర్త్మసు । మృగ-ద్వన్ద్వేషు
పశ్యన్తౌ స్యన్దన-ఆబద్ధ-దృష్టిషు ॥
అన్వయః
(పునః కథం భూతౌ దంపతీ?) అదూరోజ్ఝితవర్త్మసు స్యందనాబద్ధ-దృష్టిషు
మృగద్వన్ద్వేషు పరస్పరాక్షి-సాదృశ్యం పశ్యతౌ (జగ్మతుః) ॥1.40॥
వాచ్యపరివర్తనమ్
అదూరోజ్ఝితవర్త్మసు స్యన్దనాబద్ధదృష్టిషు
మృగద్వన్ద్వేషు పరస్పరాక్షిసాదృశ్యం పశ్యద్భ్యాం (దమ్పతిభ్యాం జగ్మే) ॥
సరలార్థః
తయోః దయాయుక్తం ప్రశాంతం నిర్మలం రూపం విలోక్య భయం
త్యక్త్వా హరిణాః హరిణ్యశ్చ స్యన్దనమార్గం త్యక్త్వా నికటే ఏవ స్థితాస్తమ్ అలౌకికం
స్యన్దనం లీలయా నిర్నిమేషం విలోకయామాసుః. తస్మిన్ సమయే నృపః మృగీషు సుదక్షిణా-నేత్రతుల్యతాం, సా చ మృగేషు పతినయన-సాదృశ్యం దదర్శ ॥
తాత్పర్యమ్
(అదురూ బెదురూ లేకుండా) రథం వెళ్ళేందుకు సరిపడా జాగాను
మాత్రమే వదిలి, బాటకు అతి సమీపంగా నిలుచున్న లేళ్ళ
జంటలు ఆ రథాన్ని తదేకంగా చూస్తున్నాయి. వాటిల్లోని మగ లేళ్ళ కళ్ళలో దిలీపుడి కళ్ళ
పోలికలను గమనిస్తున్నది సుదక్షిణ. ఆడ లేళ్ళ కళ్ళను చూస్తున్న దిలీపుడు వాటిల్లో
సుదక్షిణ నేత్రాల పోలికలను దర్శిస్తున్నాడు.
No comments:
Post a Comment