శ్లోకః
ఉపపన్నం నను శివం సప్తస్వఙ్గేషు యస్య మే ।
దైవీనాం మానుషీణాం చ ప్రతిహర్తా త్వమాపదామ్ ॥1.60॥
పదవిభాగః
ఉపపన్నం నను శివం సప్తసు అఙ్గేషు యస్య మే । దైవీనాం
మానుషీణాం చ ప్రతిహర్తా త్వమ్ ఆపదామ్ ॥
అన్వయః
మే (మమ) సప్తసు అంగేషు నను శివమ్ ఉపపన్నమ్, యస్య (మమ) దైవీనాం మానుషీణాం చ ఆపదాం త్వమ్ ప్రతిహర్తా (అసి)
॥1.60॥
వాచ్యపరివర్తనమ్
మే సప్తసు అంగేషు నను శివముపపన్నమ్ యస్య దైవీనాం
మానుషీణాం చ ఆపదాం ప్రతిహర్త్రా త్వయా (భూయతే) ॥
సరలార్థః
“హే బ్రహ్మన్, యదా మే త్వం
దేవమనుజఘటితానాం సర్వాసామేవ ఆపదాం దూరీకరణే నిరన్తరమ్ ఉద్యుక్తోఽసి, తదా మే రాజ్యే సర్వథా సిద్ధమేవ మఙ్గలమ్” ॥
తాత్పర్యమ్
దిలీపుడు వశిష్టుడితో ఇలా అన్నాడు, “దైవికమైన ఆపదలు, మానుషమైన
ఆపదలు మీచేత తొలగించబడుతున్న నా రాజ్యము యొక్క సప్తాంగాలలోనూ మంగళము
నెలకొనియున్నది కదా.”
(కేశవపంతుల వారి వ్యాఖ్య నుంచి ఈ క్రింది అదనపు వివరణ:
ఐదు దైవికమైన ఆపదలు - అగ్నిభయము, వరదలు, వ్యాధులు, కఱవు, జననష్టము; ఐదు మానుషమైన ఆపదలు - ఆయుక్తులు, చోరులు, శత్రురాజులు, రాజవల్లభులు, రాజుయొక్క
లోభము;
రాజ్యపు సప్తాంగాలు – స్వామి, ఆమాత్యుడు, సుహృత్, రాష్ట్రము, దుర్గము, సైన్యము)
No comments:
Post a Comment