శ్లోకః
సోఽహమిజ్యా విశుద్ధాత్మా ప్రజాలోపనిమీలితః ।
ప్రకాశశ్చాప్రకాశశ్చ లోకాలోక ఇవాచలః ॥1.68॥
పదవిభాగః
సః అహమ్ ఇజ్యా-విశుద్ధ-ఆత్మా ప్రజా-లోప-నిమీలితః ।
ప్రకాశః చ ప్రకాశః చ లోకాలోకః ఇవ అచలః ॥
అన్వయః
సః అహమ్ ఇజ్యావిశుద్ధాత్మా ప్రజాలోపనిమీలితః (సన్)
అచలః లోకాలోక ఇవ ప్రకాశః అప్రకాశః చ (అస్మి) ॥1.68॥
వాచ్యపరివర్తనమ్
తేన మయా ఇజ్యావిశుద్ధాత్మనా ప్రజాలోప-నిమీలితేన
(సతా) అచలేన లోకాలోకేన ఇవ ప్రకాశేన అప్రకాశేన చ (భూయతే) ॥
సరలార్థః
యథాహి లోకాలోకనామా అద్రిః ఏకతః రవిసంపర్కాత్
ప్రకాశితః అపరతశ్చ రవిసంపర్కరహితత్వాత్ అంధకార-ఆచ్ఛన్నస్తిష్ఠతి, తథాహమపి ఏకతః యజ్ఞోత్పన్నేన ధర్మప్రకాశేన ప్రకాశితః పక్షే, అపుత్రత్వేన శోకాన్ధకారేణ ఆచ్ఛన్న ఇవ తిష్ఠామి ॥
తాత్పర్యమ్
(దిలీపుడి వగపు) “ఎలాగైతే
లోకాలోకమనే పర్వతము ఒకపక్కన వెలుగుతూ మరొకపక్క చీకటిలో ఉంటుందో – అలా నేను యజ్ఞములు చేసి విశుద్ధాత్ముడనై ఉన్నప్పటికీ, సంతానరాహిత్యపు చీకటి చేత కప్పబడినవాడనయ్యాను.”
(లోకాలోకము/చక్రవాళము అనే పర్వతం సర్వవిశ్వమును చుట్టియుండి
లోపలమాత్రమే కనబడుతుందని బయట అంతా అంధకారమేనని ఆం.ప్ర.సా.అ.ప్రచురణలోని వివరణ.
మరిన్ని వివరాలకు:
http://www.hindu-blog.com/2013/05/lokaloka-mountain.html)
No comments:
Post a Comment