శ్లోకః
నూనం మత్తః పరం వంశ్యాః పిణ్డవిచ్ఛేదదర్శినః ।
న ప్రకామభుజః శ్రాద్ధే స్వధాసఙ్గ్రహతత్పరాః ॥1.66॥
పదవిభాగః
నూనం మత్తః పరం వంశ్యాః పిణ్డ-విచ్ఛేద-దర్శినః । న
ప్రకామ-భుజః శ్రాద్ధే స్వధా-సఙ్గ్రహ-తత్పరాః ॥
అన్వయః
నూనం మత్తః పరం పిణ్డవిచ్ఛేదదర్శినః
స్వధాసఙ్గ్రహతత్పరాః (సన్తః) వంశ్యాః శ్రాద్ధే ప్రకామభుజః న (సన్తి) ॥1.66॥
వాచ్యపరివర్తనమ్
నూనం మత్తః పరం పిణ్డవిచ్ఛేదదర్శిభిః
స్వధాసంగ్రహతత్పరైః (సద్భిః) వంశ్యైః శ్రాద్ధే ప్రకామభుగ్భిః న (భూయతే) ॥
సరలార్థః
మయి పరలోకగతే సతి సుతాభావాత్ పిణ్డలోపమవలోక్య మే
పితరః మద్దత్తం శ్రాద్ధాన్నం నైవ ఉదరపూర్ణం భుఞ్జతే, యస్మాత్తే తద్భవిష్యదర్థే అర్జితుం వ్యగ్రాః భవన్తి, అహో శోచనీయం! ॥
తాత్పర్యమ్
(దిలీపుడి మాటల కొనసాగింపు) “నా తరువాత పిండప్రదానము జరగబోదని గ్రహించిన నా పితరులు తమ ఆహారాన్ని రానున్న
రోజులకోసమని దాచుకునే ధ్యాసలో ఉంటూ, ఇప్పుడు (నేను
చేస్తున్న) శ్రాద్ధంలో తృప్తిగా తినడం లేదు.”
No comments:
Post a Comment