శ్లోకః
స దుష్ప్రాపయశాః ప్రాపదాశ్రమం శ్రాన్తవాహనః ।
సాయం సంయమినస్తస్య మహర్షేర్మహిషీసఖః ॥1.48॥
పదవిభాగః
స దుష్ప్రాప-యశాః ప్రాపద్ ఆశ్రమం శ్రాన్త-వాహనః ।
సాయం సంయమినః తస్య మహర్షేః మహిషీ-సఖః ॥
అన్వయః
దుష్ప్రాపయశాః శ్రాన్తవాహనః మహిషీ-సఖః సః (దిలీపః)
సాయం సంయమినః తస్య మహర్షేః (స్వగురు-వశిష్ఠస్య) ఆశ్రమం ప్రాపత్ ॥1.48॥
వాచ్యపరివర్తనమ్
దుష్ప్రాపయశసా శ్రాంతవాహనేన మహిషీసఖేన తేన
(దిలీపేన) సాయం సంయమినః తస్య మహర్షేః (వసిష్ఠస్య) ఆశ్రమః ప్రాపి ॥
సరలార్థః
దుర్లభయశఃసంపన్నః సస్త్రీకః స దిలీపః సాయంకాలే
తపోధనస్య వశిష్ఠస్యాశ్రమం ఆససాద తదా చ సుదూరగమనేన తదీయాః రథాశ్వాః పరిక్లాన్తాః
అభవన్ ॥
తాత్పర్యమ్
(ఇతరులకు) దుర్లభమైన కీర్తిని కలిగినవాడు, (బహుదూరప్రయాణకారణంగా) అలిసిపోయిన రథాశ్వాలను కలిగినవాడు, మహారాణికి సఖుడు (అయిన దిలీపుడు) సాయంసమయానికి సంయమియైన ఆ
(వసిష్ఠ) మహర్షియొక్క ఆశ్రమానికి చేరుకున్నాడు.
(పొత్తూరి వేంకటేశ్వరరావుగారు సంకలించిన పారమార్థికపదకోశం
నుంచి:
సంయమం = యోగశాస్త్రంలో ధారణ, ధ్యానం, సమాధి అనే మూడు
సాధనలను కలిపి సంయమం అంటారు… వ్రతాలలో మొదటి రోజు
పాటించవలసిన ఆచారాలు, చాలించడం, విరమించడం అనేవి సామాన్యార్థాలు;
సంయమి = సంయమం కలవాడు; ముని)
No comments:
Post a Comment