శ్లోకః
లోకాన్తరసుఖం పుణ్యం తపోదానసముద్భవమ్ ।
సన్తతిః శుద్ధవంశ్యా హి పరత్రేహ చ శర్మణే ॥1.69॥
పదవిభాగః
లోకాన్తరసుఖం పుణ్యం తపో-దాన-సముద్భవమ్ । సన్తతిః
శుద్ధ-వంశ్యా హి పరత్ర ఇహ చ శర్మణే ॥
అన్వయః
తపః-దాన-సముద్భవం పుణ్యం లోక-అన్తర-సుఖం (భవతి) హి.
శుద్ధ-వంశ్యాః సన్తతిః పరత్ర ఇహ చ శర్మణే (భవతి) ॥1.69॥
వాచ్యపరివర్తనమ్
తపోదాన-సముద్భవేన పుణ్యేన లోకాన్తరసుఖేన (భూయతే)
హి. శుద్ధవంశ్యయా సన్తత్యా పరత్ర ఇహ చ శర్మణే (భూయతే) ॥
సరలార్థః
అధ్యయన-తపోదానాదిభిః యత్సుకృతం భవతి తత్కేవలం
పారలౌకికసుఖాయ. సుపుత్రస్తు ఇహలోకే భక్తిశుశ్రూషాదిభిః పరలోకే
నరకత్రాణజలపిణ్డదానాదిభిః పితుః సుఖం విదధాతి ॥
తాత్పర్యమ్
(ఇంకా దిలీపుడు ఇలా అంటున్నాడు) “తపస్సుచేత, దానముచేత కలిగే
పుణ్యము పరలోకములో మాత్రమే సుఖాన్నిస్తుంది. మంచివంశంలో జన్మించిన సంతానము -
నరకప్రాప్తినుంచి తప్పించగల జలపిండప్రదానముతో - పరలోకములోనూ - భక్తిశుశ్రూషలతో -ఈ
లోకములోనూ సుఖాన్ని కలిగిస్తుంది.”
No comments:
Post a Comment