శ్లోకః
హవిరావర్జితం హోతస్త్వయా విధివదగ్నిషు ।
వృష్టిర్భవతి సస్యానామవగ్రహవిశోషిణామ్ ॥1.62॥
పదవిభాగః
హవిః ఆవర్జితం హోతః త్వయా విధి-వత్ అగ్నిషు ।
వృష్టిః భవతి సస్యానామ్ అవగ్రహ-విశోషిణామ్ ॥
అన్వయః
హే హోతః! త్వయా విధివద్ అగ్నిషు ఆవర్జితమ్ హవిః
అవగ్రహవిశోషిణామ్ సస్యానామ్ వృష్టిః భవతి ॥1.62॥
వాచ్యపరివర్తనమ్
హే హోతః! త్వయా విధివత్ అగ్నిషు ఆవర్తితేన హవిషా
అవగ్రహవిశోషిణామ్ సస్యానామ్ వృష్ట్యా భూయతే ॥
సరలార్థః
భో హవనశీల! హోమవహ్నౌ విధిపూర్వకం భవతా యా ఆహుతిః
ప్రదీయతే సైవ వర్షరూపేణ పరిణతా సతీ అవగ్రహవిశుష్కం మత్ప్రజాజీవనసాధనం సస్యమ్
ఉజ్జీవయతి ॥
తాత్పర్యమ్
(దిలీపుడు వశిష్ఠుడితో ఇంకా ఇలా అంటున్నాడు) “ఓ హోతా, నీవు
శాస్త్రప్రకారముగా (హోమ) అగ్నిలో వ్రేలుస్తున్న హవిస్సుల కారణంగా, (నా రాజ్యంలో) అనావృష్టి చేత ఎండిపోయిన పైరులకు వర్షము
కలుగుతున్నది”
(నీ యజ్ఞముల కారణంగా సకాలంలో వానలు కురిసి నా రాజ్యం
సుభిక్షంగా ఉంటున్నది)
No comments:
Post a Comment