Sunday, May 6, 2018

రఘువంశమ్-1.37

శ్లోకః
మా భూదాశ్రమపీడేతి పరిమేయపురఃసరౌ ।
అనుభావవిశేషాత్తు సేనాపరివృతావివ ॥1.37

పదవిభాగః
మా భూత్ ఆశ్రమ-పీడా ఇతి పరిమేయ-పురః-సరౌ । అనుభావ-విశేషాత్ తు సేనా-పరివృతౌ ఇవ ॥

అన్వయః
(పునః కథం భూతౌ తౌ?) ‘ఆశ్రమపీడా మా భూత్’ ఇతి (హేతోః) పరిమేయ-పురఃసరౌ తు (కిం తు) అనుభావవిశేషాత్ సేనాపరివృతౌ ఇవ (స్థితౌ జగ్మతుః) 1.37

వాచ్యపరివర్తనమ్
ఆశ్రమపీడయామా భావి ఇతి (హేతోః) పరిమేయపురస్సరాభ్యాం తు (కిం తు) అనుభావవిశేషాత్ సేనాపరివృతాభ్యామివ (తాభ్యాం స్థితాభ్యాం జగ్మే)

సరలార్థః
తౌ సుదక్షిణాదిలీపౌ గురోర్వశిష్ఠస్య ఆశ్రమదుఃఖ-పరిహారాయ యద్యపి న్యూనైరేవ సేవకైస్సార్ధం గతౌ తథాపి తౌ దుస్సహేన కేనాపి ప్రతాపేన అసంఖ్యసైన్యావృతావివ శత్రుదుర్ధర్షౌ జాతౌ

తాత్పర్యమ్‍
ఆశ్రమవాసులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని సుదక్షిణాదిలీపులు తమ సేవకులను పరిమితసంఖ్యలో మాత్రమే తీసుకొనివెళ్ళారు. (అయినా) వారి తేజోవిశేషం కారణంగా వారు (విశాలమైన) సేనాసమేతంగా వెళుతున్నారా అన్నట్లుగా అగపడ్డారు.
(పురస్సరౌ = ముందునడచే వారు గలవారు - ద్వి.వ; పరివృతౌ = చుట్టబడిన వారు/ఆవరించబడిన వారు ద్వి.వ)

రఘువంశమ్-1.36

శ్లోకః
స్నిగ్ధగమ్భీరనిర్ఘోషమేకం స్యన్దనమాస్థితౌ
ప్రావృషేణ్యం పయోవాహం విద్యుదైరావతావివ ॥1.36

పదవిభాగః
స్నిగ్ధ-గమ్భీర-నిర్ఘోషమ్ ఏకం స్యన్దనమ్ ఆస్థితౌ । ప్రావృషేణ్యం పయో-వాహం విద్యుత్-ఐరావతౌ ఇవివ ॥

అన్వయః
(కీదృశౌ తౌ దంపతీ?) స్నిగ్ధగమ్భీర-నిర్ఘోషమ్ ఏకం స్యందనమ్ ఆస్థితౌ (అత ఏవ) ప్రావృషేణ్యం (ఏకం) పయోవాహం (ఆస్థితౌ) విద్యుద్-ఐరావతౌ ఇవ స్థితౌ (జగ్మతుః) 1.36

వాచ్యపరివర్తనమ్
స్నిగ్ధగమ్భీర-నిర్ఘోషమ్ ఏకం స్యందనమ్ ఆస్థితాభ్యాం (తాభ్యామ్) ప్రావృషేణ్యం పయోవాహం విద్యుదైరావతాభ్యామివ (జగ్మే)

సరలార్థః
యథా అభ్రముమాతఙ్గః తత్ప్రియా చపలా చ ఉభౌ వర్షాకాలే మనోరమధ్వనియుక్తే వారివాహే ప్రకాశేతే తథా దిలీపః సుదక్షిణా చోభౌ ఘర్ఘరశబ్దయుక్తే ఏకస్మిన్ స్యన్దనే ప్రకాశేతే స్మ

తాత్పర్యమ్
సుదక్షిణాదిలీపులు మధురగంభీరమైన ధ్వనిని చేస్తున్న రథాన్ని ఎక్కి వెళుతున్నారు. ఆ రథం వర్షాకాలమేఘంలాగా ఉన్నది. ఆ నల్లని మేఘంలో వెలుగుతున్న మెరుపూ, ఐరావతాలలా ఉన్నారు ఆ దంపతులు.

రఘువంశమ్-1.35

శ్లోకః
అథాభ్యర్చ్య విధాతారం ప్రయతౌ పుత్రకామ్యయా ।
తౌ దంపతీ వశిష్ఠస్య గురోర్జగ్మతురాశ్రమమ్ ॥1.35

పదవిభాగః
అథ అభ్యర్చ్య విధాతారం ప్రయతౌ పుత్ర-కామ్యయా । తౌ దంపతీ వశిష్ఠస్య గురోః జగ్మతుః ఆశ్రమమ్ ॥

అన్వయః
అథ ప్రయతౌ తౌ దంపతీ పుత్రకామ్యయా విధాతారమ్ అభ్యర్చ్య గురోః వశిష్ఠస్య ఆశ్రమం జగ్మతుః 1.35

వాచ్యపరివర్తనమ్
అథ ప్రయతాభ్యాం తాభ్యాం దంపతిభ్యాం పుత్రకామ్యయా విధాతారమ్ అభ్యర్చ్య గురోః వశిష్ఠస్య ఆశ్రమః జగ్మే

సరలార్థః
తౌ సుదక్షిణాదిలీపౌ సంతానలాభాయ ప్రథమం బ్రహ్మాణం ప్రేమభక్త్యా ఆరాధ్య పశ్చాత్ సుతజన్మోపాయః విధాతుం కులగురోర్వశిష్ఠస్య ఆశ్రమం గతౌ ॥

తాత్పర్యమ్
అటు పిమ్మట, సంతానార్థులై న ఆ దంపతులిరువురు వ్రతదీక్షను పూని బ్రహ్మను పూజించి, (తగిన ఉపాయాన్ని బోధిస్తారన్న ఆశతో) గురువైన వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళారు.