Thursday, May 3, 2018

రఘువంశమ్-1.31

శ్లోకః
తస్య దాక్షిణ్యరూఢేన నామ్నా మగధవంశజా ।
పత్నీ సుదక్షిణేత్యాసీదధ్వరస్యేవ దక్షిణా 1.31

పదవిభాగః
తస్య దాక్షిణ్య-రూఢేన నామ్నా మగధ-వంశజా । పత్నీ సుదక్షిణా ఇతి ఆసీద్ అధ్వరస్య ఇవ దక్షిణా

అన్వయః
తస్య మగధవంశజా దాక్షిణ్యరూఢేన సుదక్షిణా ఇతి నామ్నా పత్నీ అధ్వరస్య దక్షిణా పత్నీ ఇవ ఆసీత్ 1.31

వాచ్యపరివర్తనమ్
తస్య మగధవంశజయా దాక్షిణ్యరూఢేన సుదక్షిణా ఇతి నామ్నా పత్న్యా అధ్వరస్య దక్షిణయా (పత్న్యా) ఇవ అభూయత

సరలార్థః
పవిత్రా, యజ్ఞస్య పత్నీ దక్షిణేవ అతినిర్మలా, మగధరాజకన్యా, సుదక్షిణా నామ తస్య మహిషీ ఆసీత్ ఇతి సరలార్థః

తాత్పర్యమ్
మగధరాజవంశంలో పుట్టినది, దాక్షిణ్యస్వభావురాలిగా ప్రసిద్ధికెక్కినది, యజ్ఞపురుషుడి భార్యయైన దక్షిణ వలె పవిత్రురాలైనటువంటిది అయిన సుదక్షిణ దిలీపుడి ధర్మపత్నియై ఉండెను.

టిప్పణి
1.       దాక్షిణ్యము = పరుల మనస్సును ఎరిగి ప్రవర్తించే స్వభావం;
2.       దక్షిణ = రుచిప్రజాపతికి లక్ష్మియంశమున బుట్టిన కుమారిత. ఈమె తల్లి ఆకూతి. ఈమె సోదరుడగు యజ్ఞునే భర్తగ బడసెను. వీరలే యాదిమిథునము గావున నది యాక్షేపణీయము కాదు. వీరికి తోషుడు, సంతోషుడు, ప్రతోషుడు, భద్రుడు, శాంతి, నిడస్పతి, బధ్ముడు, కవి, విభుడు, వహ్ని, సుదేవుడు, రోచనుడు అనువారు పుట్టిరి. వారే తుషితులను దేవతలైరి (భాగ.)
(పూర్వగాథాలహరి నుంచి)

No comments:

Post a Comment