Sunday, February 18, 2018

రఘువంశమ్-1.4

శ్లోకః
అథ వా కృతవాగ్ద్వారే వంశేఽస్మిన్పూర్వసూరిభిః ।
మణౌ వజ్రసముత్కీర్ణే సూత్రస్యేవాస్తి మే గతిః ॥1.4

పదవిభాగః
అథ వా కృత-వాక్-ద్వారే వంశే అస్మిన్ పూర్వ-సూరిభిః । మణౌ వజ్ర-సముత్కీర్ణే సూత్రస్య ఇవ అస్తి మే గతిః ॥

అన్వయః
అథ వా పూర్వసూరిభిః కృతవాగ్ద్వారే అస్మిన్ వంశే, వజ్రసముత్కీర్ణే మణౌ సూత్రస్య ఇవ మే గతిః అస్తి. ॥1.4

వాచ్యపరివర్తనమ్
అథ వా పూర్వసూరిభిః కృతవాగ్ద్వారే అస్మిన్ వంశే, వజ్రసముత్కీర్ణే మణౌ సూత్రస్య ఇవ మే గత్యా భూయతే

సరలార్థః
యథా అతికోమలమపి సూత్రం హీరకసూచీకృతేన ఛిద్రమార్గేణ కఠినేఽపి మణౌ విశతి తథా హీనాపి మే బుద్ధిః వాల్మీకికవికృతేన రామాయణాఖ్య-కావ్యద్వారేణాతిదుర్గమేఽపి రఘువంశే ప్రవేక్ష్యతి. పూర్వకవీనాం రామాయణాదిప్రబన్ధ-సాహాయ్యేనాహం దుర్వచనేఽపి రఘువంశవర్ణనే సమర్థః స్యామితి భావః

తాత్పర్యమ్
అయితే, వజ్రపుమొన కలిగిన సూదివంటి పనిముట్టుతో పొడిచి మణులలో రంధ్రం చేసాక దారానికి దారి ఏర్పడినట్లు, (వాల్మీక్యాది) పూర్వపండితులు (కవులు) ఏర్పరచిన వాగ్ద్వారం (కావ్యద్వారం) గుండా ఈ (రఘు)వంశము (అనే కావ్యం) లోనికి నాకు ప్రవేశం లభిస్తుంది.
పూర్వకవుల మార్గాన్ని అనుసరించి ఈ కావ్యాన్ని రచిస్తాను అని పిండితార్థము.

Friday, February 16, 2018

రఘువంశమ్-1.3


శ్లోకః
మన్దః కవియశఃప్రార్థీ గమిష్యామ్యపహాస్యతామ్ ।
ప్రాంశులభ్యే ఫలే లోభాదుద్బాహురివ వామనః ॥1.3

పదవిభాగః
మన్దః కవి-యశః-ప్రార్థీ గమిష్యామి అపహాస్యతామ్ । ప్రాంశు-లభ్యే ఫలే లోభాత్ ఉద్బాహుః ఇవ వామనః ॥

అన్వయః
మన్దః (తథాపి) కవియశఃప్రార్థీ (సన్ అహం) ప్రాంశులభ్యే ఫలే లోభాద్ ఉద్బాహుః వామనః ఇవ అపహాస్యతాం గమిష్యామి. ॥1.3

వాచ్యపరివర్తనమ్
మన్దేన కవియశఃప్రార్థినా (మయా) ప్రాంశులభ్యే ఫలే లోభేన ఉద్బాహునా వామనేన ఇవ అపహాస్యతా గంస్యతే

సరలార్థః
ఉన్నతపురుషలభ్యం ఫలం గ్రహీతుమ్ ఉచ్ఛ్రితహస్తస్య ఖర్వస్య చేష్టా యథా అపహసనీయా భవతి తథైవ మహాకవిలభ్యాం కీర్తిం లబ్ధుం ప్రవృత్తస్య హీనబుద్ధేః మమాపి చేష్టా అపహసనీయా భవిష్యతి. (అహో మే మూఢతా యదహమసమర్థోఽపి మహాకావ్యవిరచనే ప్రవృత్తః.)

తాత్పర్యమ్
మందబుద్ధిని అయినా కవులకు లభించే కీర్తిని కోరుకుంటున్నాను. ఎత్తున వ్రేలాడుతున్న ఫలాలకోసం ఆశ కొద్దీ చేతులు చాచే పొట్టివాడిలా, హేళనకు పాత్రుడనవబోతున్నాను.

కొసరు వివరాలు
ప్రాంశులభ్యే ఫలే (సతి సప్తమి ప్రయోగం; యే ఫలాని ప్రాంశులభ్యాని తే; ఏ పళ్ళైతే ఎత్తున ఉన్నాయో అవి)

Thursday, February 15, 2018

రఘువంశమ్-1.2



శ్లోకః
క్వ సూర్యప్రభవో వంశః క్వ చాల్పవిషయామతిః ।
తితీర్షుర్దుస్తరం మోహాదుడుపేనాస్మి సాగరమ్ ॥1.2

పదవిభాగః
క్వ సూర్య-ప్రభవః వంశః క్వ చ అల్ప-విషయా-మతిః । తితీర్షుః దుస్తరం మోహాత్ ఉడుపేన అస్మి సాగరమ్ ॥

అన్వయః
సూర్యప్రభవః వంశః క్వ, అల్పవిషయా (మమ) మతిః చ క్వ? (అహం) మోహాద్ ఉడుపేన దుస్తరం సాగరం తితీర్షుః అస్మి ॥1.2

వాచ్యపరివర్తనమ్
సూర్యప్రభవేణ వంశేన క్వ (భూయతే) అల్పవిషయయా (మమ) మత్యా చ క్వ (భూయతే) మయా తితీర్షుణా భూయతే

సరలార్థః
యథా హి కశ్చిత్ మందధీః లఘుతృణాదినిర్మితస్య ప్లవస్య సాహాయ్యేన మహాసాగరతరణే ప్రవర్తతే తథైవ మందబుద్ధిరహమపి క్షుద్రాశయగ్రాహిణో నిజజ్ఞానస్య సాహాయ్యేన సువిస్తృతసూర్యకులవర్ణనే ప్రవృత్తోస్మి

తాత్పర్యమ్
సూర్యుడినుంచి ప్రభవించిన వంశము ఎక్కడ, అల్పవిషయాలకు సీమితమైన నా బుద్ధి ఎక్కడ? మూర్ఖత్వం కారణంగా, ఎంతో కష్టపడితేకానీ దాటలేని మహాసముద్రాన్ని (బలహీనమైన) తెప్పనెక్కి దాటాలనుకుంటున్నాను.
(ఉడుపము = ప్లవము, తెప్పమ్రాను)
వ్యాకరణాంశాల కోసం: https://raghuvamsha.wordpress.com/2017/03/04/క్వ-సూర్యప్రభవః-2-1/