Showing posts with label प्रथमसर्ग. Show all posts
Showing posts with label प्रथमसर्ग. Show all posts

Tuesday, March 6, 2018

రఘువంశమ్-1.8

శ్లోకః
శైశవేఽభ్యస్తవిద్యానాం యౌవనే విషయైషిణామ్ ।
వార్ధకే మునివృత్తీనాం యోగేనాన్తే తనుత్యజామ్ ॥1.8

పదవిభాగః
శైశవే అభ్యస్త-విద్యానాం యౌవనే విషయ-ఏషిణామ్ । వార్ధకే ముని-వృత్తీనాం యోగేన అన్తే తను-త్యజామ్

అన్వయః
శైశవే అభ్యస్తవిద్యానామ్ యౌవనే విషయైషిణామ్ వార్ధకే మునివృత్తీనాం అన్తే యోగేన తనుత్యజామ్1.8

సరలార్థః
యే బాల్యావస్థాయాం సర్వా విద్యాః అధీతవన్తః తాదృశానామ్, విద్యాశ్చ చతుర్దశ యథాహ మనుః అఙ్గాని వేదాశ్చత్వారో మీమాంసా న్యాయవిస్తరః పురాణం ధర్మశాస్త్రఞ్చ విద్యా హ్యేతాశ్చతుర్దశ'. యే యువావస్థాయాం ధర్మానుసారేణ భోగ్యసుఖం సేవితవన్తః తాదృశానామ్, వృద్ధవయసి సర్వభోగనివృత్తాః ఋషివ్రతమాశ్రితవన్తః తాదృశానామ్, అన్తకాలే యోగమార్గేణ దేహం త్యక్త్వా ముక్తిం లబ్ధవన్తః తాదృశానామ్
క్రమేణోదాహరణాని: తృతీయసర్గే 28-29 శ్లోకౌ, ప్రథమసర్గే 21 శ్లోకః, తృతీయసర్గే 70 శ్లోకః, అష్టమసర్గే 24 శ్లోకః

తాత్పర్యమ్
బాల్యంలో విద్యలనభ్యసించి, యౌవనంలో (ధర్మబద్ధంగా) తమ కోరికలను తీర్చుకొని, వృద్ధాప్యంలో మునివృత్తిని అవలంబించి, అవసానదశలో యోగమార్గంలో దేహాన్ని విడిచిపెట్టినవారూ (అయిన రఘువంశీయులయొక్క…)

(“ఆరు వేదాంగాలు, నాల్గు వేదాలు, మీమాంస, న్యాయశాస్త్రము, పురాణము, ధర్మశాస్త్రముఅని పదునాల్గు రకాల విద్యలను మనువు పేర్కొన్నాడని సరళార్థంలో చెప్పారు.)

రఘువంశమ్-1.7


శ్లోకః
త్యాగాయ సమ్భృతార్థానాం సత్యాయ మితభాషిణామ్ ।
యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినామ్ ॥1.7

పదవిభాగః
త్యాగాయ సమ్భృత-అర్థానాం సత్యాయ మిత-భాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహ-మేధినామ్

అన్వయః
త్యాగాయ సమ్భృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినామ్1.7

సరలార్థః
యే సత్పాత్రేభ్యో దాతుమేవార్థ-సఞ్చయం కృతవన్తః తాదృశానామ్. బహుభాషణే అనృతమపి స్యాదితి హేతోర్మితమేవ భాషన్తే స్మ తాదృశానామ్. యే ధర్మవిజయేన పుణ్యయశోలాభాయ దిగ్విజయం కృతవన్తః తాదృశానామ్. యే సుతార్థమేవ స్త్రీపరిణయం కృతవన్తః తాదృశానామ్... క్రమేణోదాహరణానిచతుర్థసర్గే షడశీతితమ శ్లోకః (86వది), ద్వాదశసర్గే సత్యాయ ప్రాణాంస్త్యజతా నృపదశరథేన సత్యస్య పరాకాష్ఠా దర్శితా. చతుర్థసర్గే త్రిచత్వారింశత్తమ శ్లోకః (43వది). ప్రథమసర్గే త్రిచత్వారింశత్తమ శ్లోకః (43వది) ॥

తాత్పర్యమ్
(లోభబుద్ధితో కాక) త్యాగము (దానం) చేసేందుకే ధనాన్ని కూడబెట్టినవారూ, (ఎక్కువగా మాట్లాడితే ఆ మాటల్లో అబద్ధాలు దొరలవచ్చునన్న జాగరూకతతో) సత్యం కోసమే మితంగా మాట్లాడేవారూ, (రాజ్యకాంక్షతో కాక) కీర్తి కోసమే (సమరాలలో) విజయాన్ని కోరుకున్నవారూ, (కామం కోసం కాక, పితౄణం తీర్చుకొనేందుకు) సంతానం కోసం గృహస్థులైనవారూ (అయిన రఘువంశీయులయొక్క…)

రఘువంశమ్-1.6


శ్లోకః
యథావిధిహుతాగ్నీనాం యథాకామార్చితార్థినామ్ ।
యథాపరాధదణ్డానాం యథాకాలప్రబోధినామ్ ॥1.6

పదవిభాగః
యథావిధి-హుత-అగ్నీనాం యథాకామ-అర్చిత-అర్థినామ్ । యథా-అపరాధ-దణ్డానాం యథా-కాల-ప్రబోధినామ్ ॥

అన్వయః
యథావిధిహుతాగ్నీనాం యథాకామార్చితార్థినామ్ యథాపరాధదణ్డానాం యథాకాల-ప్రబోధినామ్1.6

సరలార్థః
యే సాయం ప్రాతః గార్హపత్యాహవనీయ-దక్షిణానామకేషు అగ్నిషు వేదానుసారేణ హోమం కృతవన్తః తాదృశానాం, యేఽభిలషిత-వస్తుదానేనార్థినః సత్కృతవన్తః తాదృశానాం, యే దణ్డార్హేషు అపరాధానురూపం న్యాయ్యం దణ్డం ప్రణీతవన్తః తాదృశానాం, యే బ్రాహ్మే ముహూర్తే శయనాదుత్థాయ సర్వాణి కర్మాణి క్రమానుసారేణ సమ్పాదితవన్తః తాదృశానామ్క్రమేణోదాహరణాని పంచమసర్గే పంచాదశమ శ్లోకః (15వ శ్లోకం), ఏకాదశసర్గే ద్వితీయశ్లోకః, చతుర్థసర్గే అష్టమ శ్లోకః. ప్రథమసర్గే పంచనవతితమః శ్లోకః (95వ శ్లోకం) ॥

తాత్పర్యమ్
ప్రతి సాయంత్రమూ, ఉదయమూ వేదానుసారంగా గార్హపత్యము, ఆహవనీయము, దక్షిణము అని పేర్లు గల మూడు అగ్నులలో (త్రేతాగ్నులలో) సమిధలు వ్రేల్చి హోమం చేసేవారూ, కోరిన వస్తువులను ఇచ్చి అర్థించినవారిని సత్కరించేవారూ, (దోషుల) నేరాలకు న్యాయమైన దండనలను విధించేవారూ, బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర మేల్కొనేవారూ (అయిన రఘువంశీయుల యొక్క…).