Tuesday, March 6, 2018

రఘువంశమ్-1.6


శ్లోకః
యథావిధిహుతాగ్నీనాం యథాకామార్చితార్థినామ్ ।
యథాపరాధదణ్డానాం యథాకాలప్రబోధినామ్ ॥1.6॥

పదవిభాగః
యథావిధి-హుత-అగ్నీనాం యథాకామ-అర్చిత-అర్థినామ్ । యథా-అపరాధ-దణ్డానాం యథా-కాల-ప్రబోధినామ్ ॥

అన్వయః
యథావిధిహుతాగ్నీనాం యథాకామార్చితార్థినామ్ యథాపరాధదణ్డానాం యథాకాల-ప్రబోధినామ్… ॥1.6॥

సరలార్థః
యే సాయం ప్రాతః గార్హపత్యాహవనీయ-దక్షిణానామకేషు అగ్నిషు వేదానుసారేణ హోమం కృతవన్తః తాదృశానాం, యేఽభిలషిత-వస్తుదానేనార్థినః సత్కృతవన్తః తాదృశానాం, యే దణ్డార్హేషు అపరాధానురూపం న్యాయ్యం దణ్డం ప్రణీతవన్తః తాదృశానాం, యే బ్రాహ్మే ముహూర్తే శయనాదుత్థాయ సర్వాణి కర్మాణి క్రమానుసారేణ సమ్పాదితవన్తః తాదృశానామ్… క్రమేణోదాహరణాని పంచమసర్గే పంచాదశమ శ్లోకః (15వ శ్లోకం), ఏకాదశసర్గే ద్వితీయశ్లోకః, చతుర్థసర్గే అష్టమ శ్లోకః. ప్రథమసర్గే పంచనవతితమః శ్లోకః (95వ శ్లోకం) ॥

తాత్పర్యమ్
ప్రతి సాయంత్రమూ, ఉదయమూ వేదానుసారంగా గార్హపత్యము, ఆహవనీయము, దక్షిణము అని పేర్లు గల మూడు అగ్నులలో (త్రేతాగ్నులలో) సమిధలు వ్రేల్చి హోమం చేసేవారూ, కోరిన వస్తువులను ఇచ్చి అర్థించినవారిని సత్కరించేవారూ, (దోషుల) నేరాలకు న్యాయమైన దండనలను విధించేవారూ, బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర మేల్కొనేవారూ (అయిన రఘువంశీయుల యొక్క…).

No comments:

Post a Comment