Friday, March 9, 2018

రఘువంశమ్-1.13


శ్లోకః
వ్యూఢోరస్కో వృషస్కన్ధః శాలప్రాంశుర్మహాభుజః ।
ఆత్మకర్మక్షమం దేహం క్షాత్రో ధర్మ ఇవాశ్రితః 1.13

పదవిభాగః
వ్యూఢ-ఉరస్కః వృష-స్కన్ధః శాల-ప్రాంశుః మహా-భుజః । ఆత్మ-కర్మ-క్షమం దేహం క్షాత్రః ధర్మ ఇవ ఆశ్రితః

అన్వయః
(కథం భూతః దిలీపః?) వ్యూఢోరస్కః, వృషస్కన్ధః, శాలప్రాంశుః, మహాభుజః. (అస్మాద్ ఏవ) ఆత్మకర్మక్షమం దేహమ్ ఆశ్రితః క్షాత్రః ధర్మ ఇవ స్థితః1.13

వాచ్యపరివర్తనమ్
వ్యూఢోరస్కేన వృషస్కన్ధేన శాలప్రాంశునా మహాభుజేన ఆత్మకర్మక్షమం దేహమ్ ఆశ్రితేన (తేన) క్షాత్రేణ ధర్మేణ ఇవ స్థితమ్

సరలార్థః
తస్య నృపస్య శరీరోత్కర్షః లోకోత్తరః ఆసీత్. సః సర్వజగద్రక్షణక్షమాం మానుషీం తనుం పరిగృహ్య అవస్థితః ప్రత్యక్షం క్షత్రియధర్మ ఇవ దిదీపే. వీరధర్మ ఏవాయం దిలీపస్య రూపం కృత్వా వర్తతే ఇతి భావః

తాత్పర్యమ్
(ఆ దిలీపుడు) వెడల్పైన ఱొమ్ముగలవాడు, ఎద్దు మూపులవంటి బలిష్ఠమైన భుజములను కలిగిఉన్నవాడు, పొడవైన చేతులు ఉన్నవాడు, మద్దిచెట్టువలె ఎత్తుగా ఉన్నవాడు. తన పనులకు తగిన దేహాన్ని ఆశ్రయించిన క్షాత్రధర్మం వలె (మూర్తీభవించిన క్షాత్రధర్మం వలె) ఉండేవాడు.

No comments:

Post a Comment