శ్లోకః
రఘూణామన్వయం వక్ష్యే తనువాగ్విభవోఽపి సన్ ।
తద్గుణైః కర్ణమాగత్య చాపలాయ ప్రణోదితః ॥1.9॥
పదవిభాగః
రఘూణామ్ అన్వయం వక్ష్యే తను-వాక్-విభవః అపి సన్ । తద్-గుణైః
కర్ణమ్ ఆగత్య చాపలాయ ప్రణోదితః ॥
అన్వయః
తనువాగ్విభవః సన్ అపి తద్గుణైః కర్ణమ్ ఆగత్య చాపలాయ
ప్రణోదితః (అహమ్) సన్ రఘూణాం అన్వయం వక్ష్యే ॥1.9॥
వాచ్యపరివర్తనమ్
తద్-గుణైః కర్ణమ్ ఆగత్య తనువాగ్విభవేన సతా అపి సతా
చాపలాయ ప్రణోదితేన (మయా) రఘూణాం అన్వయః వక్ష్యతే ॥
సరలార్థః
అహమల్పవాణీ-సంపత్తిః సన్ తేషాం రఘూణాం గుణైః కర్ణే
ప్రాప్య ధార్ష్ట్యాయ ప్రేరితః రఘువంశచరిత్రం వక్ష్యే ॥
తాత్పర్యమ్
నా వాక్సంపద చాలా అల్పమైనది. అయినా రఘువంశంలో
జన్మించిన రాజుల గుణముల వినికిడి నాలో చాపల్యాన్ని రేకెత్తించిన కారణాన రఘువంశచరిత్రను
చెప్పబోతున్నాను.
(ఈ శ్లోకం చివరన “ప్రణోదితః” అని ఉన్నది. “ప్రచోదితః” అని పాఠాంతరము.)
అయిదవ శ్లోకం నుంచి తొమ్మిదవ శ్లోకం దాకా కలిపి
చెప్పుకుంటే –
“రఘువంశానికి చెందిన రాజులు ఎలాంటి వాళ్ళు? జన్మతః విశుద్ధవర్తనం కలిగినవారు. ధ్యేయనిష్ఠ గలవారు. సాగరపర్యంత
భూపాలకులు. ఇంద్రుడికి సహాయం చేసేనందుకు స్వర్గందాకా తమ రథాలను పరువులెత్తించిన
వారు.
“నియతపద్ధతిలో హోమాలు చేసిన వారు. మహాదాతలు. న్యాయానుగుణంగా
దోషులను దండించినవారు. ప్రతిరోజూ, కాలాన్ని
అతిక్రమించకుండా తమ కర్తవ్యాలను జాగరూకతతో నిర్వహించిన వారు.
“దానాలు ఇవ్వటం కోసం ధనాన్ని ఆర్జించినవారు. సత్యం
మాట్లాడేందుకే మితంగా సంభాషించినవారు. కీర్తి కోసమే యుద్ధాలలో గెలుపును
కోరుకున్నవారు. సంతానం కోసమే గృహస్థాశ్రమాన్ని స్వీకరించినవారు.
“విద్యాభ్యాసంలో బాల్యాన్ని, కోరికలను తీర్చుకోవటంలో యౌవనాన్ని, వానప్రస్థంలో
వృద్ధాప్యాన్ని గడిపి యోగమార్గంలో తనువును త్యజించినవారు.
“నా వాక్ఛక్తి పరిమితమైనదైనప్పటికీ, వారి సద్గుణాల గురించి (నిత్యం) వింటూ ఉండటం వల్ల నాలో
ఏర్పడిన వాక్చాపల్యం కారణంగా నేను ఈ రఘువంశ కావ్యరచనకు పూనుకున్నాను.”
No comments:
Post a Comment