Monday, March 19, 2018

రఘువంశమ్-1.26

శ్లోకః
దుదోహ గాం స యజ్ఞాయ సస్యాయ మఘవా దివమ్ ।
సంపద్వినిమయేనోభౌ దధతుర్భువనద్వయమ్ ॥1.26

పదవిభాగః
దుదోహ గాం స యజ్ఞాయ సస్యాయ మఘవా దివమ్ । సంపద్-వినిమయేన ఉభౌ దధతుః భువన-ద్వయమ్

అన్వయః
సః యజ్ఞాయ గాం దుదోహ. మఘవా సస్యాయ దివం (దుదోహ). (ఏవమ్) ఉభౌ (ఇంద్రదిలీపౌ) సంపద్వినిమయేన భువనద్వయం దధతుః1.26

వాచ్యపరివర్తనమ్
తేన యజ్ఞాయ గౌః దుదుహే, మఘౌనా సస్యాయ ద్యౌః (దుదుహే) ఉభాభ్యాం సంపద్వినిమయేన భువనద్వయం దధే ॥

సరలార్థః
లోకేశ్వరః దిలీపః వసుధాయాః సముపార్జితైః కరైః ఇంద్రలోకప్రీతిసాధనం యజ్ఞం కృత్వా శచీపతిం సంతోషయామాస. స్వర్గపతిః సహస్రలోచనోపి ప్రీతః సన్ స్వర్గాత్ పాతితైః మేఘసలిలైః వసుధాయాః ధాన్యసమ్పదం సంవర్ధ్య పృథ్వీపతిం సంతోషయామాస ఏవమింద్రదిలీపౌ ఉపకారవినిమయేన మర్త్యం స్వర్గం పాలయామాసతుః ॥

తాత్పర్యమ్
దిలీపుడు యజ్ఞములను చేసేందుకు అతడు భూమిని పితికాడు (ప్రజలనుంచి పన్నులను గ్రహించాడు). (బదులుగా, భూమిపై) పైరుపంటలను వృద్ధి చెందేందుకు ఇంద్రుడు స్వర్గాన్ని పితికాడు (వర్షాన్ని కురిపించాడు). ఈవిధంగా, ఆ ఇరువురు తమ సంపదలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ రెండు లోకాలనూ పరిపాలించారు.
(దిలీపుడి యజ్ఞాల కారణంగా దేవతలు ప్రీతి చెందారు. ప్రత్యుపకారంగా ఇంద్రుడు వానలను కురిపించి సుభిక్షాన్నిచ్చాడు).

No comments:

Post a Comment