శ్లోకః
తత్తద్భూమిపతిః పత్న్యై దర్శయన్ ప్రియదర్శనః ।
అపి లఙ్ఘితమధ్వానం బుబుధే న బుధోపమః ॥1.47॥
పదవిభాగః
తత్ తత్ భూమి-పతిః పత్న్యై దర్శయన్ ప్రియదర్శనః ।
అపి లఙ్ఘితమ్ అధ్వానం బుబుధే న బుధ-ఉపమః ॥
అన్వయః
ప్రియదర్శనః బుధోపమః భూమిపతిః తత్ తత్ పత్న్యై
దర్శయన్ లఙ్ఘితమ్ అపి అధ్వానం న బుబుధే ॥1.47॥
వాచ్యపరివర్తనమ్
ప్రియదర్శనేన బుధోపమేన భూమిపతినా తత్తత్ పత్న్యై దర్శయతాలఙ్ఘితః
అపి అధ్వా న బుబుధే ॥
సరలార్థః
మనోహరమూర్తిః కుశలః స దిలీపః మార్గే తాని తాని
విచిత్రాణి వస్తూని సలీలం పత్న్యై దర్శయన్ తద్గతచిత్తతయా విలఙ్ఘితమపి అధ్వానం న
జ్ఞాతవాన్ ॥
తాత్పర్యమ్
కంటికి ఇంపైనవాడు, బుధుని పోలినవాడు అయిన ఆ రాజు (మార్గంలో తారసిల్లుతున్న) విశేషాలను భార్యకు
చూపిస్తూ తాను దాటిన మార్గాన్ని తెలుసుకోలేదు (ఎంతదూరం ప్రయాణించాడన్నది
గమనించనేలేదు).
(కేశవపంతులవారి వ్యాఖ్యలో బుధోపమః అన్నమాటకు బుధుడు
ఉపమానముగా కలిగినవాడు – అనేక విషయములు తెలిసినవాడు - అని అర్థం చెప్పారు)
No comments:
Post a Comment