Saturday, June 30, 2018

రఘువంశమ్-1.64

శ్లోకః
త్వయైవం చిన్త్యమానస్య గురుణా బ్రహ్మయోనినా
సానుబన్ధాః కథం న స్యుః సమ్పదో మే నిరాపదః ॥1.64

పదవిభాగః
త్వయా ఏవం చిన్త్యమానస్య గురుణా బ్రహ్మ-యోనినా సానుబన్ధాః కథం న స్యుః సమ్పదో మే నిరాపదః ॥

అన్వయః
బ్రహ్మ-యోనినా త్వయా గురుణా ఏవం చిన్త్యమానస్య మే (మమ) సానుబన్ధాః సమ్పదః నిరాపదః కథం న స్యుః? 1.64

వాచ్యపరివర్తనమ్
బ్రహ్మయోనినా త్వయా గురుణా ఏవం చిన్త్యమానస్య మేనిరాపద్భిః సమ్పద్భిః సానుబన్ధాద్భిః కథం న భూయేత?

సరలార్థః
యతః చతుర్ముఖసుతః కులపూజ్యః త్వం మే కల్యాణచిన్తనేనియుక్తోఽసి తర్హి మే సమ్పదః నిరన్తరం నిర్విఘ్నా, కథం న స్యుః

తాత్పర్యమ్
(దిలీపుడు వశిష్ఠుడిని ఇంకా ఈవిధంగా స్తుతిస్తున్నాడు) బ్రహ్మపుత్రుడవైన నీచేత ఈ విధంగా (మేలు కలగాలని) తలంచబడుతూ ఉన్న నాకు ఏ ఆపదలు లేకుండా నిరంతరంగా సంపదలు (కలుగుతూ) ఉండుట కాక మరోలా ఉండదు కదా?”

No comments:

Post a Comment