Showing posts with label परस्पराक्षिसादृश्यम्. Show all posts
Showing posts with label परस्पराक्षिसादृश्यम्. Show all posts

Sunday, June 10, 2018

రఘువంశమ్-1.40

శ్లోకః
పరస్పరాక్షిసాదృశ్యమదూరోజ్ఝితవర్త్మసు ।
మృగద్వన్ద్వేషు పశ్యన్తౌ స్యన్దనాబద్ధదృష్టిషు ॥1.40

పదవిభాగః
పరస్పర-అక్షి-సాదృశ్యమ్ అదూర-ఉజ్ఝిత-వర్త్మసు । మృగ-ద్వన్ద్వేషు పశ్యన్తౌ స్యన్దన-ఆబద్ధ-దృష్టిషు ॥

అన్వయః
(పునః కథం భూతౌ దంపతీ?) అదూరోజ్ఝితవర్త్మసు స్యందనాబద్ధ-దృష్టిషు మృగద్వన్ద్వేషు పరస్పరాక్షి-సాదృశ్యం పశ్యతౌ (జగ్మతుః) 1.40

వాచ్యపరివర్తనమ్
అదూరోజ్ఝితవర్త్మసు స్యన్దనాబద్ధదృష్టిషు మృగద్వన్ద్వేషు పరస్పరాక్షిసాదృశ్యం పశ్యద్భ్యాం (దమ్పతిభ్యాం జగ్మే)

సరలార్థః
తయోః దయాయుక్తం ప్రశాంతం నిర్మలం రూపం విలోక్య భయం త్యక్త్వా హరిణాః హరిణ్యశ్చ స్యన్దనమార్గం త్యక్త్వా నికటే ఏవ స్థితాస్తమ్ అలౌకికం స్యన్దనం లీలయా నిర్నిమేషం విలోకయామాసుః. తస్మిన్ సమయే నృపః మృగీషు సుదక్షిణా-నేత్రతుల్యతాం, సా చ మృగేషు పతినయన-సాదృశ్యం దదర్శ

తాత్పర్యమ్
(అదురూ బెదురూ లేకుండా) రథం వెళ్ళేందుకు సరిపడా జాగాను మాత్రమే వదిలి, బాటకు అతి సమీపంగా నిలుచున్న లేళ్ళ జంటలు ఆ రథాన్ని తదేకంగా చూస్తున్నాయి. వాటిల్లోని మగ లేళ్ళ కళ్ళలో దిలీపుడి కళ్ళ పోలికలను గమనిస్తున్నది సుదక్షిణ. ఆడ లేళ్ళ కళ్ళను చూస్తున్న దిలీపుడు వాటిల్లో సుదక్షిణ నేత్రాల పోలికలను దర్శిస్తున్నాడు.