శ్లోకః
పురన్దరశ్రీః పురముత్పతాకం ప్రవిశ్య పౌరైరభినన్ద్యమానః
।
భుజే భుజఙ్గేన్ద్రసమానసారే భూయః స భూమేర్ధురమాససఞ్జ ॥2.74॥
పదవిభాగః
పురన్దర-శ్రీః
పురమ్ ఉత్-పతాకం ప్రవిశ్య పౌరైః అభినన్ద్యమానః । భుజే భుజఙ్గ-ఇన్ద్ర-సమాన-సారే భూయః స భూమేః
ధురమ్ ఆససఞ్జ ॥
అన్వయః
పురన్దరశ్రీః పౌరైః అభినంద్యమానః సః (నృపః) ఉత్పతాకం
పురం ప్రవిశ్య, భుజఙ్గేన్ద్రసమానసారే భుజే భూమేః ధురం
భూయః ఆససఞ్జ ॥2.74॥
వాచ్యపరివర్తనమ్
పురన్దరశ్రియా పౌరైః అభినన్ద్యమానేన తేన, ఉత్పతాకం పురం ప్రవిశ్య, భుజఙ్గేన్ద్రసమానసారే
భుజే భూమేః ధూః భూయః ఆససఞ్జ ॥
సరలార్థః
శక్రతుల్యలక్ష్మీకః స రాజా ప్రజాభిః ప్రసాదితః
సన్నుచ్ఛ్రిత-ధ్వజం-పురం
ప్రవిశ్య శేషతుల్యబలే భుజే పునరపి పృథివ్యాః ధురం ధృతవాన్ ॥
తాత్పర్యమ్
ఇంద్రుడితో సమానమైన సంపద గల ఆ రాజు పౌరుల
(స్వాగతము) చేత సంతుష్టపరచబడి, జెండాలు ఎగరవేయబడ్డ
నగరంలోనికి ప్రవేశించి, ఆదిశేషుడి బలానికి సమానమైన బలము
గల తన భుజస్కంధాలపై మళ్ళీ తన రాజ్య (భూ) భారాన్ని మోపుకున్నాడు.
[రాజు నగరంలో ఉన్నప్పుడు ఇళ్ళ పై జెండాలు ఎగురవేయడం, నగరం నుంచి బయటకు వెళ్ళినప్పుడు అవనతం చేయడం అప్పటి పద్ధతి
అట.
ఆశ్రమానికి వెళ్ళేముందు రాజ్యభారాన్ని తన మంత్రులకు
అప్పజెప్పాడు – “తేన ధూర్జగతో గుర్వీ సచివేషు
నిచిక్షేపే” (1.34)]
No comments:
Post a Comment