శ్లోకః
శ్రోత్రాభిరామధ్వనినా రథేన స ధర్మపత్నీసహితః
సహిష్ణుః ।
యయావనుద్ఘాతసుఖేన మార్గం స్వేనేవ పూర్ణేన మనోరథేన ॥2.72॥
పదవిభాగః
శ్రోత్ర-అభిరామ-ధ్వనినా రథేన స ధర్మపత్నీ-సహితః సహిష్ణుః । యయౌ అనుద్ఘాత-సుఖేన మార్గం స్వేన ఇవ పూర్ణేన మనోరథేన ॥
అన్వయః
ధర్మపత్నీసహితః సహిష్ణుః సః (భూమిపః) శ్రోత్రాభిరామధ్వనినా
అనుద్ఘాతసుఖేన రథేన స్వేన పూర్ణేన మనోరథేన ఇవ, మార్గం యయౌ ॥2.72॥
వాచ్యపరివర్తనమ్
ధర్మపత్నీసహితేన సహిష్ణునా తేన
శ్రోత్రాభిరామధ్వనినా అనుద్ఘాతసుఖేన రథేన స్వేన పూర్ణేన మనోరథేన ఇవ, మార్గః యయే ॥
సరలార్థః
వ్రతాదికష్టసహనశీలః స నృపః సుదక్షిణాసహితః
శ్రవణసుఖకరశబ్దేన పాషాణకణ్టకాదిప్రతిఘాతరహితేన ఆనన్దదాయకేన రథేన మార్గమ్ అలఙ్ఘయత్
మన్యే అసౌ స్వమేవ పూర్ణమ్ అవ్యాహతం మనోరథమ్ ఆరుహ్య యయౌ ॥
తాత్పర్యమ్
సహనశీలి అయిన ఆ రాజు ధర్మపత్నితో కలిసి, చెవులకింపుగా శబ్దం చేస్తూ కుదుపులు లేకుండా సుఖముగా ఉన్న
రథములో –
ఈడేరిన తన మనోరథముపై వెళుతున్నాడా అన్నట్లు - (తన) దారిలో
సాగిపోయాడు.
[వసిష్ఠుడి ఆశ్రమానికి వచ్చేప్పుడు ఆ రథం “స్నిగ్ధగంభీరనిర్ఘోషం” (శ్లో. 1.36). తిరిగివెళ్ళేప్పుడు “శ్రోత్రాభిరామం”. మనోరథసాఫల్యసూచనను గమనించవచ్చును, ఇక్కడ]
No comments:
Post a Comment