శ్లోకః
ప్రియానురాగస్య మనః సమున్నతేర్భుజార్జితానాం చ దిగన్తసంపదామ్
।
యథాక్రమం పుంసవనాదికాః క్రియా ధృతేశ్చ ధీరః సదృశీర్వ్యధత్త
సః ॥3.10॥
పదవిభాగః
ప్రియా-అనురాగస్య
మనః సమున్నతేః భుజ-అర్జితానాం చ దిగన్త-సంపదామ్ । యథా-క్రమం పుం-సవన-ఆదికాః క్రియా ధృతేశ్చ ధీరః సదృశీః వ్యధత్త సః ॥
అన్వయః
ధీరః సః (ప్రజేశ్వరః) ప్రియానురాగస్య మనః సమున్నతేర్భుజార్జితానాం దిగన్తసంపదాం చ, ధృతేః చ సదృశీః యథా-క్రమమ్ పుంసవనాదికాః క్రియాః వ్యధత్త ॥3.10॥
వాచ్యపరివర్తనమ్
ధీరేణ తేన ప్రియానురాగస్య, మనఃసమున్నతేః, భుజార్జితానాం
దిగన్తసంపదాం, ధృతేః చ సదృశ్యః యథాక్రమం పుంసవనాదికాః
క్రియాః వ్యధీయన్త ॥
సరలార్థః
సుదక్షిణాయాం యావాన్ ప్రేమా మనసః యావత్ ఔదార్యం
సంసారవిజయప్రాప్తానామ్ ఐశ్వర్యాణాం యావాన్ ప్రభావః చిరాత్ సుతదర్శనతృష్ణయా చ యావతీ
ఆనన్దప్రాప్తిః తావతా ఏవ విభవేన దిలీపః తస్యాః పుంసవనాదికాన్ గర్భసంస్కారాన్ చకార ॥
తాత్పర్యమ్
భార్యయెడల తనకు గల అనురాగానికీ, తన ఉదారహృదయానికి, అన్నిదిక్కుల
అంచులనుంచి కూడా తన భుజబలముతో సాధించిన సంపదలకు కూడా తగిన విధంగా పుంసవనము మొదలైన
గర్భసంస్కారములను ధీరుడైన ఆ రాజు జరిపించాడు.
[కేశవపంతులవారి వ్యాఖ్య నుంచి: గర్భము దాల్చిన రెండవనెలలో
పుంసవనము,
నాలుగవ నెలలో అనవలోభనము, ఆరవ నెలలో
సీమంతోన్నయనము మొదలుగా చేసే చతుర్వింశతి (24) సంస్కారాలు గర్భసంస్కారాలు.]
No comments:
Post a Comment