Sunday, August 5, 2018

రఘువంశమ్-2.24


శ్లోకః
తామన్తికన్యస్తబలిప్రదీపామన్వాస్య గోప్తా గృహిణీసహాయః ।
క్రమేణ సుప్తామనుసంవివేశ సుప్తోత్థితాం ప్రాతరనూదతిష్ఠత్ ॥2.24

పదవిభాగః
తామ్ అన్తిక-న్యస్త-బలి-ప్రదీపామ్ అన్వాస్య గోప్తా గృహిణీ-సహాయః । క్రమేణ సుప్తామ్ అను సంవివేశ సుప్త-ఉత్థితాం ప్రాతః అను-ఉదతిష్ఠత్ ॥

అన్వయః
గోప్తా (దిలీపః) గృహిణీసహాయః (సన్) అంతికన్యస్తబలిప్రదీపాం తాం (ధేనుం) అన్వాస్య క్రమేణ సుప్తామ్ అను సంవివేశ, ప్రాతః సుప్తోత్థితాం అను ఉదతిష్ఠత్ 2.24

వాచ్యపరివర్తనమ్
గోప్త్రా గృహిణీసహాయేన (సతా) అంతికన్యస్తబలిప్రదీపాం తాం అన్వాస్య క్రమేణ సుప్తామ్ అను సంవివిశే, ప్రాతః సుప్తోత్థితామ్ అను ఉదస్థీయత

సరలార్థః
తస్యాః నికటే అర్చాసామగ్రీం నిధాయ స్థితాయాః తస్యాః పృష్ఠతః సుదక్షిణాదిలీపౌ స్థితవన్తౌ క్రమేణ నిద్రాయుక్తాయాం తస్యాం తావపి నిద్రాంప్రాప్తవన్తౌ ప్రాతఃకాలే సుప్తోత్థితాయాం తస్యాం తావపి ఉదతిష్ఠతామ్

తాత్పర్యమ్
ఆ రక్షకుడు (రాజు) భార్యాసమేతుడై దీపము మొదలైన పూజాద్రవ్యాలను సమీపములోనే ఉంచుకొని ఆ ఆవు దగ్గరే కూర్చొని ఆ గోవు నిదురించిన తరువాత తానూ నిదురించి, తనతోబాటే మేల్కొన్నాడు.

No comments:

Post a Comment