Thursday, August 30, 2018

రఘువంశమ్-3.66


శ్లోకః
యథా వృత్తాన్తమిమం సదోగతస్త్రిలోచనైకాంశతయా దురాసదః
తవైవ సన్దేశహరాద్విశాంపతిః శృణోతి లోకేశ తథా విధీయతామ్3.66

పదవిభాగః
యథా వృత్తాన్తమ్ ఇమం సదః-గతః త్రిలోచన-ఏక-అంశతయా దురాసదః తవ ఏవ సన్దేశహరాత్ విశాంపతిః శృణోతి లోకేశ తథా విధీయతామ్

అన్వయః
సదోతః త్రిలోచనైకాంశతయా దురాసదః విశాంపతిః (దిలీపః) యథా తవ ఏవ సన్దేశహరాత్ ఇమం వృత్తాన్తం శృణోతి, లోకేశ(త్వయా) తథా విధీయతామ్ 3.66

వాచ్యపరివర్తనం
సదోగతేన త్రిలోచనైకాంశతయా దురాసదేన విశాంపత్యా యథా తవ ఏవ సన్దేశహరాత్ అయం వృత్తాన్తః శ్రూయతే, హే లోకేశ, త్వం తథా విధేహి

సరలార్థః
పితా మే దిలీపః యజ్ఞదీక్షితతయా అష్టమూర్తేః శివస్య యజమానమూర్తిరూపేణ స్థితిం కరోతి, అధునా తత్సమీపే అన్యః కోఽపి గన్తుం శక్నోతి, అతః తవైవ చరో గత్వా మమ పిత్రే సర్వమిమం చరిత్రం కథయతు ఇతి మే త్వయి విజ్ఞప్తిః

తాత్పర్యమ్
(రఘువు ఇంద్రుడితో) “దిలీపుడు యాగసభలో (లేక రాజసభలో) ఉన్నవాడు, మూడు కన్నుల దేవుడైన శివుడి అంశ అయినందున సమీపించుటకు వీలు కాని వాడు. అందుచేత నీయొక్క దూతతో ఈ సమాచారాన్ని ఆయన చెవిన వేయవలసినది.”
[కేశవపంతుల వారి వ్యాఖ్య నుంచి: “భూతార్కచన్ద్రయజ్వానో మూర్తయోష్టౌ ప్రకీర్తితాః” – పృథివి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, యజ్వ (యాగదీక్షితుడు); ఇవి శివుని అష్టమూర్తులు, ఇందులో దిలీపుడు యజ్వ కనుక త్రిలోచనుని యొక అంశగా చెప్పబడెనని గ్రహింపవలయును.”]

No comments:

Post a Comment