శ్లోకః
ప్రత్యబ్రవీచ్చైనమిషుప్రయోగే తత్పూర్వభఙ్గే
వితథప్రయత్నః ।
జడీకృతః త్ర్యమ్బకవీక్షణేన వజ్రం ముముక్షన్నివ
వజ్రపాణిః ॥2.42॥
పదవిభాగః
ప్రత్యబ్రవీత్ చ ఏనమ్ ఇషు-ప్రయోగే తత్-పూర్వ-భఙ్గే
వితథ-ప్రయత్నః । జడీకృతః త్ర్యమ్బక-వీక్షణేన
వజ్రం ముముక్షన్ ఇవ వజ్ర-పాణిః ॥
అన్వయః
తత్పూర్వభఙ్గే ఇషుప్రయోగే వితథప్రయత్నః (సః రాజా)
ఏనం ప్రత్యబ్రవీత్ చ, త్ర్యంబకవీక్షణేన జడీకృతః వజ్రం
ముముక్షన్ వజ్రపాణిః ఇవ (రాజా తస్థౌ) ॥2.42॥
వాచ్యపరివర్తనమ్
తత్పూర్వభఙ్గే ఇషుప్రయోగే వితథప్రయత్నేన (తేన
రాజ్ఞా) ఏషః ప్రత్యౌచ్యత, త్ర్యమ్బకవీక్షణేన జడీకృతేన వజ్రం
ముముక్షతా వజ్రపాణినా ఇవ (రాజ్ఞా) (తస్థే) ॥
సరలార్థః
తత్-ప్రథమభఙ్గే
శరప్రయోగే విఫలప్రయాసః త్రినేత్రవీక్షణేన నిష్పన్దీకృతః శక్ర ఇవ స్థితః నృపః ఏనం సింహం
ప్రత్యబ్రవీత్ చ ॥
తాత్పర్యమ్
తొలిసారిగా బాణప్రయోగంలో విఫలము చెందిన వాడు (అయిన దిలీపుడు), వజ్రాయుధమును
విడవబోయి (ప్రయోగించబోయి) ముక్కంటి చూపు చేత కట్టడి చేయబడిన ఇంద్రుడి వలె (ఉన్న వాడై) ఆ సింహముతో ఇలా బదులు పలికాడు.
[ఇంద్రుడు తన తోవకి దిగంబరరూపంలో అడ్డువచ్చి తొలగని శివునిపై
వజ్రాయుధాన్ని ప్రయోగించబోగా, శివుడు తన కంటిచూపుతో
అతడిని స్తంభింపజేసాడని శివపురాణకథ].
No comments:
Post a Comment