Showing posts with label దిలీపుడికి పరీక్ష. Show all posts
Showing posts with label దిలీపుడికి పరీక్ష. Show all posts

Thursday, August 23, 2018

రఘువంశమ్-2.69


శ్లోకః
స నన్దినీస్తన్యమనిన్దితాత్మా సద్వత్సలో వత్సహుతావశేషం ।
పపౌ వసిష్ఠేన కృతాభ్యనుజ్ఞః శుభ్రం యశో మూర్తమివాతితృష్ణః ॥2.69

పదవిభాగః
స నన్దినీ-స్తన్యమ్ అనిన్దిత-ఆత్మా సత్-వత్సలః వత్స-హుత-అవశేషం । పపౌ వసిష్ఠేన కృత-అభ్యనుజ్ఞః శుభ్రం యశః మూర్తమ్ ఇవ అతి-తృష్ణః ॥

అన్వయః
అనిన్దితాత్మా సద్వత్సలః సః (భూపతిః) వసిష్ఠేన కృతాభ్యనుజ్ఞః అతితృష్ణః (ఇవ) వత్సహుతావశేషమ్, నన్దినీస్తన్యం మూర్తిం శుభ్రం యశ ఇవ పపౌ 2.69

వాచ్యపరివర్తనమ్
అనిన్దితాత్మనా సద్వత్సలేన తేన వసిష్ఠేన కృతాభ్యనుజ్ఞేన అతితృష్ణేన (ఇవ) వత్సహుతావశేషం నన్దినీస్తన్యం మూర్తం శుభ్రం యశః ఇవ పపే

సరలార్థః
ప్రశంసితాత్మా సాధువత్సలః నృపః వసిష్ఠస్య ఆజ్ఞామ్ అవాప్య వత్సపానస్య హవనస్య చ అవశిష్టం ధేనోః దుగ్ధం మూర్తిమత్ శుభ్రం యశ ఇవ అతితృష్ణః సన్పపౌ

తాత్పర్యమ్
దోషరహితుడు, సజ్జనుల పట్ల వాత్సల్యాన్ని కలిగియున్నవాడు అయిన అతడు, దూడకు, హోమక్రియల కొరకు వినియోగించబడ్డాక మిగిలిన నందిని పాలను, వసిష్ఠుడి అనుమతితో, ఎంతో దాహము గొన్నవాడివలె తాగాడు. రూపుగట్టిన నిర్మలమైన కీర్తివలె ఉన్నవట ఆ పాలు.

రఘువంశమ్-2.68

శ్లోకః
తస్యాః ప్రసన్నేన్దుముఖః ప్రసాదం గురుర్నృపాణాం గురవే నివేద్య ।
ప్రహర్షచిహ్నానుమితం ప్రియాయై శశంస వాచా పునరుక్తయేవ ॥2.68

పదవిభాగః
తస్యాః ప్రసన్న-ఇన్దు-ముఖః ప్రసాదం గురుః నృపాణాం గురవే నివేద్య । ప్రహర్ష-చిహ్న-అనుమితం ప్రియాయై శశంస వాచా పునః-ఉక్తయా ఏవ ॥

అన్వయః
ప్రసన్నేన్దుముఖః నృపాణాం గురుః (దిలీపః) ప్రహర్షచిహ్నానుమితం తస్యాః ప్రసాదం పునరుక్తయా ఇవ వాచా గురవే నివేద్య ప్రియాయై శశంస 2.68

వాచ్యపరివర్తనమ్
ప్రసన్నేన్దుముఖేన నృపాణాం గురుణా ప్రహర్షచిహ్నానుమితం తస్యాః ప్రసాదం పునరుక్త్యా ఇవ వాచా గురవే నివేద్య, ప్రియాయై శశంసే

సరలార్థః
ప్రసన్నచన్ద్రాననః మహీపతీనాం గురుః దిలీపః యదా గురుసమీపమమ్ ఆగతః తదా వసిష్ఠేన ముఖరాగాదిభిః తస్యాః ధేనోః వరమ్ అనుగ్రహం జ్ఞాతం పశ్చాత్ రాజా గురవే విజ్ఞాప్య సుదక్షిణాయై వృత్తం కథితవాన్

తాత్పర్యమ్
నిర్మలమైన చంద్రునివంటి ముఖము గలవాడు, రాజులలోకెల్లా మేటియైనవాడూ అయిన దిలీపుడు నందినియొక్క అనుగ్రహమును గురించి గురువుగారికి నివేదించాడు. సంతోష చిహ్నాలతో చెప్పేసిన సంగతినే మళ్ళీ మాటలతో చెప్పుతూ ఉంటే, పునరుక్తియా అని అనిపించిందట. ఆ తరువాత తన భార్యకు ఆ శుభవర్తమానాన్ని తెలియజేసాడు.

రఘువంశమ్-2.67

శ్లోకః
ఇత్థం క్షితీశేన వసిష్ఠధేనుర్విజ్ఞాపితా ప్రీతతరా బభూవ
తదన్వితా హైమవతాచ్చ కుక్షేః ప్రత్యాయయావాశ్రమమశ్రమేణ ॥2.67

పదవిభాగః
ఇత్థం క్షితి-ఈశేన వసిష్ఠ-ధేనుః విజ్ఞాపితా ప్రీతతరా బభూవ । తత్ అన్వితా హైమవతాః చ కుక్షేః ప్రత్యాయయౌ ఆశ్రమమ్ అశ్రమేణ ॥

అన్వయః
క్షితీశేన ఇత్థం విజ్ఞాపితా వసిష్ఠధేనుః ప్రీతతరా బభూవ, తదఅన్వితా (సతీ) హైమవతాత్ కుక్షేః అశ్రమేణ ఆశ్రమం చ ప్రత్యాయయౌ 2.67

వాచ్యపరివర్తనమ్
క్షితీశేన ఇత్థం విజ్ఞాపితయా వసిష్ఠధేన్వా ప్రీతతరా బభూవే, తదన్వితయా (సత్యా) హైమవతాత్ కుక్షేః అశ్రమేణ ఆశ్రమం చ ప్రత్యాయయే

సరలార్థః
ఏవం దిలీపేన ప్రార్థితా వసిష్ఠస్య గౌః భృశం సంతుష్టా బభూవ, పశ్చాత్ తేన చ అనుగమ్యమానా నగేన్ద్రకన్ధరాత్ (సుఖేన) ఆశ్రమమ్ ఆజగామ

తాత్పర్యమ్
ఈ విధంగా రాజు చేత అర్థించబడిన నందిని ఇంకా ప్రీతి చెందింది. ఆ తరువాత ధేనువు (నందిని) వెంట నడుస్తూ ఉండగా, (దాని ముందు దిలీపుడు నడుస్తూ), హిమాలయపర్వతగుహనుంచి శ్రమ లేకుండా ఆశ్రమానికి తిరిగి వచ్చారు.

రఘువంశమ్-2.66


శ్లోకః
వత్సస్య హోమార్థవిధేశ్చ శేషమృషేరనుజ్ఞామధిగమ్య మాతః ।
ఔధస్యమిచ్ఛామి తవోపభోక్తుం షష్టాంశముర్వ్యా ఇవ రక్షతాయాః ॥2.66

పదవిభాగః
వత్సస్య హోమ-అర్థ-విధేః చ శేషమ్ ఋషేః అనుజ్ఞామ్ అధిగమ్య మాతః । ఔధస్యమ్ ఇచ్ఛామి తవ ఉపభోక్తుం షష్టాంశమ్ ఉర్వ్యా ఇవ రక్షతాయాః ॥

అన్వయః
మాతః! వత్సస్య, హోమార్థవిధేః చ, శేషం తవ ఔధస్యం ఋషేః అనుజ్ఞామ్ అధిగమ్య, రక్షితాయాః ఉర్వ్యాః షష్ఠాంశమ్ ఇవ, ఉపభోక్తుం ఇచ్ఛామి 2.66

వాచ్యపరివర్తనమ్
(మయా) వత్సస్య, హోమార్థవిధేః శేషం తవ ఔధస్యం ఋషేః అనుజ్ఞామ్ అధిగమ్య, రక్షితాయాః ఉర్వ్యాః షష్ఠాంశమ్ ఇవ ఉపభోక్తుం ఇష్యతే

సరలార్థః
తదా నృపః కథయతి-హే మాతః! వత్సపానస్య శేషభూతమ్ అగ్నిహోత్రావశిష్టం చ తవ పయః పృథివ్యాః షష్ఠభాగమివ గురోః ఆజ్ఞాం ప్రాప్య పాతుమ్ ఇచ్ఛామి

తాత్పర్యమ్
రాజు నందినితో ఇలా అన్నాడు, “అమ్మా! నీ దూడకు, హోమవిధులకు కాగా మిగిలిన నీ పాలను ఋషి అనుమతితో - రాజు పంటలో ఆరవ భాగాన్ని పన్నుగా గ్రహించినట్లు - స్వీకరించదలిచాను.

రఘువంశమ్-2.65


శ్లోకః
సన్తానకామాయ తథేతి కామం రాజ్ఞే ప్రతిశ్రుత్య పయస్వినీ సా
దుగ్ధ్వాపయః పత్రపుటే మదీయం పుత్రోపభుఙ్క్ష్వేతి తమాదిదేశ ॥2.65

పదవిభాగః
సన్తాన-కామాయ తథా ఇతి కామం రాజ్ఞే ప్రతిశ్రుత్య పయస్వినీ సా । దుగ్ధ్వా-పయః పత్ర-పుటే మదీయం పుత్రన్ ఉపభుఙ్క్ష్వ ఇతి తమ్ ఆదిదేశ ॥

అన్వయః
సా పయస్వినీ (గౌః) సన్తానకామాయ రాజ్ఞే కామం తథా ఇతి ప్రతిశ్రుత్య, “హే పుత్ర, మదీయం పయః పత్రపుటే దుగ్ధ్వా (త్వమ్) ఉపభుఙ్క్ష్వ”, ఇతి తం దిలీప ఆదిదేశ 2.65

వాచ్యపరివర్తనమ్
తయా పయస్విన్యా సన్తానకామాయ రాజ్ఞే కామం తథాఇతి ప్రతిశ్రుత్య, “హేపుత్ర, మదీయం పయః పత్రపుటే దుగ్ధ్వా, (త్వయా) ఉపభుంజ్యతామ్, ఇతి (తయా) సః ఆదిదిశే

సరలార్థః
సా నన్దినీ పుత్రకామాయ తస్మై దిలీపాయ తథాస్త్వితి తం ప్రతిజ్ఞాయ, “హే వత్స! మదీయం దుగ్ధం పలాశనిర్మితే పాత్రే దుగ్ధ్వా పిబఇతి ఆదిదేశ

తాత్పర్యమ్
ఆ ఆవు సంతానార్థియైన ఆ రాజుకు తథాస్తుఅని చెప్పి కోరికను తప్పక నెరవేరుస్తానని మాట ఇచ్చి, “నాయనా, ఒక ఆకు దొప్పలో నా పాలను పిండుకొని తాగుము.అని ఆదేశించింది.

Wednesday, August 22, 2018

రఘువంశమ్-2.64

శ్లోకః
తతః సమానీయ స మానితార్థీ హస్తౌ స్వహస్తార్జితవీరశబ్దః ।
వంశస్య కర్తారమనన్తకీర్తిం సుదక్షిణాయాం తనయం యయాచే ॥2.64

పదవిభాగః
తతః సమానీయ స మానిత-అర్థీ హస్తౌ స్వ-హస్త-అర్జిత-వీర-శబ్దః । వంశస్య కర్తారమ్ అనన్త-కీర్తిం సుదక్షిణాయాం తనయం యయాచే ॥

అన్వయః
తతః మానితార్థీ స్వహస్తఅర్జితవీరశబ్దః సః (భూవల్లభః) హస్తౌ సమానీయ వంశస్య కర్తారమ్ అనన్తకీర్తిం తనయం సుదక్షిణాయాం యయాచే 2.64

వాచ్యపరివర్తనమ్
తతః మానితార్థినా స్వహస్తార్జితవీరశబ్దేన తేన, హస్తౌ సమానీయ వంశస్యకర్తా అనన్తకీర్తిః తనయః సుదక్షిణాయాం యయాచే

సరలార్థః
తతః సమ్మానితయాచకః స్వభుజార్జితవీరశబ్దః దిలీపః అఞ్జలిం బద్ధ్వా కులప్రవర్తయితారం అనన్తకీర్తిమన్తం పుత్రం సుదక్షిణాయాం యయాచే

తాత్పర్యమ్
అప్పుడు, యాచకులను ఆదరించిన వాడు, తన భుజబలముతో వీరుడన్న పేరును సంపాదించుకున్న వాడూ అయిన ఆ దిలీపుడు చేతులను జోడించి అంతులేని కీర్తిని కలవాడూ, వంశకర్త కాగలవాడూ అయిన కొడుకు సుదక్షిణాదేవియందు కలగాలిఅని యాచించాడు.

రఘువంశమ్-2.63


శ్లోకః
భక్త్యా గురౌ మయ్యనుకమ్పయా చ ప్రీతాస్మి తే పుత్ర వరం వృణీష్వ ।
న కేవలానాం పయసాం ప్రసూతిమవేహి మాం కామదుఘాం ప్రసన్నామ్ ॥2.63

పదవిభాగః
భక్త్యా గురౌ మయి అనుకమ్పయా చ ప్రీతాస్మి తే పుత్ర వరం వృణీష్వ । న కేవలానాం పయసాం ప్రసూతిమ్ అవేహి మాం కామ-దుఘాం ప్రసన్నామ్ ॥

అన్వయః
పుత్ర, గురౌ భక్త్యా, మయి అనుకమ్పయా చ, (అహం) తే ప్రీతా అస్మి, (త్వం) వరం వృణీష్వ, (త్వం) మాం కేవలానాం పయసాం ప్రసూతిం న అవేహి, (కిం తు) ప్రసన్నాం (మాం) కామ-దుఘాం (అవేహి) 2.63

వాచ్యపరివర్తనమ్
హే పుత్ర! గురౌ భక్త్యా, మయి అనుకమ్పయా చ, (మయా) తే ప్రీతయా భూయతే, (త్వయా) వరః వ్రియతాం (త్వయా) అహం కేవలానాం పయసాం ప్రసూతిః న అవేయై, (కిన్తు) ప్రసన్నా (అహం) కామదుఘా అవేయై

సరలార్థః
వత్స! గురౌ భక్త్యా, మయి దయయా చ తుభ్యం ప్రసన్నాస్మి దేవేభ్యో వరణీయమ్ అర్థే స్వీకురు, మాం కేవలానాం దుగ్ధానాం దాత్రీం న విద్ధి, కిన్తు యదా ప్రసన్నా భవామి తదా మనోభిలషితమర్థం దదామి

తాత్పర్యమ్‍
పుత్రా, (నీ) గురుభక్తిచేత, నా యెడల (నీకున్న) దయ చేత ప్రీతి చెందాను. వరము కోరుకొనుము. నేను కేవలము పాలనిచ్చే ఆవును మాత్రమే కాదు, కోరికలను తీర్చగల కామధేనువునని గుర్తెరుగుము.” (అని చెప్పింది నందిని).

రఘువంశమ్-2.62


శ్లోకః
తం విస్మితం ధేనురువాచ సాధో మాయాం మయోద్భావ్య పరీక్షితోఽసి ।
ఋషిప్రభావాన్మయి నాన్తకోఽపి ప్రభుః ప్రహర్తుం కిముతాన్యహింస్రాః ॥2.62

పదవిభాగః
తం విస్మితం ధేనుః ఉవాచ సాధో మాయాం మయా ఉద్భావ్య పరీక్షితః అసి । ఋషి-ప్రభావాత్ మయి న అన్తకః అపి ప్రభుః ప్రహర్తుం కిమ్ ఉత అన్య-హింస్రాః ॥

అన్వయః
ధేనుః విస్మితం తమ్ ఉవాచ, “సాధో! మయా మాయామ్ ఉద్భావ్య (త్వం) పరీక్షితః అసి, ఋషిప్రభావాత్ మయి అన్తకః అపి ప్రహర్తుం ప్రభుః న (అస్తి) ఉత అన్యహింస్రాః కిమ్ (స్యుః) 2.62

వాచ్యపరివర్తనమ్
ధేన్వా విస్మితః సః ఊచే, “హే సాధో! అహం త్వాం పరీక్షితవతీ. ఋషిప్రభావాత్ మయి ప్రహర్తుం అన్తకేనాపి ప్రభుణా న భూయతే

సరలార్థః
నన్దినీ ఆశ్చర్యాన్వితం నృపమువాచ, “సాధో! మయా మాయాముద్ఘాట్య త్వం పరీక్షితోఽసి వసిష్ఠప్రతాపాత్ మయి కాలోపి ప్రహర్తుం న సమర్థః అన్యే హింసకాః జీవాః కిముత

తాత్పర్యమ్
ఆశ్చర్యపోతున్న దిలీపుడితో నందిని ఇలా అన్నది, “ఓ సజ్జనుడా, మాయను కల్పించి నేను నిన్ను పరీక్షించాను. వసిష్ఠుడి తపఃప్రభావాన నన్ను యముడు సైతము ఏమీ చేయజాలడు. ఇతరములైన క్రూరమృగములను గురించి వేరే చెప్పాలా?”

రఘువంశమ్-2.61


శ్లోకః
ఉత్తిష్ఠ వత్సేత్యమృతాయమానం వచో నిశమ్యోత్థితముత్థితః సన్ ।
దదర్శ రాజా జననీమివ స్వాం గామగ్రతః ప్రస్రవినీం న సింహమ్ ॥2.61

పదవిభాగః
ఉత్తిష్ఠ వత్స ఇతి అమృతాయమానం వచో నిశమ్య-ఉత్థితమ్ ఉత్థితః సన్ । దదర్శ రాజా జననీమ్ ఇవ స్వాం గామ్ అగ్రతః ప్రస్రవినీం న సింహమ్ ॥

అన్వయః
“(హే) వత్స! ఉత్తిష్ఠ ఇతి అమృతాయమానమ్ ఉత్థితం వచః నిశమ్య, ఉత్థితః (సన్) రాజా అగ్రతః స్వాం జననీమ్ ఇవ ప్రస్రవినీం గాం దదర్శ, సింహమ్ న (దదర్శ) 2.61

వాచ్యపరివర్తనమ్
హే వత్స! ఉత్తిష్ఠ ఇతి అమృతాయమానమ్ ఉత్థితం వచః నిశమ్య, ఉత్థితేన (సతా) రాజ్ఞా అగ్రతః స్వా జననీ ఇవ, ప్రస్రవినీ గౌః దదృశే, సింహః న (దదృశే)

సరలార్థః
హే పుత్ర ఉత్తిష్ఠ, ఇత్యమృతరసపూర్ణవచో నిశమ్య రాజా దిలీపః యదా ఉత్థితః సన్, పశ్యతి తతః అగ్రే స్వాం మాతరమివ కామదుఘాం దదర్శ, సింహం న దదర్శ

తాత్పర్యమ్
నాయనా, లెమ్ముఅని వెలువడిన అమృతమువంటి పలుకులను విని లేచిన (ఆ) రాజు, తన తల్లివంటిది, పాలను స్రవిస్తూ ఉన్నటువంటిదీ అయిన ఆవును చూసాడు. సింహాన్ని చూడలేదు (అది మాయమైపోయింది).

రఘువంశమ్-2.60


శ్లోకః
తస్మిన్క్షణే పాలయితుః ప్రజానాముత్పశ్యతః సింహనిపాతముగ్రమ్ ।
అవాఙ్ముఖస్యోపరి పుష్పవృష్టిః పపాత విద్యాధరహస్తముక్తా ॥2.60

పదవిభాగః
తస్మిన్ క్షణే పాలయితుః ప్రజానామ్ ఉత్పశ్యతః సింహ-నిపాతమ్ ఉగ్రమ్ । అవాక్-ముఖస్య ఉపరి పుష్ప-వృష్టిః పపాత విద్యాధర-హస్త-ముక్తా ॥

అన్వయః
తస్మిన్ క్షణే ఉగ్రం సింహనిపాతమ్ ఉత్పశ్యతః అవాఙ్ముఖస్య ప్రజానాం పాలయితుః ఉపరి విద్యాధరహస్తముక్తా పుష్పవృష్టిః పపాత 2.60

వాచ్యపరివర్తనమ్
తస్మిన్ క్షణే ఉప సింహనిపాతముత్పశ్యతః అవాఙ్ముఖస్య ప్రజానాం పాలయితుః ఉపరి విద్యాధరహస్తముక్తా పుష్పవృష్ట్యా పేతే

సరలార్థః
తస్మిన్నవసరే తీవ్రం సింహనిపాతముత్ప్రేక్షమాణస్య విచారయతోఽధోముఖస్య ప్రజాపతేః దిలీపస్య ఉపరి విద్యాధరాణాం హస్తైః ముక్తా కుసుమవృష్టిః అపతత్

తాత్పర్యమ్
ఆ క్షణాన, ఉగ్రసింహము తనపై పడనున్నదని మాట్లాడకుండా, ఎదురుచూస్తూ ఉన్న ఆ రాజు పై విద్యాధరుల చేతులనుంచి జారిన పువ్వుల వాన పడింది.

రఘువంశమ్-2.59


శ్లోకః
తథేతి గాముక్తవతే దిలీపః సద్యః ప్రతిష్టమ్భవిముక్తబాహుః ।
స న్యస్తశస్త్రో హరయే స్వదేహముపానయతిన్డమివామిషస్య ॥2.59

పదవిభాగః
తథా ఇతి గామ్ ఉక్తవతే దిలీపః సద్యః ప్రతిష్టమ్భ-విముక్త-బాహుః । స న్యస్త-శస్త్రః హరయే స్వదేహమ్ ఉపానయత్ పిణ్డమ్ ఇవ ఆమిషస్య ॥

అన్వయః
సద్యః ప్రతిష్టమ్భవిముక్తబాహుః సః దిలీపః తథా ఇతి” (తథాస్తు) గాం ఉక్తవతే హరయే న్యస్తశస్త్రః (సన్) ఆమిషస్య పిణ్డమ్ ఇవ స్వదేహమ్ ఉపానయత్ 2.59

వాచ్యపరివర్తనమ్
సద్యః ప్రతిష్టమ్భవిముక్తబాహునా తేన దిలీపేన తథా ఇతిగాం ఉక్తవతే హరయే న్యస్తశస్త్రేణ (సతా) ఆమిషస్య పిణ్డః ఇవ స్వదేహః ఉపానీయత

సరలార్థః
ఏవం భవతు ఇత్యుక్తవతే మృగేంద్రాయ తత్కాలప్రబన్ధాత్ విముక్తభుజో నరేంద్రః ముక్తాయుధః సన్ స్వశరీరం మాంసస్య కవలమివ తస్మై సమర్పితవాన్

తాత్పర్యమ్
అలాగేనని ఆవును విడిచిపెట్టింది సింహము. వెంటనే, దిలీపుడి చేతుల కట్టడి తొలగింది. ఆయుధాన్ని వదిలిపెట్టి అతడు తన శరీరాన్ని ఒక మాంసపు ముద్దలాగా సింహము వద్దకు చేర్చాడు.

రఘువంశమ్-2.58


శ్లోకః
సమ్బన్ధమాభాషణపూర్వమాహుర్వృత్తః స నౌ సఙ్గతయోర్వనాన్తే
తద్భూతనాథానుగ నార్హసి త్వం సమ్బన్ధినో మే ప్రణయం విహన్తుమ్ ॥2.58

పదవిభాగః
సమ్బన్ధమ్ ఆభాషణపూర్వమ్ ఆహుః వృత్తః స నౌ సఙ్గతయోః వనాన్తేతత్ భూత-నాథ-అనుగ న అర్హసి త్వం సమ్బన్ధినః మే ప్రణయం విహన్తుమ్ ॥

అన్వయః
ఆభాషణపూర్వం సమ్బన్ధం (జనాః) ఆహుః, సః (సంబంధః) వనాన్తే సఙ్గతయోః నౌ (ఆవయోః) వృత్తః తత్ (సమ్బన్ధిత్వాత్) భూతనాథానుగ! త్వం మే సమ్బన్ధినః ప్రణయం విహన్తుం న అర్హసి 2.58

వాచ్యపరివర్తనమ్
ఆభాషణపూర్వః సమ్బన్ధః (జనైః) ఉచ్యతే, తేన వనాన్తే సఙ్గతయోః నౌ వృత్తం తత్ హే భూతనాథానుగ, త్వయా మే సమ్బన్ధినః ప్రణయః విహన్తుం న అర్హ్యతే

సరలార్థః
సఖ్యస్య ఆలాపం పూర్వకారణమాహుః స సమ్బన్ధః వనాన్తే ఆవయోర్జాతః, తస్మద్ హే మహాదేవకిఙ్కర, మిత్రస్య మే ప్రార్థనాం వినాశయితుం న యోగ్యః అసి

తాత్పర్యమ్
(దిలీపుడు సింహంతో అన్న మాటలు ఈ శ్లోకంతో ముగుస్తాయి) సంభాషణ సఖ్యతకు కారణమవుతుందని అంటారు. (ఈ) అడవిలో మన ఇద్దరి నడుమ అలాంటి స్నేహం కలిసింది. అందుచేత, ఓ శివానుచరా, నా (ఈ) కోరికను నిరాకరించడము నీకు తగదు.

రఘువంశమ్-2.57


శ్లోకః
కిమప్యహింస్యస్తవ చేన్మతోఽహం యశఃశరీరే భవ మే దయాలుః ।
ఏకాన్తవిధ్వంసిషు మద్విధానాం పిణ్డేష్వనాస్థా ఖలు భౌతికేషు 2.57

పదవిభాగః
కిమ్ అపి అహింస్యః తవ చేత్ మతః అహం యశః-శరీరే భవ మే దయాలుః । ఏక-అన్త-విధ్వంసిషు మత్-విధానాం పిణ్డేషు అనాస్థా ఖలు భౌతికేషు ॥

అన్వయః
కిం అపి అహం చేత్ తవ అహింస్యః మతః (అస్మి) (తర్హి) (త్వం) మే యశఃశరీరే దయాలుః భవ, (కుతః) ఏకాన్విధ్వంసిషు భౌతికేషు పిణ్డేషు ఖలు మద్విధానాం అనాస్థా (భవతి) 2.57

వాచ్యపరివర్తనమ్
కిం అపి మయా చేత్ తవ అహింస్యేన మతేన (భూయతే) (త్వయా) మే యశఃశరీరే దయాలునా భూయతామ్, (కుతః) ఏకాన్తవిధ్వంసిషు భౌతికేషు పిణ్డేషు ఖలు మద్విధానామ్ అనాస్థయా (భూయతే)

సరలార్థః
కేనాపి కారణేన చేత్ తవ దయనీయోహం తర్హి త్వం మే యశఃశరీరే కృపాలుః భవ, హి మాదృశానాం జ్ఞానినాం క్షణవినాశిషు పఞ్చభూతవికారేషు శరీరేషు అపేక్షా న

తాత్పర్యమ్
(దిలీపుడు సింహంతో అంటున్న మాటలు) ఒకవేళ నీకు నేను హింసింపదగనివాడిగా అనిపిస్తే, (ఆ) కరుణను నా కీర్తిశరీరముపై చూపించుము. (ఏదో ఒకనాడు) నశించవలసిన ఈ పాంచభౌతికమైన శరీరములపై మావంటి వారికి ఆసక్తి ఉండదు కదా.

రఘువంశమ్-2.56


శ్లోకః
భవానపీదం పరవానవైతి మహాన్ హి యత్నస్తవ దేవదారౌ ।
స్థాతుం నియోక్తుర్న హి శక్యమగ్రే వినాశ్య రక్ష్యం స్వయమక్షతేన ॥2.56

పదవిభాగః
భవాన్ అపి ఇదమ్ అపీదం పరవాన్ అవైతి మహాన్ హి యత్నః తవ దేవదారౌ । స్థాతుం నియోక్తుః న హి శక్యమ్ అగ్రే వినాశ్య రక్ష్యం స్వయమ్ అక్షతేన ॥

అన్వయః
హి దేవదారౌ తవ మహాన్ యత్నః (అతః) పరవాన్ భవాన్ అపి ఇదమ్ అవైతి (యత్) రక్ష్యం వినాశ్య స్వయం అక్షతేన (సతా) నియోక్తుః అగ్రే స్థాతుం హి న శక్యమ్ 2.56

వాచ్యపరివర్తనమ్
(ఏషః) దేవదారుః తవ మహతా యత్నేన (భూయతే, అతః)పరవతా భవతా అపి అవేయతే . రక్ష్యం వినాశ్య స్వయం అక్షతః (కోఽపి) నియోక్తుః అగ్రే స్థాతుం శక్నోతి

సరలార్థః
కిం బహునా? స్వామిపరతంత్రో భవాన్ అపి ఇదం వక్ష్యమాణ-వచనం జానాతి యస్మాత్తవ దేవదారురక్షణే మహాన్ ప్రయాసః. రక్షణీయం వస్తుం వినాశం ప్రాపయ్య స్వయం అవ్రణేన సేవకేన ప్రభోః అగ్రే స్థితిం కర్తుం శక్యం న హి

తాత్పర్యమ్
(దిలీపుడు సింహముతో చెప్పుతున్న మాటలు) “(శివునికి) పరతంత్రుడవై ఈ దేవదారు వృక్షము (యొక్క రక్షణ) విషయములో ఎంతో గొప్ప శ్రమ చేసావు కనుక నీకు ఈ విషయము బాగా తెలుసును - రక్షించవలసిన వస్తువు నశించిపోయి, తాను పదిలముగా ఉన్న సేవకుడు తనను నియుక్తి చేసిన వాని ఎదుట నిలబడలేడు కదా?”
(ఈ దేవదారు వృక్షానికి ఆపద వాటిల్లితే నీవు శివునిని సన్నిధిలో నిలబడే సాహసం చేయలేనట్లే నేనూ ఈ నందిని గోవుకి జరగకూడనిది జరిగితే, నా గురువు సమక్షంలో నిలువజాలను.)

రఘువంశమ్-2.55


శ్లోకః
సేయం స్వదేహార్పణనిష్క్రయేణ న్యాయ్యా మయా మోచయితుం భవత్తః ।
న పారణా స్యాద్విహతాతవైవం భవేదలుప్తశ్చ మునేః క్రియార్థః ॥2.55

పదవిభాగః
సా ఇయం స్వ-దేహ-అర్పణ-నిష్క్రయేణ న్యాయ్యా మయా మోచయితుం భవత్తః । న పారణా స్యాత్ విహతా తవ ఏవం భవేత్ అలుప్తః చ మునేః క్రియా-అర్థః ॥

అన్వయః
మయా స్వదేహార్పణనిష్క్రయేణ సా ఇయం (గౌ) భవత్తః మోచయితుం న్యాయ్యా అస్తి ఏవమ్ (అమునా ప్రకారేణ) ఇవ తవ పారణా విహతా న స్యాత్, మునేః క్రియార్థః చ అలుప్తః భవేత్ 2.55

వాచ్యపరివర్తనమ్
మయా స్వదేహార్పణనిష్క్రయేణ తయా అనయా (గవా) భవత్తః మోచయితుం న్యాయ్యా (భూయతే). ఏవం తవ పారణాయా విహతయా న భూయేత, మునేః క్రియార్థేన చ అలుప్తేన భూయేత

సరలార్థః
సేయం ధేనుః మయా స్వదేహదానవినిమయేన త్వత్తః మోచయితుం న్యాయ్యా. ఏవం కృతే సతి తవ పారణా విహతా న స్యాద్ వసిష్ఠస్య హోమాదిప్రయోజనం చ అలుప్తం భవేత్

తాత్పర్యమ్
(దిలీపుడు సింహముతో) అట్టి ఈ గోవును నా శరీరమును నీకు అర్పించి నీ నుంచి విడిపించడం సరైనదే. ఆవిధంగా నీ భోజనమునకు భంగము వాటిల్లదు, (అంతే కాక) వసిష్ఠమహర్షి యొక్క హోమాదిక్రియలకు లోపము వాటిల్లదు.