శ్లోకః
స చాపముత్సృజ్య వివృద్ధమత్సరః ప్రణాశనాయ ప్రబలస్య
విద్విషః ।
మహీధ్రపక్షవ్యపరోపణోచితం స్ఫురత్ప్రభామణ్డలమస్త్రమాదదే
॥3.60॥
పదవిభాగః
స చాపమ్ ఉత్సృజ్య వివృద్ధ-మత్సరః ప్రణాశనాయ ప్రబలస్య విద్విషః । మహీధ్ర-పక్ష-వ్యపరోపణ-ఉచితం స్ఫురత్ ప్రభా-మణ్డలమ్
అస్త్రమ్ ఆదదే ॥
అన్వయః
వివృద్ధమత్సరః సః (ఇంద్రః) చాపం ఉత్సృజ్య ప్రబలస్య
విద్విషః ప్రణాశనాయ మహీధ్రపక్షవ్యపరోపణోచితం స్ఫురత్ప్రభామణ్డలమ్ అస్త్రం ఆదదే ॥3.60॥
వాచ్యపరివర్తనమ్
వివృద్ధమత్సరేణ తేన చాపం ఉత్సృజ్య ప్రబలస్య
విద్విషః ప్రణాశనాయ మహీధ్రపక్షవ్యపరోపణోచితం స్ఫురత్ప్రభామణ్డలమ్ అస్త్రం ఆదదే ॥
సరలార్థః
ధనుర్జ్యాఛేదనాత్ ఇంద్రః ప్రదీప్తతరరోషో బభూవ, తత్ ఛిన్నమౌర్వీకం ధనుః త్యక్త్వా తం దుర్జయం శత్రుం
ప్రణాశయితుం జ్వాలామణ్డలభాసురమత్యర్థం వజ్రం జగ్రాహ ॥
తాత్పర్యమ్
మత్సరము ఎక్కువైన అతడు (ఇంద్రుడు) ధనుస్సును
విడిచిపెట్టి, బలమైన శత్రువును (రఘువును)
నశింపజేసేందుకు పర్వతాల రెక్కలను నరుకుటకు తగినదీ, ప్రకాశించే కాంతిమండలము కల్గినదీ అయిన వజ్రాయుధమును అందుకున్నాడు.
No comments:
Post a Comment