Saturday, September 15, 2018

రఘువంశమ్- 4.61


శ్లోకః
యవనీముఖపద్మానాం సేహే మధుమదం న సః
బాలాతపమివాబ్జానామకాలజలదోదయః 4.61

పదవిభాగః
యవనీ-ముఖ-పద్మానాం సేహే మధు-మదం న సః బాల-ఆతపమ్ ఇవ అబ్జానామ్ అకాల-జలద-ఉదయః

అన్వయః
సః (రఘుః) అకాలజలదోదయః అబ్జానాం బాలాతపమ్ ఇవ, యవనీముఖపద్మానాం మధుమదం న సేహే 4.61

వాచ్యపరివర్తనమ్
తేన (రఘుణా) అకాలజలదోదయః అబ్జానాం బాలాతపః ఇవ యవనీముఖపద్మానాం మధుమదః న సేహే

సరలార్థః
యథా అకాలే ఘోరో మేఘాడమ్బరః కమలానాం ప్రఫుల్లామ్ కాన్తిమ్ అపహరతి, తథా అకస్మాత్ ఉపస్థితో రఘురపి తత్ర యవనవధూముఖానాం ప్రఫుల్లాం కాన్తిమ్ అపహృతవాన్

తాత్పర్యమ్
కాలము కాని కాలములో వచ్చిన మబ్బు తామరపూవుల పైని లేత ఎండను ఓర్వలేకపోయినట్లు, రఘువు యవనస్త్రీల ముఖపద్మములపైని మధువు తాలూకు మదమును సహించలేకపోయాడు .
[వానాకాలం తామరపూవులకు అనుకూలమైన కాలం కాదు. కాలం కాని కాలంలో వచ్చే మబ్బు తామరపూల వికాసానికి దోహదం చేసే ఎండను తొలగించి వేస్తుంది. అలాగే, అకాలములోని వాన మబ్బులాగా హఠాత్తుగా  యవనసీమపై దాడి చేసిన రఘువు, యవనులను యుద్ధానికి ఆహ్వానించి, వారి భార్యలకు తమ భర్తలతో కలిసి మధువును సేవించే అవకాశం లేకుండా చేసాడు.]

No comments:

Post a Comment