Monday, September 10, 2018

రఘువంశమ్- 4.41


శ్లోకః
ద్విషాం విషహ్య కాకుత్స్థస్తత్ర నారాచదుర్దినమ్
సన్మఙ్గలస్నాత ఇవ ప్రతిపేదే జయశ్రియమ్4.41॥

పదవిభాగః
ద్విషాం విషహ్య కాకుత్స్థః తత్ర నారాచ-దుర్దినమ్ సత్-మఙ్గల-స్నాత ఇవ ప్రతిపేదే జయ-శ్రియమ్

అన్వయః
తత్ర కాకుత్స్థః ద్విషాం నారాచదుర్దినం విషహ్య, సన్మఙ్గలస్నాతః ఇవ, జయశ్రియం ప్రతిపేదే ॥4.41॥

వాచ్యపరివర్తనమ్
తత్ర కాకుత్స్థేన ద్విషాం నారాచదుర్దినం విషహ్య, సన్మఙ్గలస్నాతేన ఇవ, జయశ్రీః ప్రతిపేదే

సరలార్థః
తత్ర రఘుః తథావిధి రిపు-శరధారాభిః అభిషిక్తో భూత్వా పశ్చాత్ విజయలక్ష్మీ చ లేభే, యథా కశ్చిత్ ప్రాక్ తీర్థసలిలధారాభిః అభిషిక్తో భూత్వా పశ్చాత్ రాజ్యలక్ష్మీం పరిగృహ్ణాతి

తాత్పర్యమ్
కాకుత్స్ఠవంశీయుడైన రఘువు అక్కడ (మహేంద్రపర్వతముపై) - శుభకర్మ నిమిత్తము స్నానము చేసిన వాడి వలె - శత్రువుల కురిపించిన బాణవర్షమును తట్టుకొని – జయలక్ష్మిని పొందాడు.

(శత్రువులు కురిపించిన బాణవర్షంలో స్నానం చేసి విజయాన్ని సాధించాడు. ఏదైనా మంగళకార్యం చేయాలనుకున్నవారు స్నానం చేస్తారు కదా, అలాగ.)

No comments:

Post a Comment