శ్లోకః
తత్రాక్షోభ్యం యశోరాశిం నివేశ్యావరురోహ
సః ।
పౌలస్త్యతులితస్యాద్రేరాదధాన ఇవ
హ్రియమ్ ॥4.80॥
పదవిభాగః
తత్ర-అక్షోభ్యం యశో-రాశిం నివేశ్య అవరురోహ సః । పౌలస్త్య-తులితస్య అద్రేః అదధాన ఇవ హ్రియమ్ ॥
అన్వయః
సః ( రఘుః) తత్ర (హిమాద్రౌ) అక్షోభ్యం యశోరాశిం నివేశ్య, పౌలస్త్యతులితస్య అద్రేః (కైలాసస్య) హ్రియమ్ ఆదధాన ఇవ అవరురోహ ॥4.80॥
వాచ్యపరివర్తనమ్
తేన తత్ర అక్షోభ్యం యశోరాశిం నివేశ్య, పౌలస్త్యతులితస్య
అద్రేః హ్రియమ్ ఆదధానేన ఇవ,
అవరురుహే ॥
సరలార్థః
స రఘుః ఇత్థం హిమాచలే అక్షయాం కీర్తిం
నిధాయ రావణతులితస్య కైలాసస్య లజ్జామ్ ఆదధాన ఇవ తస్మాత్ పర్వతాత్ అవతతార ॥
తాత్పర్యమ్
రఘువు - కదిలించడానికి
వీలుపడనంత కీర్తిని అక్కడ ఉంచి రావణుడిచేత తూచబడ్డ కైలాసశిఖరమునకు లజ్జను కలిగించి
(హిమాలయపర్వతాల నుంచి) క్రిందికి దిగాడు.
[రఘువు కీర్తి
కైలాసశిఖరము కన్నా ఎత్తుగా తెల్లగా ఉన్నదని భావము; ఒక రాజు జయించిన
ప్రాంతాన్ని మరో రాజు మళ్ళీ జయించకూడదు కాబట్టి కైలాసశిఖరాన్ని రఘువు అధిరోహించకుండానే
వెనుతిరిగాడట.]
No comments:
Post a Comment