శ్లోకః
నిర్వృష్టలఘుభిర్మేఘైర్ముక్తవర్త్మా సుదుఃసహః ।
ప్రతాపస్తస్య భానోశ్చ యుగపద్వ్యానశే దిశః ॥4.15॥
పదవిభాగః
నిర్వృష్ట-లఘుభిః మేఘైః ముక్త-వర్త్మా సుదుఃసహః । ప్రతాపః తస్య భానోః చ యుగపత్ వ్యానశే దిశః ॥
అన్వయః
నిర్వృష్టలఘుభిః మేఘైః ముక్తవర్త్మా (అత ఏవ) సుదుఃసహః తస్య (రఘోః) ప్రతాపః భానోః చ (ప్రతాపః) యుగపత్ దిశః వ్యానశే ॥4.15॥
వాచ్యపరివర్తనమ్
నిర్వృష్టలఘుభిః మేఘైః ముక్తవర్త్మనా సుదుఃసహేన తస్య ప్రతాపేన భానోః చ (ప్రతాపేన) యుగపత్ దిశః వ్యానశిరే ॥
సరలార్థః
శరత్కాలే జలశూన్యతయా మేఘాః రవిమార్గాత్ తిరోదధుః, తతశ్చ ప్రచణ్డతరస్య సూర్యస్య తేజోభిః సమ్పూర్ణమేవ గగనమణ్డలమ్ ఆపూరితం, తదా దిగ్విజయప్రవృత్తో రఘురపి ప్రతాపైః సకలమేవ దిగ్మణ్డలమ్ ఆపూరయామాస ॥
తాత్పర్యము
వాననీరు
లేక మబ్బులు తేలికపడడం వల్ల సూర్యుడి యొక్క ప్రతాపమూ, (బురద ఎండిపోయి)
మార్గాలు నిరాటంకమైనందున రఘుమహారాజు యొక్క ప్రతాపమూ దుస్సహమై ఏకకాలములో
దిక్కులందు వ్యాపించాయి.
[ఆకాశంలో మబ్బుల
ఉనికి సూర్యప్రతాపాన్ని అడ్డగిస్తుంది. వానాకాలపు బురద వల్ల మార్గాలు
సేనాసంచారానికి అనువుగా ఉండవు. శరదృతువులో సూర్యప్రతాపానికి అడ్డు
ఉండదు. రాజుల దండయాత్రలకూ అది అనుకూలమైన సమయము.]
No comments:
Post a Comment