Showing posts with label నిర్వృష్టలఘుభిర్మేఘైః. Show all posts
Showing posts with label నిర్వృష్టలఘుభిర్మేఘైః. Show all posts

Friday, September 7, 2018

రఘువంశమ్- 4.15


శ్లోకః
నిర్వృష్టలఘుభిర్మేఘైర్ముక్తవర్త్మా సుదుఃసహః
ప్రతాపస్తస్య భానోశ్చ యుగపద్వ్యానశే దిశః4.15

పదవిభాగః
నిర్వృష్ట-లఘుభిః మేఘైః ముక్త-వర్త్మా సుదుఃసహఃప్రతాపః తస్య భానోః చ యుగపత్ వ్యానశే దిశః

అన్వయః
నిర్వృష్టలఘుభిః మేఘైః ముక్తవర్త్మా (అత ఏవ) సుదుఃసహః తస్య (రఘోః) ప్రతాపః భానోః (ప్రతాపః) యుగపత్ దిశః వ్యానశే 4.15

వాచ్యపరివర్తనమ్
నిర్వృష్టలఘుభిః మేఘైః ముక్తవర్త్మనా సుదుఃసహేన తస్య ప్రతాపేన భానోః (ప్రతాపేన) యుగపత్ దిశః వ్యానశిరే

సరలార్థః
శరత్కాలే జలశూన్యతయా మేఘాః రవిమార్గాత్ తిరోదధుః, తతశ్చ ప్రచణ్డతరస్య సూర్యస్య తేజోభిః సమ్పూర్ణమేవ గగనమణ్డలమ్ ఆపూరితం, తదా దిగ్విజయప్రవృత్తో రఘురపి ప్రతాపైః సకలమేవ దిగ్మణ్డలమ్ ఆపూరయామాస

తాత్పర్యము
వాననీరు లేక మబ్బులు తేలికపడడం వల్ల సూర్యుడి యొక్క ప్రతాపమూ, (బురద ఎండిపోయి) మార్గాలు నిరాటంకమైనందున రఘుమహారాజు యొక్క ప్రతాపమూ దుస్సహమై ఏకకాలములో దిక్కులందు వ్యాపించాయి.
[ఆకాశంలో మబ్బుల ఉనికి సూర్యప్రతాపాన్ని అడ్డగిస్తుంది. వానాకాలపు బురద వల్ల మార్గాలు సేనాసంచారానికి అనువుగా ఉండవు. శరదృతువులో సూర్యప్రతాపానికి అడ్డు ఉండదు. రాజుల దండయాత్రలకూ అది అనుకూలమైన సమయము.]